Investigative Comedy: ప్రాణంగా చూసుకునే కుక్క కనిపించకుండా పోయింది. దాన్ని వెతుక్కుంటూ బయల్దేరిన ఓ స్కూల్ బాలుడికి… ఊహించని మరో మిస్సింగ్ కేసు గురించి తెలుస్తుంది. ఒకవైపు తన పెంపుడు కుక్క కోసం బాలుడి అన్వేషణ, మరోవైపు తన యజమాని కోసం ఓ నమ్మకమైన కుక్క చేసే ప్రయత్నం… ఈ రెండు కథలు ఒకే మిస్టరీ దగ్గరికి చేరితే ఏం జరుగుతుంది ? మనుషులు, పెంపుడు జంతువుల బంధంతో పాటు క్రైమ్, మిస్టరీని కలిపిన సినిమా ‘ఓ మై డాగ్’ (Ohh My Dog). మరి ఈ డిఫరెంట్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అంటే ?
సినిమాలో ఓ స్కూల్ బాలుడికి తన పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టం. రోజూ దానితో గడిపే అతడి జీవితంలో ఒక్కసారిగా పెద్ద సమస్య ఎదురవుతుంది. అతడికి ఎంతో ఇష్టమైన కుక్క సడన్ గా కనిపించకుండా పోతుంది. మొదట అది ఎక్కడికైనా వెళ్లి ఉంటుందని లైట్ తీసుకుంటాడు. కానీ కుక్క తిరిగి రాకపోవడంతో వెతకడం స్టార్ట్ చేస్తాడు ఆ బాలుడు. ఎంత వెతికినా దాని జాడ కనిపించదు. కుక్కను తిరిగి ఇంటికి తీసుకురావాలనే పట్టుదలతో బాలుడు స్వయంగా దాని కోసం వెతకడం మొదలుపెడతాడు.
అతడి అన్వేషణ క్రమంగా ఊహించని విషయాలను బయటకు తీసుకొస్తుంది. కుక్క కనిపించకుండా పోవడం వెనుక ఏదో కారణం ఉందనే అనుమానం అతడిలో పెరుగుతుంది. ఇదే సమయంలో మరోవైపు ఓ వ్యక్తి కనిపించకుండా పోతాడు. అతడికి ఎంతో నమ్మకంగా ఉండే కుక్క మాత్రం తన యజమాని కోసం వెతుకుతూ తిరుగుతుంది. ఈ రెండు సంఘటనలు వేర్వేరు దారుల్లో జరుగుతున్నట్టుగా కనిపించినా… కథ ముందుకు వెళ్లేకొద్దీ వాటి మధ్య ఉన్న లింకు ఏంటనేది అర్థం అవుతుంది.
బాలుడి అన్వేషణలో కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు తారసపడతారు. అలాగే మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఎదురవుతాయి. చిన్న వయసులోనే ఓ డిటెక్టివ్ లా ఆలోచిస్తూ తన కుక్కను వెతికే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మరోవైపు తన మనిషిని వెతికే కుక్క ప్రయాణం కూడా భావోద్వేగంగా సాగుతుంది. మిస్సైన కుక్క, కనిపించకుండా పోయిన వ్యక్తి వెనుక ఉన్న అసలు విషయం ఏంటి ? ఆ రెండు కథలూ ఒకే చోట కలిసే సంఘటన ఏంటి ? చివరికి ఏమైంది ? అనేది తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.
పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi), రాజేశ్ కుమార్, గీతా అగర్వాల్ శర్మ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఓ మై డాగ్’కు అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇది హిందీ మిస్టరీ, ఇన్వెస్టిగేటివ్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. హిందీ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది.
Read Also: చేతిలో చిన్న పడవ… ముందేమో అంతులేని సముద్రం… ఓటీటీలోకి తెలుగులో అదిరిపోయే అడ్వెంచర్ సిరీస్