BigTV English

OTT Movie : నిందితుడి భార్యపై కన్నేసే పోలీస్ ఆఫీసర్… బాసిల్ జోసెఫ్ మసాలా క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : నిందితుడి భార్యపై కన్నేసే పోలీస్ ఆఫీసర్… బాసిల్ జోసెఫ్ మసాలా క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో బాసిల్ జోసెఫ్ సినిమాలకి ఏమాత్రం క్రేజ్ తగ్గటం లేదు. రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే వీటిలో డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ శైలిలో వచ్చిన ఒక మూవీ, ఊహించని రీతిలో దూసుకుపోతోంది. ఇందులో ఒక హత్య కేసులో, పదకొండు మంది అనుమానితులు ఉంటారు. వీళ్ళ చుట్టూ  ఈ స్టోరీ తిరుగుతుంది. ఇందులో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల మతిపోగొట్టేలా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


సోనీ లీవ్ (SonyLIV) లో 

ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ Pravinkoodu Shappu’. 2025 లో వచ్చిన ఈ సినిమాకి శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చాందిని శ్రీధరన్, చెంబన్ వినోద్ జోస్, శివజిత్, షబరీష్ వర్మ ప్రధాన పాత్రలలో నటించారు. ఇది అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా నిర్మించబడింది. 2025 జనవరి 16న థియేటర్లలో విడుదలైంది. 2025 ఏప్రిల్ 11 నుండి SonyLIV లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక కళ్ళు దుకాణంలో జరిగిన హత్య చుట్టూ తిరిగే నాన్-లీనియర్ కథనంతో కూడిన ఒక మిస్టరీ థ్రిల్లర్.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ కేరళలోని త్రిస్సూర్‌లోని మాప్రణం అనే గ్రామంలోని ఒక కళ్ళు దుకాణం చుట్టూ తిరుగుతుంది. ఒక రోజు రాత్రి ఈ దుకాణం మూసివేసిన తర్వాత, 11 మంది వ్యక్తులు లోపల ఉండి, పేకాట ఆడుతూ, మద్యం సేవిస్తూ గడుపుతారు. వారిలో ఈ దుకాణం యజమాని కొంబన్ బాబు, ఒక టీచర్, ఒక రౌడీ, షాపు కేర్‌టేకర్ కన్నన్ (సౌబిన్ షాహిర్), అతని భార్య మెరిందా (చాందిని శ్రీధరన్), సునీ (చెంబన్ వినోద్ జోస్) వంటి వ్యక్తులు ఉంటారు. మరుసటి రోజు ఉదయం, కొంబన్ బాబు షాపు మధ్యలో ఉరివేసుకుని చనిపోయినట్లు కనిపిస్తాడు. మొదట ఆత్మ హత్యాగా భావించినా, ఆ తరువాత ఇది ఒక హత్యగా నిర్ధారణ అవుతుంది.

ఈ హత్య దర్యాప్తును సబ్-ఇన్‌స్పెక్టర్ సంతోష్ సిజె (బాసిల్ జోసెఫ్) చేపడతాడు. అతను తన విచిత్రమైన శైలితో, దర్యాప్తు చేయడంలో ఆరితేరిన ఒక పోలీసు అధికారి. సంతోష్ ఈ హత్య వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడాన్నిషాపులో ఉన్న 11 మంది వ్యక్తులను విచారిస్తాడు. వీరిలో చాలామందికి బాబుతో వ్యక్తిగత గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కథ నాన్-లీనియర్ శైలిలో నడుస్తుంది. ప్రతి పాత్ర ద్వారా ఫ్లాష్‌బ్యాక్‌లు, కొత్త విషయాలతో మర్డర్ వెనుక ఉన్న రహస్యాలు క్రమంగా తెలుస్థాయి.

ఇక ఈ స్టోరీలో మాజిషియన్ అయిన కన్నన్ భార్య మెరిందాకు, బాబుతో సంబంధం ఉన్నట్లు పుకార్లు వస్తాయి. మరో వైపు సునీ అనే గుండాకి, బాబుతో వ్యాపార గొడవలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దర్యాప్తు మరింత లోతుగా వెళుతుంది. కన్నన్, మెరిందా రహస్యాలు, సునీ రియల్ ఎస్టేట్ డీల్‌ వెనుక ఉన్న సీక్రెట్స్ బయటపడతాయి. ఇది ఇలా ఉంటే ఇన్‌స్పెక్టర్ సంతోష్ సిజె, కన్నన్ భార్యకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ స్టోరీ క్లైమాక్స్ వరకూ ఊహించని ట్విస్టులతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. చివరికి ఆ మర్డర్ మిస్టరీని ఇన్‌స్పెక్టర్ బయటపెడతాడా ? కొంబన్ బాబును హత్య చేసింది ఎవరు ? ఎందుకు చేశారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : బ్యూటీ పార్లర్ ముసుగులో అమ్మాయిల అరాచకం… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×