Squid Game Real Story : సర్వైవల్ థ్రిల్లర్ ‘స్క్విడ్ గేమ్’ (Squid Game) ఓటీటీ ఎంతటి సంచలనం సృష్టించిన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిసెంబర్ 26 నుంచి ఈ సిరీస్ కు సంబంధించిన సీక్వెల్ కూడా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత కిక్ సెకండ్ పార్ట్ ఇవ్వలేదని విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ మొదట్లో రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులకు క్రేజీగా ఫీల్ అయ్యారు.
డబ్బు కోసం అత్యంత ప్రమాదకరమైన ఈ గేమ్ లోకి ప్రవేశించడం, అందులోని ప్రాణాల మీదకు తెచ్చే ప్రత్యేక గేమ్స్ ఆడడం, వాటినుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు అన్న అంశాలు ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేశాయి. అంతేకాకుండా ఇందులో సమాజంలోని ఆర్థిక అసమానతలను కూడా చూపించారు. కానీ ‘స్క్విడ్ గేమ్’ గురించి బయట ప్రపంచానికి తెలియని కొన్ని భయంకరమైన నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ కొన్ని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
నిజానికి ‘స్క్విడ్ గేమ్’ (Squid Game) సిరీస్ ని చూసినప్పుడు ఇదంతా సిరీస్ కాబట్టి ఇలా చూపించారు. రియల్ లైఫ్ లో ఇలాంటివి ఎక్కడ జరుగుతాయిలే అనుకున్నారు అందరూ. కానీ దక్షిణ కొరియాలో 1970-80 లలో ఇలాంటి ఆటలు నిజంగానే సాగాయి. అంటే అప్పట్లో కొంతమంది జనాలని సమూహాలుగా తీసుకెళ్లి కొన్ని శిబిరాలలో ఉంచేవారట. వేలాది మందిని ఒకే చోట ఖైదీలుగా బంధించేవారట. వాటిని “కొరియాస్ ఆశ్విట్జ్” అనే నిక్ నేమ్ తో పిలిచే వారట. అప్పట్లో తమ దేశంలో పేదరికం అనేది లేకుండా చేయాలనే ఆలోచనతో ఈ శిబిరాలను స్థాపించారట. ఇక వీరు ఎక్కడికీ వెళ్ళకుండా ప్రత్యేకంగా పెట్రోలింగ్ టీంలను కూడా అప్పటి ప్రభుత్వం నియమించిందట. అంటే గేమ్ లో పింక్ డ్రెస్ లలో వచ్చి ఓడిపోయిన వాళ్ళని కాల్చి చంపుతారు కదా.. అలాగన్నమాట.
ఈ శిబిరాలలో వేలాది మంది నిరాశ్రయులు, వీధుల్లో ఉండే పిల్లలు, నిరసనకారులను బలవంతంగా తీసుకొచ్చి పారేసేవారట. గేమ్ అయ్యేదాకా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికేవారట. ఇంతటి క్రూరమైన గేమ్ ను పెట్టిన ఆ దారుణమైన వ్యక్తి ఎవరు అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.
అయితే ఇలాంటి బ్రదర్స్ హౌస్ అనే దక్షిణ కొరియాలో ఉన్న అతిపెద్ద అనాధాశ్రమంలో జరిగిన అక్రమాలు ఆ తరువాత బయట పడ్డాయి. అక్కడున్న వారిపై అసభ్యంగా ప్రవర్తించడం, మానవ అక్రమ రవాణా, చిత్రహింసలు పెట్టడం, జీతాలు ఇవ్వకుండా కూలీలుగా పని చేయించుకోవడం, లేదంటే చంపడం వంటి అనేక భయంకరమైన విషయాలు జరిగాయట. కానీ ఈ విషయాలు ఏవీ బయట ప్రపంచానికి పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోల్లో ఉన్న ఇల్లు, వారి డ్రెస్ అన్నీ కూడా ‘స్క్విడ్ గేమ్’లో అచ్చం లాగే ఉండడం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
WAIT 🤯 IS THIS TRUE⁉️
"SQUID GAME" was based on a true event in (1986). It took place in a bunker in no man's land in South Korea* where people were held hostages and had to complete several games to survive. The host with unhuman like thoughts was never found.#SquidGame pic.twitter.com/qQ7yrZSH8i
— Bryan Pereira (@BryanCovers) January 7, 2025
ఇక ఈ ‘స్క్విడ్ గేమ్’ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందా ? అనే ప్రశ్నకి డైరెక్టర్ సమాధానం చెప్పలేదు. కానీ సాంసంగ్ మోటర్ లే ఆఫ్ ల వల్ల ఎంతోమంది ఉద్యోగులు అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఈ ప్రపంచంలో సాధారణ మధ్య తరగతి వ్యక్తి రాత్రికి రాత్రే సడన్ గా నిరుపేద అయిపోగలడు అనే విషయాన్ని ఈ సిరీస్ ద్వారా చూపించాలి అనుకున్నాను అని చెప్పారాయన. షాకింగ్ విషయం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు కూడా ఇలాగే చేసేవారట.