E-Paper
Advertisement

ఫ్యామిలీ అంతా ఫేక్… అందమైన కుటుంబం వెనుక ఇంత పెద్ద మోసమా ?

ఫ్యామిలీ అంతా ఫేక్… అందమైన కుటుంబం వెనుక ఇంత పెద్ద మోసమా ?
Advertisement

Comedy Drama OTT : బయటకు చూస్తే ఎంతో పద్ధతిగా, అన్యోన్యంగా కనిపించే కుటుంబం… కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్లంతా నిజంగా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు కాకపోతే ? అసలు వాళ్లంతా ఒకే ఇంట్లో ఎందుకు కలిసి ఉంటున్నారు ? ఆ రహస్యాన్ని ఓ అమ్మాయి బయట పెట్టేందుకు ప్రయత్నిస్తే ఏం జరిగింది ? ఇలాంటి ఆసక్తికరమైన ట్విస్టులు, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన తెలుగు సినిమా ‘సఃకుటుంబానాం’ (Sahakutumbaanaam). కడుపుబ్బా నవ్వించే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? సినిమా స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కల్యాణ్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బయట సమాజంలో అతనికి మంచి పేరు ఉంటుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చెల్లితో కలిసి ఎంతో అన్యోన్యంగా జీవించే వ్యక్తిగా అందరికీ కనిపిస్తాడు. ఇంట్లో అందరూ ఒకరినొకరు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్లు కనిపించడంతో, కల్యాణ్ కుటుంబాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ అది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీలా అనిపిస్తుంది. అదే సమయంలో కల్యాణ్ పని చేసే ఆఫీసులో సిరి అనే అనాథ అమ్మాయి ఉద్యోగంలో చేరుతుంది. సిరి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించినప్పటికీ, తన జీవితాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలో కల్యాణ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. మొదట సాధారణ పరిచయంగానే ఉన్న ఈ బంధం, ఆ తర్వాత క్రమంగా మరింత దగ్గరవుతుంది. కల్యాణ్ కుటుంబం కూడా సిరికి దగ్గరవుతుంది. ఆ ఇంట్లో అందరూ కలిసి మెలిసి ఉండే విధానం చూసి సిరి కూడా వారిని నిజమైన కుటుంబంగానే భావిస్తుంది. కానీ ఇంట్లో కొన్ని విషయాలు ఆమెకు అనుమానం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో కనిపించే కొన్ని చిన్న చిన్న తేడాలు… ఒకరికొకరికి ఉన్న సంబంధాల విషయంలో వచ్చే అనుమానాలు ఆమెను ఆలోచించేలా చేస్తాయి.

అలా నిజం తెలుసుకునే ప్రయత్నంలో సిరికి ఊహించని షాకింగ్ విషయం తెలుస్తుంది. బయటకు ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ కుటుంబం నిజానికి కల్యాణ్ సొంత కుటుంబం కాదని ఆమెకు అర్థమవుతుంది. ఒకే ఇంట్లో ఉంటున్న వాళ్లంతా నిజమైన కుటుంబ సభ్యుల్లా నటిస్తున్నారనే విషయం బయట పడుతుంది. అయితే ఇంతమంది వ్యక్తులు ఎందుకు ఒక కుటుంబంలా నటిస్తున్నారు ? కల్యాణ్ వారిని తన కుటుంబంగా ఎందుకు పరిచయం చేస్తున్నాడు ? ఈ నకిలీ కుటుంబం వెనుక అసలు రహస్యం ఏంటి ? సిరి ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేసింది ? ఈ విషయాన్ని బయటపెట్టే క్రమంలో ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది ? అనేదే కథలో చూసి తెలుసుకోవలసిన అంశం.

Advertisement

also Read : నేలపైకి చూస్తే చావే.. 2000 అడుగుల ఎత్తులో అమ్మాయి నరకయాతన… ఈ సినిమా చూస్తే గుండె ఆగిపోతుంది

తెలుగులోనే స్ట్రీమింగ్

కథలో సీరియస్ మిస్టరీ ఉన్నప్పటికీ, దాన్ని పూర్తిగా థ్రిల్లర్‌లా కాకుండా ఫ్యామిలీ కామెడీ, ఎమోషన్స్‌తో కలిపి చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్యల కామెడీ సన్నివేశాలు సినిమాలో హైలెట్. ఒక కుటుంబం చుట్టూ దాగి ఉన్న రహస్యాన్ని ఒక అమ్మాయి తనదైన రీతిలో తెలుసుకునే ప్రయాణం కథకు ప్రత్యేకమైన ఆసక్తిని తీసుకొస్తుంది. ఉదయ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ తెలుగు సినిమాను ఓటీటీలో ఎంచక్కా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయాల్సిందే.

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×