Noise Homestage Soundbar: స్మార్ట్‌వాచ్‌లు, ఈయర్‌బడ్స్ విభాగాల్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయిస్ బ్రాండ్ ఇప్పుడు హోమ్ ఆడియో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా ‘హోమ్‌స్టేజ్’ పేరుతో కొత్త సౌండ్‌బార్ సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వేర్వేరు గదుల పరిమాణాలు, బడ్జెట్‌లను దృష్టిలో పెట్టుకుని మొత్తం నాలుగు మోడళ్లను కంపెనీ తీసుకొచ్చింది. వీటిలో 700 వాట్స్ వరకు పీక్ అవుట్‌పుట్, డాల్బీ అట్మాస్, వైర్‌లెస్ రియర్ శాటిలైట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
హోమ్‌స్టేజ్ సిరీస్‌లో ప్రీమియం మోడల్ HomeStage 5.2.4. ఇది 700W పీక్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. రియల్ డాల్బీ అట్మాస్‌తో పాటు నాలుగు హైట్ ఛానెల్స్ ఉండటంతో 3D ఆడియో అనుభూతిని అందించేలా దీన్ని రూపొందించారు. రెండు 6.5-అంగుళాల వైర్డ్ సబ్‌వూఫర్లు, వైర్‌లెస్ రియర్ శాటిలైట్లు ఇందులో ఉన్నాయి. టచ్ కంట్రోల్స్‌తో పాటు బేస్, ట్రెబుల్‌ను అవసరానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది.
Also Read: ఇలాంటి డివైజ్ ఒక్కటి ఉంటే చాలు.. ఫోన్, వాలెట్, తాళాలు ఎక్కడున్నా నిమిషాల్లో పట్టేయవచ్చు!
తక్కువ బడ్జెట్‌లో సౌండ్‌బార్ కొనాలనుకునే వారికి HomeStage 2.1 మోడల్ అందుబాటులో ఉంది. ఇది 90W అవుట్‌పుట్‌తో చిన్న గదులకు అనుకూలంగా ఉంటుంది. HomeStage 3.2 మోడల్ 200W అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇక వైర్‌లెస్ శాటిలైట్లతో కూడిన HomeStage 5.1 మోడల్ 500W అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
ఈ సౌండ్‌బార్ సిరీస్‌లో Bluetooth 5.3, HDMI ARC, ఆప్టికల్, USB, AUX వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. వార్తలు, మ్యూజిక్, సినిమాల కోసం ఆడియోను మార్చుకునేందుకు కస్టమ్ EQ మోడ్‌లను కూడా అందించారు. టీవీతో పాటు మొబైల్ నుంచి మ్యూజిక్ వినేందుకు కూడా వీటిని ఉపయోగించవచ్చు.
నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సౌండ్‌బార్లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. HomeStage 2.1 ధర రూ.4,999గా ఉంది. HomeStage 3.2 ధర రూ.8,999 కాగా.. HomeStage 5.1 ధర రూ.14,999. టాప్ మోడల్ HomeStage 5.2.4 ధర రూ.24,999గా నిర్ణయించారు. చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ తరహా సెటప్ వరకు వివిధ అవసరాలకు అనుగుణంగా ఈ సిరీస్‌ను ఎంచుకోవచ్చు.
Also Read: ఫిట్‌నెస్ ప్రియులకు ఇదొక్కటి చాలు.. గుండె వేగం నుంచి ఆక్సిజన్ వరకు అన్నీ ఈ బ్యాండ్ గుప్పిట్లోనే!