E-Paper
Advertisement

ప్రాణాలు తీసిన ప్రాంక్… ఓటీటీని షేక్ చేస్తున్న షాకింగ్ టీన్ థ్రిల్లర్

ప్రాణాలు తీసిన ప్రాంక్… ఓటీటీని షేక్ చేస్తున్న షాకింగ్ టీన్ థ్రిల్లర్
Advertisement

Suspense Thriller Web Series:  స్కూల్, కాలేజ్ నేపథ్యంలో వచ్చే టీన్ థ్రిల్లర్ సిరీస్‌లకు ఓటీటీలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఒక చిన్న తప్పు… తర్వాత అందరి జీవితాలను తలకిందులు చేసే కథలంటే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. మొదట నార్మల్ గా మొదలైన కథ.. ఒక్కో ఎపిసోడ్ ముందుకు వెళ్లేకొద్దీ ఊహించని మలుపులు తిరిగితే ఆ ఆసక్తే వేరుగా ఉంటుంది. అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘Final Project’. ఒక్క క్షణం సరదాగా తీసుకున్న నిర్ణయం జీవితాలను ఎలా మార్చేస్తుందో చూపించే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే ట్విస్టులు తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠను పెంచేస్తాయి. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కొంతమంది రిచ్ స్టూడెంట్స్ ఒక ప్రైవేట్ హైస్కూల్‌లో చదువుతుంటారు. తమ ఫ్రెండ్‌ను ఆట పట్టించడానికి ఒక ప్రాంక్ ప్లాన్ చేస్తారు. సరదాగా మొదలైన ఆ ప్లాన్‌లో భాగంగా నకిలీ కిడ్నాప్ డ్రామా ఆడాలని నిర్ణయిస్తారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ ప్రాంక్ బెడిసికొట్టి… ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోతాడు.

Advertisement

భయపడిపోయిన ఆ యువకులు ఏం చేయాలో అర్థం కాక, పోలీసులకు దొరికిపోతామనే భయంతో ఆ శవాన్ని కార్ డిక్కీలో దాచిపెట్టి జరిగిన విషయాన్ని రహస్యంగా ఉంచాలని అనుకుంటారు. అక్కడి వరకు అంతా వారి కంట్రోల్‌లోనే ఉందనుకుంటారు. కానీ అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. వాళ్ల రహస్యం మరొకరి చేతికి చిక్కుతుంది. ఆ తర్వాత మొదలయ్యే బ్లాక్‌మెయిల్ ఆట ఒక్కో ఎపిసోడ్‌లో కొత్త మలుపు తిరుగుతూ కథను మరింత ఉత్కంఠగా మారుస్తుంది.

తమ ఫైనల్ ప్రాజెక్ట్ పూర్తి చేసే లోపే ఈ సమస్య నుంచి బయటపడాలని ఆ టీనేజర్లు ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్లలో ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. అసలు వాళ్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్నది ఎవరు ? నిజం బయటకు వస్తే అందరి జీవితాలు ఎలా మారిపోతాయి ? చేసిన ఒక చిన్న తప్పు నుంచి వాళ్లు బయటపడగలిగారా ? అనే ప్రశ్నలతో కథ సాగుతుంది. అయితే అసలు ట్విస్టులు, క్లైమాక్స్‌ను మాత్రం ముందే చెప్పకుండా సిరీస్ చివరి వరకు సస్పెన్స్ ను హోల్డ్ చేశారు మేకర్స్.

తెలుగులో స్ట్రీమింగ్ ?

Advertisement

ఈ మెక్సికన్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ స్పానిష్‌తో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆడియోల్లో కూడా అందుబాటులో ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఈ సినిమాను మాతృభాషలోనే చూడొచ్చు. ఆధునిక యువత జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావం, చిన్న తప్పులు ఎంత పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయో చూపించడంతో పాటు ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే ట్విస్టులు ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. Elite, Control Z తరహా హైస్కూల్ మిస్టరీ థ్రిల్లర్లు ఇష్టపడే వాళ్ళకు ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. మొదటి ఎపిసోడ్ చూశాక… తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగించే ఈ సిరీస్‌ను ఈ వీకెండ్‌లో ఒకసారి చూసేయొచ్చు.

Read Also: ఏది కోరుకున్నా క్షణాల్లో ఇచ్చే గది…. బయటకు తీసుకెళ్తే మొత్తం బూడిదే

Tags

Related News

రోగి మరణం వెనుక గత జన్మల మిస్టరీ… సైకియాట్రిస్ట్‌కే మైండ్ బ్లాంకయ్యే ట్విస్ట్

అమెరికాను కుదిపేసిన రియల్ సైకో స్టోరీ… తెలుగులోనే ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్

డిజిటల్ యుగంలో పాత ఫ్యాషన్ క్వీన్ కష్టాలు… ఓటీటీలోకి అడుగు పెట్టిన క్లాసిక్ హిట్‌ సీక్వెల్‌

ఓటీటీ వార్ ప్రకటించిన జీ5 … తెలుగు ఆడియన్స్ కు ఎంజాయ్ పండగో

100 ఎపిసోడ్స్ హిట్… తెలుగు ఆడియన్స్ మెచ్చిన తమిళ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

చేదు గతం… కొత్త జీవితం… ఈ ప్రేమకథ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది

థియేటర్లలో ఆడియెన్స్ ను ఏడిపించిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ… ఒకరోజు ముందే ఓటీటీలోకి తెలుగులో

Big Stories

Advertisement
×