E-Paper
Advertisement

తండ్రిని కాదని ప్రేమికురాలి కోసం వెళ్తే… దెబ్బకు గుర్తొచ్చే గత జన్మ…

తండ్రిని కాదని ప్రేమికురాలి కోసం వెళ్తే… దెబ్బకు గుర్తొచ్చే గత జన్మ…
Advertisement

Fantasy Telugu Romantic Movie: తండ్రి కోరుకున్నట్లు డాక్టర్ కావాలా ? లేక తనకు నచ్చిన ఫ్యాషన్ డిజైనింగ్‌లో కెరీర్ కొనసాగించాలా ? ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఓ యువకుడి జీవితంలోకి అమ్మాయి వస్తుంది. ఆమెను కలిసిన తర్వాత అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే… ఆమెతో అతనికి ఈ జన్మలోనే కాదు, గత జన్మలోనూ ఓ బలమైన బంధం ఉంటుంది. వందల ఏళ్ల క్రితం అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రేమకథ, ప్రస్తుత జన్మలో మళ్లీ మొదలైతే ? ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఫాంటసీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘రాజా ది రాజా’ (Rajaa The Raja). మరి రాజా, ఆధ్యకు గత జన్మలో ఉన్న సంబంధం ఏంటి? ఆ ప్రేమ ఎందుకు అసంపూర్తిగా మిగిలింది? ఈ జన్మలోనైనా ఆ కథ పూర్తయిందా? తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

రాజా తండ్రి సత్యం ఓ సీనియర్ డాక్టర్. తన కొడుకు కూడా తనలాగే డాక్టర్ కావాలని కోరుకుంటాడు. కానీ రాజాకు మాత్రం చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కల ఉంటుంది. తండ్రి కోరికను కాదనలేక మెడిసిన్ చదువుతున్నట్టుగా కనిపిస్తూనే, ఎవరికీ తెలియకుండా ఓ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో పని చేస్తుంటాడు. రాజా ప్రతిభను గుర్తించిన అతని బాస్, తన డిజైన్స్‌కు సరిపోయే అమ్మాయిని రాజానే వెతకాలని చెబుతాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఆధ్య కనిపిస్తుంది. మొదట ఆమె తన డిజైన్స్‌కు సరైన మోడల్‌గా కనిపించినా, క్రమంగా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది.

Advertisement

అయితే రాజా తండ్రికి కొడుకు మెడిసిన్ చదవకుండా చేస్తున్న పని, ఆధ్యతో ఉన్న సంబంధం తెలియడంతో పరిస్థితులు మారిపోతాయి. ఒకవైపు తండ్రి ఆశలు… మరోవైపు తన ప్రేమ, కెరీర్. రాజా ఎటువైపు నిలబడతాడన్నదే మొదటి సమస్యగా మారుతుంది. కానీ ఇక్కడే కథ ఫాంటసీ టర్న్ తీసుకుంటుంది. కథ రెండు కాలాల్లో సాగుతుంది. ప్రస్తుత జన్మలో రాజా ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కనే యువకుడు కాగా, గత జన్మలో ఓ రాజ్యానికి యువరాజు. ఆ జన్మలోనే ఆధ్యతో అతనికి ప్రేమ బంధం ఉంటుంది. అయితే రాజుపై జరిగిన కుట్రలు, అతనిపై పడిన నిందలు చివరకు ఆ ప్రేమకథ విషాదంగా ముగిసేలా చేస్తాయి.

కాలం మారినా… జన్మలు మారినా… అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ ప్రేమ మాత్రం వాళ్లిద్దరినీ మళ్లీ కలుపుతుంది. గత జన్మలో జరిగిన సంఘటనల ప్రభావం ప్రస్తుత జీవితాల్లోకి రావడంతో రాజా, ఆధ్య ప్రేమకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అసలు ఆధ్య గత జన్మలో ఎవరు? మణిగఢ్ రాజ్యంతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? రాజా, ఆధ్య ప్రేమకు అడ్డుగా నిలిచింది ఎవరు? గత జన్మలో అసంపూర్తిగా మిగిలిన ప్రేమను ఈ జన్మలో అయినా వాళ్లు పూర్తి చేసుకున్నారా? గతంలో జరిగిన కుట్రలు మళ్లీ వారి జీవితాల్లోకి వచ్చాయా? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు కథ.

తెలుగులోనూ చూసే ఛాన్స్

Advertisement

అనిల్ బోయిడాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుత్విక్, విశాఖ ధీమాన్ జంటగా నటించగా… సాయి కుమార్, నరేష్, అవసరాల శ్రీనివాస్, రోహిణి, రాజశ్రీ నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. పునర్జన్మ, రాజుల కాలం, ఫాంటసీ, రొమాన్స్, కామెడీ, ఎమోషన్‌ను కలిపి ఈ కథను తెరకెక్కించారు. ‘రాజా ది రాజా’ 2026 జూలై 17న థియేటర్లలో విడుదల కాగా, ఆగస్టు 21 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ అవుతోంది. పునర్జన్మ నేపథ్యంలో సాగే ప్రేమకథలు ఇష్టమైతే ఈ సినిమాను ఓసారి ట్రై చేయొచ్చు. ఇది తెలుగు సినిమానే కావడం విశేషం.

Read Also: పిల్లలకు పార్సిల్స్ ఇచ్చే విమానం… కొత్త గ్యాడ్జెట్స్‌తో పిల్లలను ఎంటర్‌టైన్ చేసే ఫాంటసీ అడ్వెంచర్

Tags

Related News

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×