BigTV English

OTT Movie : కోమాలో ఉన్న అమ్మాయి ప్రెగ్నెంట్… ఇలాంటి సినిమాను జీవితంలో చూసి ఉండరు భయ్యా

OTT Movie : కోమాలో ఉన్న అమ్మాయి ప్రెగ్నెంట్… ఇలాంటి సినిమాను జీవితంలో చూసి ఉండరు భయ్యా

OTT Movie : మాడ్రిడ్‌లో ఇద్దరు పురుషులు కోమాలో ఉన్న స్త్రీలను ప్రేమిస్తుంటారు. ఒక నర్స్ తన రోగిని ఆరాధిస్తూ, ఆమెతో గంటల తరబడి మాట్లాడుతాడు. కానీ అతని ప్రేమ హద్దులు కూడా దాటిపోతుంది. మరో వైపు ఒక జర్నలిస్ట్ తన ప్రేమను కోల్పోయిన బాధలో, కోమా లోకి వెళ్ళిన ప్రియురాలు తిరిగి మామూలు మనిషి అవుతుందని ఆశతో ఉంటాడు. ఈ ఇద్దరి లవ్ స్టోరీ ఊహించని మలుపుల తీసుకుంటుంది. ఈ మలుపులు ఏంటి ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం.


స్టోరీలోకి వెళితే

బెనిగ్నో మార్టిన్, మార్కో జుల్వాగా అనే ఇద్దరు పురుషులు, కోమాలో ఉన్న అలిసియా, లిడియా లను ప్రేమిస్తుంటారు. ఈ కథ ఫ్లాష్‌బ్యాక్‌లు, నాన్-లీనియర్ నరేషన్ ద్వారా నడుస్తుంది. బెనిగ్నోసున్నితమైన మనస్తత్వం కలిగి ఉండే ఒక మేల్ నర్స్. అతను కోమాలో ఉండే అలిసియాకు సంరక్షకుడుగా ఉంటాడు. ఆమె ఒక బ్యాలెట్ డాన్సర్, ఒక కారు ప్రమాదం తర్వాత కోమాలోకి వెళ్తుంది. అలిసియా కోమాకు ముందు, బెనిగ్నో ఆమెను రహస్యంగా ఆరాధించేవాడు. ఆమె డాన్స్ స్టూడియోను, ఇంటి నుండి గమనించేవాడు. అయితే కోమాలో ఉన్న అలిసియాతో బెనిగ్నో గంటల తరబడి మాట్లాడతాడు. ఆమె జీవితంలోని విషయాలను, డాన్స్‌లను, తన భావోద్వేగాలను పంచుకుంటాడు. ఆమే తన ప్రపంచం అన్నట్లుగా చూస్తాడు. మొదట అమాయకంగా కనిపించినప్పటికీ, అది సరిహద్దులను దాటుతుంది. ఆమెతో సన్నిహితంగా గడుపుతాడు.


మరో వైపు ఒక జర్నలిస్ట్ అయిన మార్కో, లిడియా అనే ఒక మహిళా బుల్‌ఫైటర్ తో సంబంధంలో ఉంటాడు. ఆమె ఒక బుల్‌ఫైట్ సమయంలో గాయపడి కోమాలోకి వెళ్తుంది. మార్కో, లిడియా పక్కన కూర్చుంటాడు. కానీ బెనిగ్నోలా మాట్లాడగలిగే సామర్థ్యం అతనికి ఉండడు. ఆమె కోమా నుండి మేల్కొంటుందనే ఆశతో ఎదురుచూస్తుంటాడు. బెనిగ్నో, మార్కో ఆసుపత్రిలో ఒకరి ఒంటరితనాన్ని ఒకరు గుర్తిస్తారు. బెనిగ్నో మార్కోను లిడియాతో మాట్లాడమని ప్రోత్సహిస్తాడు. కోమాలో ఉన్నవారు వినగలరని నమ్ముతాడు. వీళ్ళ సంబంధం ఒక స్నేహంగా మారుతుంది. ఈ క్రమంలో కోమాలో ఉన్న అలిసియా ప్రెగ్నెంట్ అవుతుంది. అక్కడ ఉన్న డాక్టర్లకు ఈ విషయం తెలిసి షాక్ అవుతారు. చివరికి అలిసియా ఎవరివల్ల ప్రెగ్నెంట్ అవుతుంది ? ఆమె కోమాలో నుంచి బయటికి వస్తుందా ? ఈ లవ్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : నేషనల్ హాలీడే… చికెన్ ముక్క కోసం చిన్నారి ఆరాటం… ఈ కన్నడ కామెడీకి కడుపు చెక్కలే

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ మిస్టరీ డ్రామా మూవీపేరు ‘టాక్ టు హర్’ (Talk to Her). ఈ సినిమాకి పెడ్రో అల్మోడోవర్ దర్శకత్వం వహించారు. ఇందులో జావియర్ కామరా (బెనిగ్నో), డారియో గ్రాండినెట్టి (మార్కో), లియోనర్ వాట్లింగ్ (అలిసియా), రోసారియో ఫ్లోర్స్ (లిడియా), జెరాల్డిన్ చాప్లిన్ (కాటరినా) వంటి నటులు నటించారు. 1 గంట 52 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.9/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×