BigTV English

OTT Movie : కంఫర్ట్ ఉమెన్ పేరుతో బందీలు చేసే సైనికులు… ఈ అమ్మాయిల ఏం చేస్తారో తెలుసా?

OTT Movie : కంఫర్ట్ ఉమెన్ పేరుతో బందీలు చేసే సైనికులు… ఈ అమ్మాయిల ఏం చేస్తారో తెలుసా?

OTT Movie : యుద్ధాలు జరుగుతున్నప్పుడు సైనికులు జరిపే కాల్పుల గురించి, వారు చేసే విన్యాసాల గురించి అందరూ చెప్పుకుంటారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన ఒక అమానుష సంఘటన గురించి తెలుసుకుందాం. జపనీస్ సైనికులు తమ కోరికలను తీర్చుకోవడానికి కొరియన్ అమ్మాయిలను బంధించి ఘోరంగా అఘాయిత్యం చేసేవాళ్ళు. రియల్ గా జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.  ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ కొరియన్ మూవీ పేరు ‘స్పిరిట్స్ హోమ్ కమింగ్‘ (Spirits home coming). ఈ మూవీకి చో జంగ్-రే దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 24, 2016న దక్షిణ కొరియాలో విడుదలైంది. ఆర్థిక సమస్యల కారణంగా సినిమా నిర్మాణం చాలాసార్లు ఆగిపోయింది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు తగిన థియేటర్లు లేకపోవడంతో ప్రదర్శన వాయిదా పడింది. అయితే, ప్రజలు ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేసి, ఎక్కువ థియేటర్లలో సినిమాను ప్రదర్శించాలని పిటిషన్లు ఇచ్చారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికులు అమ్మాయిలపై జరిపిన అఘాయిత్యాల గురించి మీడియాకు ఒక వృద్ధురాలు ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. జంగ్ అనే అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి హ్యాపీగా జీవిస్తూ ఉంటుంది. 1943లో జపాన్ ఆధీనంలో కొరియా ఉంటుంది. జపాన్ సైనికులు చాలామంది అమ్మాయిలను తమ వాంఛలను తీర్చుకునేకి తీసుకువెళ్తారు. ఈ క్రమంలోనే జంగ్ అనే అమ్మాయిని కూడా తీసుకెళ్లి పోతారు. వీళ్లకు కంఫర్ట్ ఉమెన్ అనే పేరు పెడతారు. వీళ్లను ఒకచోట బంధించి కనికరం లేకుండా ఆ పని చేస్తూ ఉంటారు. అక్కడ జపనీస్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడాలి, కొరియన్ లాంగ్వేజ్ మాట్లాడితే నిర్దక్షిణంగా చంపేస్తూ ఉంటారు. జంగ్ దగ్గరికి వచ్చిన ఒక సైనికుడు కాస్త మంచివాడు అవ్వటంతో, ఆమె ను తప్పించుకోవడానికి సాయం చేస్తాడు. అయితే వీళ్ళు ఆ సైనికులకు దొరికిపోతారు. సాయం చేసిన సైనికున్ని చంపేస్తారు. యుద్ధం ముగింపు దశకు వస్తూ ఉండటంతో ఈ అమ్మాయిలను అందరినీ చంపడానికి చూస్తారు జపనీస్ సైనికులు. అయితే అక్కడికి వచ్చిన రష్యన్ సైనికులు జపాన్ సైనికులను అంతం చేస్తుంది.

ఆ తర్వాత బ్రతికి ఉన్న ఈ మహిళలు వారి స్వస్థలాలకు వెళ్తారు. ఈ స్టోరీని ఇంటర్వ్యూలో చెబుతుంది వృద్ధురాలు. ఈ వృద్ధురాలు ఒక శరణాలయాన్ని నడుపుతూ ఉంటుంది. అందులోకి తల్లిదండ్రులను కోల్పోయిన ఒక అమ్మాయి ఈమె దగ్గరకు వస్తుంది. అయితే ఈ అమ్మాయికి ఆ వృద్ధురాలు దగ్గర ఉన్న కొన్ని వస్తువులను తాకగానే, యుద్ధంలో జరిగిన సన్నివేశాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. వారు చేసిన ఘోరాలను ఆమె కళ్ళముందే జరిగినట్టు కనిపిస్తూ ఉంటాయి. చివరికి ఆ వృద్ధురాలు దగ్గరికి వచ్చిన ఈ అమ్మాయి కి ఆ సంఘటనలు ఎలా గుర్తుకు వస్తున్నాయి? ఆ వృద్ధురాలు ఎవరు? జంగ్ తన ఫ్యామిలీతో కలిసి ఉంటుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×