BigTV English

OTT Movie : ప్రతీ రాత్రీ మాయం… తమ్ముడికి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే అన్నయ్య

OTT Movie : ప్రతీ రాత్రీ మాయం… తమ్ముడికి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే అన్నయ్య

OTT Movie : ఒకప్పుడు కొరియన్ మూవీస్ అంటే ఎవరికీ  పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ పుణ్యమా అని అందరూ చూడగలుగుతున్నారు. ఈ రోజుల్లో హాలీవుడ్ మూవీస్ తర్వాత అంతగా పాపులర్ అవుతున్న మూవీస్ కొరియన్ మూవీస్ అనే చెప్పాలి. కొరియన్ మూవీస్ ఎంతగా పాపులర్ అయ్యాయి అంటే ఆ వెబ్ సిరీస్ ని మన ప్రేక్షకులు తెలుగు సీరియల్స్ ను చూసే విధంగా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? పేరు ఏమిటి ? తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ (Netflix)

ఈ కొరియన్ థ్రిల్లర్ మూవీ పేరు “ఫర్ గాటెన్” (Forgotten). ఈ కొరియన్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో హీరో కి తల్లిదండ్రులతో పాటు ఒక అన్నయ్య కూడా ఉంటాడు. వీరు కొత్త ఇంటిలోకి వెళతారు. అక్కడ సంతోషంగా ఉంటున్న ఈ ఫ్యామిలీకి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అన్నదమ్ములు ఇద్దరూ నిద్రపోతున్నప్పుడు వీరి రూమ్ లో వింత శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలు హీరోకి వినబడతాయి. మరుసటి రోజు తన అన్నకు ఈ విషయం చెప్పగా, నాకు వినపడలేదని హీరోకి చెప్తాడు. అదే రోజు హీరో అన్నయ్య బయటకి వెళ్లగా అతనిని కొంతమంది అపరిచితులు కిడ్నాప్ చేస్తారు. కంగారు పడిన హీరో పోలీసులకి ఫిర్యాదు చేస్తాడు. కొద్దిరోజుల తర్వాత హీరో అన్నయ్య తిరిగి ఇంటికి వస్తాడు. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు ? అని అతనిని అడుగుతారు కుటుంబ సభ్యులు. తనకు మత్తు మందు ఇచ్చి తీసుకువెళ్లారని, తనకు అంత వరకే తెలుసు అని సమాధానం చెప్తాడు. అయితే రాత్రి పడుకున్న తర్వాత మధ్యలో నిద్రలేచి బయటకి వెళుతూ ఉంటాడు హీరో అన్నయ్య.

ఈ విషయం గమనించిన హీరో, వాళ్ళ అన్నయ్యని రాత్రి ఎక్కడికి వెళ్లావు ? అని అడుగుతాడు. దానికి వాళ్ళ అన్నయ్య నేను ఎక్కడికీ వెళ్లలేదు, ఇక్కడే పడుకున్నాను అని అబద్ధం చెప్తాడు. అదే రోజు రాత్రి మళ్లీ వింత శబ్దాలు రావడం హీరో గమనిస్తాడు. ఆ వింత శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని వెళతాడు. ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? హీరో అన్నని కిడ్నాప్ చేసింది ఎవరు? హీరో అన్న రాత్రి పూట బయటకి ఎందుకు వెళ్తున్నాడు? అనే విషయాలను తీసుకోవాలనుకుంటే నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఫర్ గాటెన్” (Forgotten) మూవీని చూడాల్సిందే. ఈ మూవీలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఈ మూవీలో ప్రతి సన్నివేశం నెక్స్ట్ సీన్ ఏమవుతుందో అనే టెన్షన్ పెడుతుంది. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ మూవీ పై ఓ లుక్ వేయండి. ఈ మూవీని గుండె ధైర్యం ఉన్న వాళ్ళే చూడగలుగుతారు.

Related News

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

OTT Movie : భర్త ఇంట్లో లేడని బాయ్ ఫ్రెండ్ ను పిలిచే భార్య… నెక్స్ట్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నాలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో అమ్మాయిలతో ఆ పాడు యాపారం… కూతురు కూడా అదే పని… వర్త్ వాచింగ్ మూవీ

OTT Movie : మొదటి రాత్రే పెళ్ళానికి షాక్… భర్తకు మ్యాటర్ వీక్… కడుపుబ్బా నవ్వించే బ్లాక్ కామెడీ మూవీ

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

Big Stories

×