BigTV English

OTT Movie : రాత్రి పూటే ప్రతాపం చూపించే సూపర్ హీరో… ఒక్కొక్కడికి చుక్కలే… తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : రాత్రి పూటే ప్రతాపం చూపించే సూపర్ హీరో… ఒక్కొక్కడికి చుక్కలే… తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : మార్వెల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకేనేమో ఈ సంస్థ సినిమాలతో పాటు సూపర్ హీరో సిరీస్ లతో కూడా మూవీ లవర్స్ ను అలరిస్తోంది. అలా మార్వెల్ తీసిన మరో సూపర్ హీరో సిరీసే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ సిరీస్ ఒకే ఒక్క సీజన్ ఓటీటీలోకి వచ్చింది. అందులోనూ 6 ఎపిసోడ్లు మాత్రమే ఉంది. అయినా కూడా అదరగొడుతోంది. మరి ఈ సిరీస్ పేరేంటి? ఏ ఓటీటీలలో ఉందో తెలుసుకుందాం పదండి.


జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ సిరీస్ పేరు ‘Moon Knight’. మార్వెల్ కామిక్స్ ఆధారంగా తీసిన అమెరికన్ టీవీ మినీసిరీస్. ఒక వ్యక్తి డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ (DID), ఈజిప్షియన్ దేవతలతో అతని సంబంధం చుట్టూ తిరిగే రహస్యమైన కథ. ఇది సైకలాజికల్ థ్రిల్లర్, సూపర్‌ హీరో యాక్షన్, సూపర్‌ నాచురల్ హారర్, మిస్టరీ కలిసిన సిరీస్. ఈజిప్షియన్ పురాణాలు, ట్విస్ట్‌లతో సైకలాజికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది, ఈ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


కథలోకి వెళ్తే…

స్టీవెన్ గ్రాంట్ (ఆస్కార్ ఐజాక్) లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో గిఫ్ట్ షాప్ ఉద్యోగి. అతను నిద్రలో బ్లాక్‌ అవుట్‌లతో బాధపడతాడు. స్టీవెన్‌కు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ (DID) ఉందని, అతను మార్క్ స్పెక్టర్ అనే మెర్సినరీతో శరీరాన్ని పంచుకుంటున్నాడని తెలుస్తుంది. మార్క్ ఈజిప్షియన్ చంద్ర దేవుడు ఖోన్షు అవతార్. అతను మూన్ నైట్‌గా శత్రువులతో పోరాడుతాడు. స్టీవెన్ ఒకరోజు రాత్రి ఆస్ట్రియన్ ఆల్ప్స్‌లో మేల్కొని, ఆర్థర్ హారో (ఈథన్ హాక్) అనే కల్ట్ లీడర్‌ ను ఎదుర్కొంటాడు. అతను ఈజిప్షియన్ దేవత అమ్మిట్‌ ను తిరిగి లేపడానికి ప్రయత్నిస్తాడు. స్టీవెన్, మార్క్ తమ శరీరంపై కంట్రోల్ కోసం పోరాడుతూ, లైలా ఎల్-ఫౌలీ (మే కలమావీ) అనే స్త్రీ సహాయంతో హరోను ఆపడానికి ఈజిప్ట్‌కు వెళతారు.

ఈ క్రమంలోనే మార్క్ గతంలోని ఒక బాధాకరమైన సంఘటన వెల్లడవుతుంది: అతని సోదరుడు రాండల్ ఒక గుహలో గొడవలో చనిపోతాడు. దీని వల్ల అతని తల్లి అతన్ని ద్వేషిస్తుంది, ఇది అతని DIDకి కారణమవుతుంది. ఖోన్షు మార్క్‌ ను మానిపులేట్ చేస్తాడు. ఒకవేళ మార్క్ విఫలమైతే లైలాను తన అవతార్‌గా మార్చుతానని బెదిరిస్తాడు. హరో, అమ్మిట్ ప్రపంచాన్ని న్యాయమైన వారితో మాత్రమే నడపాలని ప్లాన్ చేస్తారు. కానీ మార్క్, స్టీవెన్, మూన్ నైట్ వారిని ఆపడానికి పోరాడతారు. లైలా అమ్మిట్‌కు వ్యతిరేకంగా ఈజిప్షియన్ దేవతల సహాయంతో స్కార్లెట్ స్కారబ్‌గా మారుతుంది. చివరి ఎపిసోడ్‌లో షాకింగ్ ట్విస్ట్‌తో కథ ముగుస్తుంది. మరి ఇంతకీ మార్క్ విలన్ ను ఆపగలిగాడా? లైలా పరిస్థితి ఏంటి? లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

Read Also : భూగర్భంలో నీడల్లాంటి మనుషులు… రూపాన్ని దోచేసే రాక్షసులు… రోమాలు నిక్కబొడుకునే హర్రర్ సీన్లు

Related News

OTT Movie : లవర్స్ మధ్యలో మరో అమ్మాయి… మెంటలెక్కించే తుంటరి పనులు…. ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : అద్దాల ఇంట్లో అనాథ పిల్లలు… అడుగడుగునా ఆరాచకమే… అబ్బాయిని కట్టేసి అలాంటి పనులా భయ్యా

Thriller Movie in OTT : ఇదేం సినిమా రా అయ్యా.. బుర్ర మొత్తం ఖరాబ్ చేస్తుంది… ఒంటరిగా చూడకండి..

OTT Movie : రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్‌తో 4.5 గ్యాంగ్ ఫైట్… రెస్పెక్ట్ కోసం పాలు, పూల మాఫియాలోకి… కితకితలు పెట్టే మలయాళ కామెడీ సిరీస్

OTT Movie : సమ్మర్ క్యాంపుకు వెళ్లి కిల్లర్ చేతికి చిక్కే అమ్మాయిలు… వణుకు పుట్టించే సీన్స్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ఇండియా చరిత్రలోనే అతిపెద్ద కాల్ సెంటర్ స్కామ్‌… రియల్ స్టోరీ మాత్రమే కాదు, ఇది కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×