E-Paper
Advertisement

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్
Advertisement

Investigative Crime Thriller OTT : న్యూస్ రిపోర్టర్ జరిగిన విషయాన్ని ప్రేక్షకులకు చెప్పడం మాత్రమే కాదు… కొన్ని సందర్భాల్లో ఆ వార్త వెనుక దాగి ఉన్న నిజాన్ని బయటకు తీసుకురావడానికి ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వస్తుంది. ముఖ్యంగా అక్రమ వ్యాపారాలు, రాజకీయ అండదండలతో నడిచే మాఫియా గ్యాంగుల గురించి బయట పెట్టాలంటే ఎంత ధైర్యం కావాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ‘Reporting Live’ కథ కూడా ఇలాంటి ప్రమాదకరమైన ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతుంది. ఓ యువ రిపోర్టర్, ఆమెతో కలిసి పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపని కెమెరామన్… ఒక వార్త కోసం బయలుదేరి, చివరకు అక్రమ ఇసుక తవ్వకాల మాఫియా గుట్టును బయటపెట్టే పరిస్థితుల్లో చిక్కుకుంటారు. మరి వాళ్లు ఎదుర్కొనే ప్రమాదాలేంటి ? ఈ నెట్‌వర్క్ వెనుక ఎవరున్నారు ? అసలు ఈ క్రైమ్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ కథలో ఓ యువ జర్నలిస్టు కీలక పాత్రలో కనిపిస్తుంది. వార్తల కోసం తిరగడం, ప్రజలకు తెలియని విషయాలను వెలుగులోకి తీసుకురావడం ఆమె పని. కానీ ప్రతి వార్త వెనుక ఒక్కో రకమైన సమస్య ఉంటుంది. కొన్ని కథనాలు సాధారణంగా మొదలై, క్రమంగా పెద్ద నేరాల వ్యవహారంగా మారిపోతాయి. ఈ రిపోర్టర్‌కు ఎదురయ్యే కేసు కూడా అలాంటిదే. మొదట ఓ వార్త కోసం సమాచారం సేకరించేందుకు బయలుదేరిన ఆమెకు, ఆ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే విషయం తెలుస్తుంది.

Advertisement

ఇసుక తవ్వకాలు అంటే యంత్రాలతో ఇసుకను తవ్వి తరలించడం మాత్రమే కాదు. దాని వెనుక డబ్బు, పవర్ ఫుల్ వ్యక్తులు వంటి అంశాలు కూడా ఉండొచ్చు. ఈ సినిమాలో అక్రమ ఇసుక వ్యాపారాన్ని ఓ క్రూరమైన సిండికేట్ నడుపుతుంటుంది. ఆ నెట్‌వర్క్ ఎంత పెద్దదో, దాన్ని ప్రశ్నించే వాళ్లకు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో రిపోర్టర్‌కు క్రమంగా అర్థమవుతుంది. ఆమెతో పాటు వెళ్లే కెమెరామన్ మాత్రం మొదట్లో ఈ పనిపై అంత ఆసక్తి చూపించడు. రిపోర్టింగ్‌లోని ప్రమాదాలు, ఎదురయ్యే ఇబ్బందులు అతడిని వెనక్కి తగ్గేలా చేస్తాయి. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ అతడూ ఈ వ్యవహారంలో చిక్కుకుంటాడు.

మాఫియా కార్యకలాపాలపై ఆధారాలు దొరికే కొద్దీ వాళ్లను అడ్డుకునే ప్రయత్నాలు కూడా మొదలవుతాయి. ఇక్కడే అసలు టెన్షన్ మొదలవుతుంది. నిజాన్ని బయటపెట్టాలనే పట్టుదలతో రిపోర్టర్ ముందుకు సాగుతుంటే, తమ అక్రమ వ్యాపారం బయటపడకుండా చూసుకోవాలని సిండికేట్ ప్రయత్నిస్తుంది. ఒకవైపు ఆధారాలు సేకరించడం, మరోవైపు తమను తాము కాపాడుకోవడం… ఈ రెండింటి మధ్య రిపోర్టర్, కెమెరామన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నదే కథలో కీలకంగా మారుతుంది.

Advertisement

వార్తను ప్రసారం చేయడం ఒక్కటే లక్ష్యంగా మొదలైన ప్రయాణం, చివరకు పెద్ద నేర వ్యవస్థతో తలపడే పోరాటంగా మారుతుంది. ఆ మాఫియా వెనుక ఉన్న అసలు వ్యక్తులను బయట పెట్టగలరా ? వాళ్లు సేకరించిన ఆధారాలు వెలుగులోకి వస్తాయా ? లేక నిజాన్ని చెప్పక ముందే వాళ్లను చంపడానికి మాఫియా ప్రయత్నిస్తుందా ? అనేది సినిమాలో చూడాల్సిందే.

Also Read : పోలీస్ స్టేషన్‌లో ఖాకీల క్రైమ్… నిజాన్ని దాచేందుకు పోలీసులే కుట్ర… ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ కావొద్దు

తెలుగులో ఉందా ?

‘రిపోర్టింగ్ లైవ్’లో పరిణీతి చోప్రా, దేవేన్ భోజాని, అమోల్ పాలేకర్, శేఖర్ సుమన్, ఆదిల్ హుస్సేన్, నాజర్ తదితరులు నటించారు. ఇది 2026 అక్టోబర్ 9న Netflixలోకి వచ్చింది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు ఆడియోలతో అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ డోంట్ మిస్.

Tags

Related News

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

పోలీస్ స్టేషన్‌లో ఖాకీల క్రైమ్… నిజాన్ని దాచేందుకు పోలీసులే కుట్ర… ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ కావొద్దు

వైష్ణవి చైతన్య – ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ఓటీటీలోకి… తెలుగుతో సహా 5 భాషల్లో

క్రిమినల్స్ వేటలో శవమై తేలే ఏజెంట్… అనుకున్నంత సింపుల్ కాదు ఈ కేసు… ఇంటెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్

మళ్లీ మొదలైన రచ్చ… నలుగురు ఫ్రెండ్స్ లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ ట్విస్టులతో సీజన్ 2 స్ట్రీమింగ్ షురూ

ప్రేమ పేరుతో మెంటలెక్కించే పనులు… ఎక్స్ రీఎంట్రీతో బుర్రపాడు ట్విస్ట్… ఈ లవ్ ట్రయాంగిల్ చూస్తే బుర్రపాడు

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

Big Stories

Advertisement
×