Weather News: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి కంటిన్యూగా ఓ పది రోజులు వానలు దంచికొట్టాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రహదారులు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.. ముఖ్యంగా తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో వానలు భారీగా కురిశాయి. అయితే గత నాలుగైదు రోజు వరుణుడు కాస్త విరామం ప్రకటించాడు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలర్ట్ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండూ తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఇవాళ, రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఒక అల్పపీడనం ఏర్పడిందని అధికారులు వివరించారు.
ALSO READ: Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి
కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఇక హైదరాబాద్ లో మరి కాసేపట్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడనుంది. కూకట్ పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, నానక్ రాం గూడ, గచ్చిబౌలి, గోల్కొండ, అత్తాపూర్ ప్రాంతాల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ రోజు రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర, మధ్య,తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
రేపు..
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గురువారం..
గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు చెప్పారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఈ జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
శుక్రవారం..
శుక్రవారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
శనివారం..
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పారు.
ALSO READ: Jobs in Indian Railway: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 3518 అప్రెంటీస్ పోస్టులు, ఇదే మంచి అవకాశం