E-Paper
Advertisement

OTT Movie : ముసలోడే కానీ మహానుభావుడు… ఆడవాళ్లు కన్పిస్తే అదే పని… అవార్డు విన్నింగ్ మలయాళ మూవీ

OTT Movie : ముసలోడే కానీ మహానుభావుడు… ఆడవాళ్లు కన్పిస్తే అదే పని… అవార్డు విన్నింగ్ మలయాళ మూవీ
Advertisement

OTT Movie : మలయాళ సినిమాలను చూడటానికి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. ఈ సినిమాలు ఇప్పుడు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు ఆ దర్శకులు. ఈ కథలు రియాలిటీకి దగ్గరగా ఉండటంతోనే ఈ గుర్తింపు సాధ్యమవుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఇంటి యజమాని ఆడవాళ్లను చులకనగా చూస్తుంటాడు. మరి అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందా ? లేదా ? అనేదే ఈ కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

కథలోకి వెళ్తే

సుధాకరన్ అనే 70 ఏళ్ల వృద్ధుడు, కేరళలోని ఒక చిన్న పట్టణంలో కూర మసాలాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతను తీవ్రమైన డయాబెటిస్, కంటిశుక్లం సమస్యలతో బాధపడుతూ, స్త్రీల పట్ల చులకన భావం కలిగి ఉంటాడు. బాల్యం నుండి స్త్రీలను తక్కువగా చూసే అతని మనస్తత్వం, తన భార్యను సేవకురాలిగా, కోడలు వందనను దూషించడంలో ముందు ఉంటాడు. ఆమె కట్నం తేలేదని ఎపుడూ నిందిస్తుంటాడు. అతను తన కొడుకు రామ్, వందనల మనవడిని కూడా పట్టించుకోడు. సుధాకరన్ ఇంటి దగ్గర కూడా కొంతమంది ఆడవాళ్లను బెదిరించడం, ఆసుపత్రి నర్సును ఇబ్బంది పెట్టడం వంటి చర్యల ద్వారా అతని ప్రవర్తన పూర్తిగా బయటపడుతుంది.

Advertisement

సుధాకరన్ ఆర్థిక ఇబ్బందుల వల్ల కంటిశుక్లం జబ్బుకి శస్త్రచికిత్స చేయించుకోలేకపోతాడు. కానీ వందన తన బంగారు గాజులను ఇచ్చి సహాయం చేస్తుంది. అయినప్పటికీ అతను ఆమెను అవమానిస్తూనే ఉంటాడు. గిరిజ, నర్సు వంటి స్త్రీలు సుధాకరన్ అహంకారాన్ని ఎదిరిస్తూ, తమ స్వాభిమానాన్ని కాపాడుకుంటారు. సుధాకరన్ భార్య నిశ్శబ్దంగా అతని కోపాన్ని భరిస్తుంటుంది. కానీ ఆమె జీవితం అతని స్వార్థంలో బలైపోతుంది. శస్త్రచికిత్స తర్వాత సుధాకరన్ కళ్ళు స్పష్టంగా చూడగలిగినప్పటికీ, అతని మనస్తత్వం మారదు. కానీ ఒక ఘటనలో వందన, గిరిజలు అతని తప్పులను గుర్తించేలా చేస్తారు. చివరికి సుధాకరన్ తన పద్దతిని మార్చుకుంటాడా ? ఆడవాళ్లను తక్కువవ చేసి చూస్తుంటాడా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘తిమిరం’ (Thimiram) 2021లో విడుదలైన మలయాళ డ్రామా చిత్రం. శివరాం మోనీ దర్శకత్వంలో, కె.కె. సుధాకరన్ (సుధాకరన్), విశాక్ నాయర్ (రామ్), మీరా నాయర్ (వందన), అమేయా మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2021 ఏప్రిల్ 29న నీస్ట్రీమ్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో విడుదలై, 1 గంట 56 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.2/10 రేటింగ్ పొందింది. 18వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. నీస్ట్రీమ్, సైనా ప్లేలో మలయాళ ఆడియోతో, ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : ఆ అపార్ట్మెంట్ లో అందరూ అలాంటి వాళ్ళే… మహిళ మిస్సింగ్ తో లింకు.. లిఫ్ట్ లో నడిచే క్రేజీ మలయాళ మర్డర్ మిస్టరీ

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×