E-Paper
Advertisement

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller: టీవీలో నేరస్థులను పట్టుకునే షో అంటే పోలీసుల ఆపరేషన్‌ లా కనిపించొచ్చు. కానీ ఆ ఆపరేషన్‌ కు కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తున్న కెమెరాలు తోడైతే పరిస్థితి ఎలా ఉంటుంది. రేటింగ్స్ కోసం నేరాలను బయటపెట్టే ప్రయత్నం క్రమంగా ఓ భారీ మీడియా షోగా మారుతుంది. నేరస్థులను పట్టుకోవడం, వారిని కెమెరా ముందు నిలబెట్టడం, ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టడం మధ్య నిజమైన న్యాయం ఎక్కడ ముగుస్తుంది ? టీవీ వినోదం ఎక్కడ మొదలవుతుంది ? అనే ప్రశ్నను అందరి ముందు ఉంచే సినిమా ‘ప్రైమ్‌టైమ్’ (Primetime). మరి ఈ సినిమా స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

2006లో టీవీ హోస్ట్ క్రిస్ హాన్సెన్ ‘టు క్యాచ్ ఎ ప్రిడేటర్’ కార్యక్రమంతో ప్రత్యేకమైన ఫార్మాట్‌ ను రూపొందించడానికి ప్రయత్నిస్తాడు. ఇంటర్నెట్‌ లో మైనర్లుగా నటించే డికాయ్‌ లను ఉపయోగించి, వారిని కలవడానికి వచ్చే పెద్దలను రహస్య కెమెరాలతో చిత్రీకరించి, పోలీసుల సహకారంతో పట్టుకునే విధానాన్ని షోలో ఉపయోగిస్తారు. ఈ ఆపరేషన్‌ లు సాధారణ నేర దర్యాప్తుల్లా కాకుండా టెలివిజన్ ప్రేక్షకుల కోసం రూపొందిన భారీ కార్యక్రమాలుగా మారతాయి.

Advertisement

క్రిస్‌ కు మాత్రం సాధారణ షో చేయడం నచ్చదు. టెలివిజన్ చరిత్రలో తన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాలని అతను భావిస్తాడు. అందుకోసం మరింత పెద్ద కేసులు, మరింత ప్రభావవంతమైన ఆపరేషన్లు అవసరమవుతాయి. ప్రతి స్టింగ్ ఆపరేషన్ వెనుక కెమెరా టీమ్, డికాయ్‌ లు, నిర్మాతలు, టెక్నికల్ సిబ్బంది ఉంటారు.

డాన్ ప్లంబ్ అనే యువకుడు ఈ ఆపరేషన్లలో డికాయ్ పాత్రల్లో పాల్గొంటాడు. మొదట ఇది ఓ నటనా అవకాశంలా కనిపించినా, నిజమైన వ్యక్తులను ఎదుర్కోవాల్సి రావడంతో అతనిపై ప్రభావం పడుతుంది. మరోవైపు ఆండీ బెండర్ వంటి నిర్మాతలు షోను మరింత ప్రజాదరణ పొందేలా చేయాలని చూస్తుంటారు. టీవీ రేటింగ్స్ పెరగడం, కొత్త కేసులను పట్టుకోవడం, ప్రేక్షకులను షాక్‌ కు గురి చేసే క్షణాలను కెమెరాలో బంధించడం… ఇవన్నీ కార్యక్రమంలో భాగమవుతాయి.

Advertisement

అయితే నేరస్థులను పట్టుకోవాలనే ఉద్దేశం క్రమంగా మీడియా స్పెక్టకిల్‌ గా మారుతుంది. క్రిస్ తన లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్తున్న కొద్దీ షో వెనుక ఉన్న వ్యక్తిగత ఆశలు, నైతిక సమస్యలు, మీడియా ఒత్తిడి బయటపడతాయి. నిజమైన నేరాన్ని టెలివిజన్ వినోదంగా మార్చినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ? అసలు ఈ షో వల్ల ఎలాంటి నష్టం వాటిల్లింది ? చివరికి ఏమైంది ? అనేది తెరపై చూసి తెలుసుకవాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

రాబర్ట్ ప్యాటిన్సన్ (Robert Pattinson), మెరిట్ వెవర్ (Merritt Wever), స్కైలర్ గిసోండో (Skyler Gisondo), ఫీబ్ బ్రిడ్జర్స్ (Phoebe Bridgers) నటించిన ‘ప్రైమ్‌టైమ్’కు లాన్స్ ఒపెన్‌హైమ్ (Lance Oppenheim) దర్శకత్వం వహించారు. A24 నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఇండియాలో Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు.

Read Also: ఇంటికి ఎదురుగా ముసుగేసుకుని కూర్చొనే మహిళ… దగ్గరయ్యే కొద్దీ పెరిగే భయం… సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్

Tags

Related News

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

Big Stories

Advertisement
×