OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ స్టోరీలతో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. భాషతో సంబంధం లేకుండా వీటిని ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. ఈ జానర్ లో వచ్చిన ఒక బాలీవుడ్ సిరీస్ ఉత్కంఠభరిత ట్విస్టులతో నడుస్తోంది. ఈ సిరీస్ మొదటినుంచి, చివరివరకు ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇందులో ఒక కామన్ మ్యాన్ దోపిడీ ఆరోపణలను ఎదుర్కుంటూ, స్టోరీని ఆసక్తికరంగా నడిపిస్తాడు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
జియో సినిమాలో స్ట్రీమింగ్
‘Rafuchakkar’ ఒక హిందీ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. రితమ్ శ్రీవాస్తవ్ దీనికి దర్శకత్వం వహించారు. 9 ఎపిసోడ్‌లు, సుమారు 40–50 నిమిషాల రన్‌టైమ్ తో 2023 జూన్ 15న JioCinemaలో రిలీజ్ అయ్యింది. ఇది తెలుగులో కూడా స్ట్రీమింగ్‌లో ఉంది. ఇందులో మనీష్ పాల్ (పవన్ కుమార్/ప్రిన్స్), ప్రియా బాపట్ (రీతు), అక్ష పర్దాసనీ (షౌర్య) ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో దీనికి 5.9/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళ్తే
పవన్ కుమార్ నైనిటాల్ నుంచి వచ్చిన ఒక సింపుల్ వ్యక్తి. ప్రిన్స్ అనే పేరుతొ దోపిడీలు చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటాడు. డైట్ బిస్కెట్స్, లో-కాస్ట్ ఎయిర్‌లైన్స్ వంటి విచిత్రమైన మోసాలతో కరప్ట్ రిచ్ పీపుల్‌ని టార్గెట్ చేస్తున్నాడని అతనిమీద ఆరోపణలు వస్తాయి. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ షౌర్య, సర్వేష్ పఠానియా అనే ప్రముఖ వ్యక్తిని మోసం చేశాడని అతన్ని అరెస్ట్ చేస్తుంది. కోర్ట్‌లో పవన్‌ని తన చిన్ననాటి ఫ్రెండ్ జైదేవ్ డిఫెండ్ చేస్తాడు. రీతు భండారీ ప్రాసిక్యూటర్‌గా ఉంటుంది. పవన్ నిజంగా కాన్‌మ్యానా, లేక నీతిమంతుడిగా చిక్కుకున్నాడా అనే సస్పెన్స్ కథని నడిపిస్తుంది.
కోర్ట్ డ్రామాలో, పవన్ గత జీవితం, అతని మోసాల గురించి ట్విస్ట్‌లు బయటపడతాయి. షౌర్య ఇన్వెస్టిగేషన్‌లో పవన్ అలియాస్ కీర్తన్ గడా, ఫిట్‌నెస్ ట్రైనర్ అనే అమ్మాయిలను మోసం చేసే పాత్రలు రివీల్ అవుతాయి. మూడు కొత్త విట్‌నెస్‌లు అహ్మదాబాద్ నుంచి వచ్చి, పవన్ మోసం గురించి చెబుతారు. రీతు పాలిగ్రాఫ్ టెస్ట్ డిమాండ్ చేస్తుంది, పవన్ కేసు క్లిష్టమవుతుంది. జైదేవ్ పవన్‌ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు, సర్వేష్ పఠానియా ఇల్లీగల్ యాక్టివిటీస్‌ని ఎక్స్‌పోజ్ చేస్తాడు. క్లైమాక్స్‌లో, పవన్ ఒక సర్‌ప్రైజ్ సేవియర్‌తో కేస్‌ని తన ఫేవర్‌లో టర్న్ చేస్తాడు. కానీ స్టోరీ కన్ఫ్యూజింగ్‌గా, అన్‌రిసాల్వ్‌డ్ ప్రశ్నలతో ముగుస్తుంది.
Read Also : హత్య కేసు ఒక్కటే… ట్విస్టులు మాత్రం బోలెడు… మతిపోగోట్టే మలయాళ మర్డర్ మిస్టరీ