E-Paper
Advertisement

నేలపైకి చూస్తే చావే.. 2000 అడుగుల ఎత్తులో అమ్మాయి నరకయాతన… ఈ సినిమా చూస్తే గుండె ఆగిపోతుంది

నేలపైకి చూస్తే చావే.. 2000 అడుగుల ఎత్తులో అమ్మాయి నరకయాతన… ఈ సినిమా చూస్తే గుండె ఆగిపోతుంది
Advertisement

Survival Thriller on OTT: ఎడారి మధ్యలో మనుషుల జాడే లేని ప్రదేశం… నేలకు దాదాపు 2 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఓ పాత టవర్… పైకి ఎక్కిన తర్వాత తిరిగి కిందకు వచ్చే మార్గమే లేకపోతే? చేతిలో ఉన్న నీళ్లు నెమ్మదిగా అయిపోతుంటే, ఫోన్‌లో సిగ్నల్ లేకపోతే, చుట్టూ సహాయం చేసే ఒక్క మనిషి కూడా కనిపించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రతి అడుగు ప్రాణాలతో చెలగాటంగా మారే ఇలాంటి ఉత్కంఠభరితమైన సర్వైవల్ కథతో తెరకెక్కిన హాలీవుడ్ థ్రిల్లర్ ‘ఫాల్’ (Fall). ఎత్తులంటే భయపడే వారికి మరింత టెన్షన్ పుట్టించే విజువల్స్, ఊపిరి బిగపట్టించే సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

బెక్కీ, హంటర్ ఇద్దరూ మంచి స్నేహితులు. అంతేకాదు ప్రమాదకరమైన అడ్వెంచర్లంటే ఇద్దరికీ ఎంతో ఇష్టం. ఎలాంటి ఎత్తులనైనా లెక్కచేయకుండా క్లైంబింగ్ చేయడం వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కానీ ఓ దురదృష్టకరమైన క్లైంబింగ్ ప్రమాదంలో బెక్కీ తన భర్త డాన్‌ను కోల్పోయిన తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ విషాదం నుంచి బయటపడలేక బెక్కీ అందరికీ దూరంగా ఉంటూ, మానసికంగా కుంగిపోతుంది.

Advertisement

ఆమెను మళ్లీ సాధారణ జీవితంలోకి తీసుకురావాలని భావించిన హంటర్ ఒక ప్రమాదకరమైన సాహసానికి బెక్కీని ఒప్పిస్తుంది. అదే ఎడారి మధ్యలో ఒంటరిగా నిలిచిపోయిన B-67 టీవీ టవర్. దాదాపు 2 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పాత టవర్‌ను ఎక్కి పైకి చేరుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకుంటారు. అంత ఎత్తులోకి వెళ్లి బెక్కీ భర్త డాన్ బూడిదను అక్కడ చల్లి, అతని జ్ఞాపకాల నుంచి బయటపడాలని ఆమె భావిస్తుంది.

మొదట్లో ప్రయాణం ఎంతో ప్రమాదకరంగా కనిపించినా, ఇద్దరూ ధైర్యంగా తుప్పుపట్టిన మెట్లను, బలహీనంగా కనిపించే ఇనుప నిర్మాణాలను దాటుకుంటూ పైకి వెళ్తారు. చివరకు టవర్ పైభాగంలో ఉన్న చిన్న ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కిందికి చూస్తే అంతులేని ఎడారి మాత్రమే కనిపిస్తుంది. ఆ దృశ్యం ఎంత అందంగా ఉన్నా.. అదే సమయంలో వణికించేంత భయానకంగా ఉంటుంది.

Advertisement

కానీ అసలు ప్రమాదం అక్కడి నుంచే మొదలవుతుంది. తిరిగి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో టవర్‌కు ఉన్న పాత నిచ్చెన ఒక్కసారిగా విరిగిపోతుంది. బెక్కీ ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ ఎలాగోలా ప్రాణాలతో బయటపడుతుంది. పైకి చేరుకున్న తర్వాత ఇద్దరికీ ఒక విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు తాము నిలబడి ఉన్న ఆ చిన్న ప్లాట్‌ఫారమ్ నుంచి కిందకు వెళ్లేందుకు మార్గమే లేదు.

చుట్టూ ఎడారి మాత్రమే. ఫోన్‌లో సిగ్నల్ లేదు. తీసుకెళ్లిన నీళ్లు, ఆహారం కూడా పరిమితమే. వారి బ్యాగ్ కొంత దిగువన ఉన్న శాటిలైట్ డిష్ దగ్గర ఇరుక్కుపోవడంతో దాన్ని తిరిగి తీసుకురావడం కూడా మరో ప్రాణాంతక సాహసంగా మారుతుంది. ఒక్క అడుగు తప్పినా వేల అడుగుల లోతులోకి పడిపోయే ప్రమాదం. మండుతున్న ఎండ, దాహం, ఆకలి, అలసట.. వీటన్నింటితో పాటు ఎత్తు భయం కూడా ఇద్దరినీ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది.

బతకడానికి మార్గం వెతుకుతున్న సమయంలోనే బెక్కీ, హంటర్ మధ్య దాగి ఉన్న కొన్ని నిజాలు బయటకు రావడం మొదలవుతుంది. ముఖ్యంగా హంటర్ గతానికి సంబంధించిన ఓ షాకింగ్ విషయం వారి మధ్య ఉన్న నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది. ఇప్పటికే ప్రాణాపాయంలో ఉన్న ఇద్దరి మధ్య అనుమానాలు మొదలవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. మరోవైపు కింద ఉన్న ప్రపంచానికి తమ పరిస్థితిని తెలియజేయడానికి వారు చేసే ప్రయత్నాలు కూడా ఒక్కొక్కటిగా విఫలమవుతాయి. ఫోన్ బ్యాటరీ తగ్గిపోతోంది… నీళ్లు నిండుకుంటున్నాయి… ఎవరూ తమను గుర్తించడం లేదు. బతకాలంటే సాధారణంగా ఊహించలేని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇక్కడి నుంచి కథ కేవలం టవర్ నుంచి బయటపడే ప్రయత్నం చుట్టూ మాత్రమే తిరగదు. బెక్కీ తన భర్తను కోల్పోయిన బాధ నుంచి బయటపడటానికి చేస్తున్న పోరాటం, హంటర్‌తో ఉన్న స్నేహంలో దాగి ఉన్న నిజాలు, ప్రాణాల కోసం చివరి వరకు పోరాడే మానసిక ధైర్యం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో చిక్కుకున్న ఈ ఇద్దరిలో చివరకు ఎవరు బతికి బయటపడతారు ? అక్కడి నుంచి నేలపైకి చేరేందుకు బెక్కీ ఎలాంటి మార్గాన్ని కనిపెడుతుంది ? అనేది సినిమాలో చూసి థ్రిల్ అవ్వండి.

తెలుగులో అందుబాటులో ఉందా ?

గ్రేస్ కరోలిన్ కర్రే, వర్జీనియా గార్డనర్, జెఫ్రీ డీన్ మోర్గాన్, మేసన్ గూడింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు స్కాట్ మాన్ దర్శకత్వం వహించారు. సుమారు 1 గంట 47 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తో రూపొందినప్పటికీ, టవర్‌పై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు నిజంగానే వేల అడుగుల ఎత్తులో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఎత్తులంటే భయం ఉన్నవారికి మరింత టెన్షన్ పుట్టించే విజువల్స్, క్షణక్షణం పెరిగే ప్రమాదం, సర్వైవల్ కోసం చేసే ప్రయత్నాలు, ఊహించని మలుపులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. సర్వైవల్, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ‘ఫాల్’ను తప్పకుండా ట్రై చేయొచ్చు. ప్రస్తుతం ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో చూడవచ్చు. కానీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను మాత్రం జియో టీవీ యాప్‌లో లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) ద్వారా చూడాలి.

Read Also: ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే యాక్సిడెంట్… రెండు ప్రేమకథల ఎమోషనల్ జర్నీ

Tags

Related News

ఒకరిని ప్రేమించాడు… ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుండగా షాకింగ్ ట్విస్ట్… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ

పంచ్ పడితే ఎముకలు విరగాల్సిందే… ఈ ఇద్దరి ముందు మాఫియా కూడా గాయబ్

ఒక హత్యతో మొదలై… పోలీస్ శాఖనే కుదిపేసిన కుట్ర… పోలీసులను వేటాడుతున్న ఆ కిల్లర్ ఎవరు?

మనుషుల్ని బానిసలుగా మార్చి.. ఊచకోతకు ఉసిగొల్పిన క్రిమినల్ మైండ్… బయటపడిన మాన్సన్ రహస్యాలు

బోర్డర్లో వైట్ కోట్ వారియర్స్ స్టోరీ… సైనికుల ప్రాణాల కోసం డాక్టర్ల పోరాటం

నమ్మినవాడే వెన్నుపోటు.. డ్రాగన్లతో రణరంగం.. చివర్లో ఊహించని విషాదం

40 ఏళ్ల పెళ్లి బంధం… ఒక్క ట్రిప్‌తో బయటపడ్డ షాకింగ్ నిజం

Big Stories

Advertisement
×