BigTV English

OTT Movie : ఆడవాళ్లపై అమానుషం… మైండ్ బ్లాక్ అయ్యే సీన్స్… సెగలు పుట్టించే స్టోరీ

OTT Movie : ఆడవాళ్లపై అమానుషం… మైండ్ బ్లాక్ అయ్యే సీన్స్… సెగలు పుట్టించే స్టోరీ

OTT Movie : ఆకట్టుకునే స్టోరీలు ఏ భాషలో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బెంగాల్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఒక వేశ్యాగృహం చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. భారత దేశ విభజన సమయంలో, కొంత మంది వేశ్యలు చేసే పోరాటమే ఈ స్టోరీ. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

1947 ఆగస్టులో, బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజన బిల్లును ఆమోదిస్తుంది. ఈ విభజన కారణంగా, బెంగాల్‌లోని హల్దీబారీ, దేబీగంజ్ ప్రాంతాల మధ్య సరిహద్దు గీత ఒక వేశ్యాగృహం మధ్య గీయబడుతుంది. ఈ గృహాన్ని బేగం జాన్ నడుపుతుంటుంది. ఈ వేశ్యాగృహంలో 11 మంది మహిళలు నివసిస్తుంటారు. వాళ్ళంతా ఏదో ఒక విషయంలో బాధలు పడి అక్కడికి వచ్చిన వాళ్ళే. సరిహద్దు గీత వాళ్ళు ఉండే ఇంటి మధ్య గీయబడినప్పుడు, బేగం జాన్ తో సహ అందరినీ ఖాళీ చేయమని అధికారులు ఆర్డర్ వేస్తారు. కానీ బేగం జాన్ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, తమ ఇంటిని వదిలిపెట్టడానికి నిరాకరిస్తుంది. ఆమె ఈ ఇంటినే తన దేశంగా భావిస్తూ, దానిని రక్షించడానికి పోరాడాలని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో,ఒక రాజు సహాయం కూడా అడుగుతుంది. కాలం మారిపోయిందని, నేను కూడా ఏం చేయలేనని ఆ రాజు కూడా చేతులు ఎత్తేస్తాడు.


చివరికి అందులోని మహిళలే ఒంటరిగా అధికారులతో పోరాడాలని నిర్ణయించుకుంటారు. బేగం జాన్ ఇంటిని ఖాళీ చేయించడానికి ప్రభుత్వం బలవంతంగా దాడి చేస్తుంది. ఆ సమయంలో ఆ మహిళలు కూడా ఆయుధాలతో పోరాడుతారు. చివరికి, ఈ పోరాటంలో మహిళలు తమ ఇంటిని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేస్తారు. బేగం జాన్, మిగిలిన మహిళలతో కలిసి వాళ్ళ చేతిలో చావకుండా, అగ్నికి ఆహుతి అవ్వాలని చూస్తారు. చివరికి వీళ్ళు అనుకున్నంత పని చేస్తారా ? ఆ ఇళ్ళు ఏమౌతుంది ? మహిళలంతా చనిపోతారా ? ఈ స్టోరీ చివరికి ఎటువంటి సందేశం ఇస్తుంది ? అనే విషయాలను, ఈ హిస్టారికల్ బెంగాలీ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : భర్తతో విడాకులు, ప్రియుడితో రొమాన్స్ … ఫ్యూజులు అవుట్ అయ్యే క్లైమాక్స్

 

రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్

ఈ హిస్టారికల్ బెంగాలీ మూవీ పేరు ‘రాజ్‌కహిని’ (Rajkahini). దీనికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ ఇనిమా 2015 అక్టోబర్ 16న విడుదలైంది. ఈ సినిమాలో రితుపర్ణ సేన్‌గుప్తా నేతృత్వంలో పదకొండు మహిళల పాత్రలు ఉంటాయి. వీళ్ళతో పాటు ఛటర్జీ, కౌశిక్ సేన్, జిషు సేన్‌గుప్తా, అబిర్ ఛటర్జీ కూడా ఇందులో నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, హిందీలో బేగం జాన్ పేరుతో రీమేక్ చేయబడింది.ఈ స్టోరీ 1947 భారత-పాకిస్తాన్ విభజన నేపథ్యంలో జరుగుతుంది. ఈ మూవీ ఒక వేశ్యాగృహం చుట్టూ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), జియో హాట్ స్టార్ (Jio hotstar) లలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×