E-Paper
Advertisement

జంటలుగా ప్రైవేట్ పార్టీ… పేరెంట్స్ ఎంట్రీతో పిచ్చెక్కించే ట్విస్ట్

జంటలుగా ప్రైవేట్ పార్టీ… పేరెంట్స్ ఎంట్రీతో పిచ్చెక్కించే ట్విస్ట్
Advertisement

Anthology Thriller Series: ఓటీటీల్లో రియల్ స్టోరీస్ గురించి వెతుకుతున్నారా ? అయితే ఈ పెద్దలకు మాత్రమే కంటెంట్ తో రూపొందిన ఈ సిరీస్ సజెషన్ మీ కోసమే. రాత్రి పూట లైట్లు ఆఫ్ చేసి, ఫోన్‌లో ఒక సిరీస్ చూస్తున్నప్పుడు హఠాత్తుగా గుండె వేగం పెరిగితే… ఆ సిరీస్‌లోని కథలు మన చుట్టూ ఉన్న రియల్ మనుషుల జీవితాల్లో జరుగుతున్నట్టు అనిపిస్తే… అచ్చం అలాంటి కంటెంట్ తో వచ్చిన సిరీసే ‘Sshhh… Season 3’. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్న వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

ఈ సీజన్ పూర్తిగా ఆధునిక సంబంధాలు, ఆకర్షణలు, పశ్చాత్తాపం చుట్టూ తిరుగుతుంది. గత సీజన్ల కంటే మరింత బోల్డ్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ఒక వేర్వేరు సంబంధాన్ని, దాని వెనుక ఉన్న మానసిక సంఘర్షణను చూపిస్తుంది. మొత్తం నాలుగు ఎపిసోడ్ల యాంథాలజీ సిరీస్ ఇది.

1. ఆన్‌లైన్ ఐడెంటిటీ

Advertisement

దివి వడ్త్యా ప్రధాన పాత్రలో నటించిన ఈ ఎపిసోడ్ డిజిటల్ యుగపు ఇన్‌సెక్యూరిటీస్ గురించి ఉంటుంది. వైషు ఒక మధ్యతరగతి అమ్మాయి. సోషల్ మీడియాలో తనను తాను గ్లామరస్‌గా చూపించాలనే కోరికతో ఫేస్ లెస్ అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా మారుతుంది. మొదట్లో డబ్బు, ఫాలోవర్స్, కాన్ఫిడెన్స్ వచ్చినా… ఒక అజ్ఞాత ఫాలోవర్ ఆమె నిజమైన ఐడెంటిటీని బయట పెడతానని బ్లాక్‌మెయిల్ చేయడంతో ఆమె జీవితం పూర్తిగా తలకిందులు అవుతుంది. ఆన్‌లైన్ లోకం ఎంత ప్రమాదకరం అనేది ఈ ఎపిసోడ్ లో చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా.

2. జెన్ ఆల్ఫా స్లీప్‌ఓవర్

నలుగురు టీనేజ్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఇంట్లో స్లీప్‌ఓవర్ చేస్తారు. ఒక్కరాత్రిలో జరిగే ఫోన్లు, సోషల్ మీడియా, క్షణిక ఆకర్షణలు… వాళ్ల మధ్య జరిగిన ఒక ఊహించని సంఘటన, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మలుపును తీసుకొచ్చింది అన్నదే ఈ ఎపిసోడ్ కథ. టీనేజ్ లో ఉండే ఆవేశాలు, చేసే తప్పులు, ఆ తరువాత పడే పశ్చాత్తాపం ఇందులో అద్భుతంగా ఉంటుంది.

3. కామిని

Advertisement

ఈ సీజన్‌లో హైలైట్ ఎపిసోడ్ ఇది. పూనమ్ బజ్వా ప్రధాన పాత్రలో నటించింది. కామిని పితృస్వామ్య సమాజంలో ఎదుర్కొన్న అన్యాయాలు, లైంగిక వేధింపులు… సూపర్‌నాచురల్ హారర్ ఎలిమెంట్‌తో కలిసి ఉంటాయి. ఆమెపై ఘాతుకానికి పాల్పడిన అబ్బాయిలపై భయంకరమైన శక్తి ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ ఎపిసోడ్ హారర్, రొమాంటిక్ థ్రిల్ల్ మిక్స్‌గా ఉంటుంది. మిగిలిన ఎపిసోడ్‌లలో ఆధునిక బంధాలలో ఉండే టెంప్టేషన్, శృంగార ఫాంటసీలు, వివాహేతర సంబంధాల వల్ల వచ్చే పరిణామాలు లాంటి విషయాలపై ఫోకస్ చేశారు.

తెలుగులో ఉందా ?

ఈ సీజన్లో ప్రతి ఎపిసోడ్‌లోనూ ఒక సరికొత్త ట్విస్ట్ ఉంటుంది.గత సీజన్ల కంటే మరింత బోల్డ్‌గా ఉంటుంది. కాబట్టి సింగిల్ గా చూడడం బెటర్. హరీష్ జి.వై దర్శకత్వం వహించిన ఈ సిరీస్ తెలుగు, తమిళంలో వచ్చిన బోల్డ్ రొమాంటిక్ అంథాలజీ వెబ్ సిరీస్. ఈ సీజన్ 3లో మొత్తం 5 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త కథ, కొత్త నటీనటులు ఉంటారు. ఇందులో పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్, దివి వడ్త్యా, దివ్య గణేశన్, శ్యామల్, తమిళ్వాని వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ Ahaలో అఫీషియల్ తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: ఈ డాల్ హెడ్ తో పెట్టుకుంటే దబిడి దిబిడే… ‘స్క్విడ్ గేమ్’ లాంటి థ్రిల్లర్

Tags

Related News

ఘోస్ట్ షిప్లో వెంటాడి వెంటాడి చంపే మాస్క్ కిల్లర్… టెర్రీఫయింగ్ టైమ్ లూప్ సైకలాజికల్ థ్రిల్లర్

అనాథాశ్రమం అమ్మాయిలను బలిచ్చే వార్డెన్… తినేటప్పుడు మాత్రం ఈ మూవీని అస్సలు చూడొద్దు

నడిచే పిచ్చాసుపత్రి వీడు… సింగిల్ చింతకాయలకు ఫుల్ ఫన్

ప్రతీ ఆడపిల్ల తండ్రి ఇలాగే ఉండాలి భయ్యా… కార్పొరేట్ సిండికేట్ ను చితగ్గొట్టే శివంగి

నరకంలో ఉన్న పేరెంట్స్ కోసం దేవుడితో ఒప్పందం… మెంటలెక్కించే సూపర్ నేచురల్ థ్రిల్లర్

ఇండియన్ మైథాలాజి మిక్సయ్యి ఉన్న హాలీవుడ్ హర్రర్ మూవీ… లాస్ట్ ట్విస్ట్ డోంట్ మిస్

ఈ డాల్ హెడ్ తో పెట్టుకుంటే దబిడి దిబిడే… ‘స్క్విడ్ గేమ్’ లాంటి థ్రిల్లర్

Big Stories

Advertisement
×