OTT Movie : పంజాబీ నుంచి ఒక పవర్ ఫుల్ స్టోరీతో తెరకెక్కిన వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సిరీస్ ఓటీటీలో దూసుకు పోతోంది. ఈ సిరీస్ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని థ్రిల్లింగ్ స్టోరీతో అందిస్తోంది. 1984 తర్వాత జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల తర్వాత పంజాబ్‌లో పరిస్థితి చాల దారుణంగా మారుతుంది. నకిలీ పోలీసు ఎన్‌కౌంటర్లు ఎక్కువగా జరుగుతాయి. ఈ క్రమంలో ఇక్కడ న్యాయం కోసం కొంతమంది చేసే పోరాటాన్ని ఈ సిరీస్ ద్వారా చూపించారు. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలను ఇష్టపడే వాళ్ళు, ఈ సిరీస్ ని వదిలిపెట్టకుండా చూస్తారు. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
’84 తో బాద్’ (84 Toh Baad) ఒక శక్తివంతమైన పంజాబీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. గురమనత్ సింగ్ పటంగ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కుల్జిందర్ సిధు, గుర్శబద్, జర్నైల్ సింగ్, ప్రకాష్ గఢు, రిచా భట్, గవ్వీ డస్కా, దృష్టి తల్వార్, కిరణ్‌దీప్ రాయత్ నటించారు. ఈ సిరీస్ 2025 ఆగస్టు 14న చౌపాల్, OTTplay లో విడుదలై, IMDbలో 7.5/10 రేటింగ్ సాధించింది. ఇది 7 ఎపిసోడ్‌లతో ఒక్కో ఎపిసోడ్ 35 నుంచి 45 నిమిషాల నిడివితో స్ట్రీమ్ అవుతోంది.
కథలోకి వెళ్తే
1984 సిఖ్ వ్యతిరేక హింస తర్వాత పంజాబ్‌లోని ఒక చీకటి యుగంలో ఈ కథ జరుగుతుంది. బాగర్ సింగ్ ఒక క్రూరమైన పోలీసు అధికారి. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అమాయకులను లక్ష్యంగా చేసుకుంటాడు. ఈ హింసాత్మక వాతావరణంలో, అజిత్‌పాల్ సింగ్, జగ్గీ, కర్మో, ఫౌజీ అనే నలుగురు వ్యక్తులు బాగర్ సింగ్‌కు వ్యతిరేకంగా నిలబడతారు. అజిత్ న్యాయం కోసం పోరాడుతుండగా, జగ్గీ తన వాళ్ళను కాపాడటానికి ప్రాణాలను పణంగా పెడతాడు. కర్మో ఒక ధైర్యవంతమైన మహిళగా ఎదురుతిరుగుతుంది. ఫౌజీ, ఒక సైనిక నేపథ్యం కలిగిన వ్యక్తి. ఈ నలుగురూ మిలిటెంట్లు, పోలీసుల మధ్య చిక్కుకుని, నకిలీ ఎన్‌కౌంటర్ల బాధితులుగా మారతారు, వీళ్ళు చేసిన ఏకైక నేరం, జీవించి ఉండటం మాత్రమే.
Read Also : చావు అంచులదాకా వెళ్లే హీరో… అపరిచితుల ఎంట్రీతో అల్టిమేట్ ట్విస్ట్… కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ
ప్రస్తుత కాలంలో ఒక అడ్వకేట్ బాధితుల కథలను సేకరిస్తూ, దశాబ్దాలుగా దాచబడిన నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో 1984 తర్వాత జరిగిన భయానక సంఘటనలను, పోలీసు దురాగతాలను, అధికార దుర్వినియోగం బయటపడతాయి. ఒక యువతి , ఒక దశాబ్దాల నాటి హత్యకు సంబంధించిన ఆశ్చర్యకరమైన రహస్యాన్ని బయటపెడుతుంది. ఇది బాగర్ సింగ్ కు చెందిన చీకటి గతాన్ని తవ్వుతుంది. ఈ కథ గతం, వర్తమానం మధ్య సంచరిస్తూ, క్లైమాక్స్‌లో ఒక షాకింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? బాగర్ సింగ్ దురాగతాలు ఎలా ఉండేవి ? అడ్వకేట్ వెలుగులోకి తెచ్చే రహస్యాలు ఎలాంటివి ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.