E-Paper
Advertisement

‘నో-బాల్’ ఇచ్చాన‌ని పాకిస్తాన్ ప్లేయ‌ర్లు అవ‌మానించారు..అంపైర్ సంచ‌ల‌నం!

‘నో-బాల్’ ఇచ్చాన‌ని పాకిస్తాన్ ప్లేయ‌ర్లు అవ‌మానించారు..అంపైర్ సంచ‌ల‌నం!
Advertisement

Marais Erasmus on no-ball against Virat Kohli : పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా… నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే, జనాలందరూ టీవీలకే అతుక్కుపోతారు. అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక వరల్డ్ కప్ ఇలాంటి టోర్నమెంటులో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan) మధ్య మ్యాచ్ జరిగితే వ్యూయర్షిప్ కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 2022 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో నో-బాల్ వివాదం చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీకి వేసిన బంతి నో-బాల్ అని ప్ర‌క‌టిస్తే, త‌న‌ను పాకిస్తాన్ ప్లేయ‌ర్లు అవ‌మానించార‌ని మాజీ ఐసీసీ అంపైర్ మరైస్ ఎరాస్మస్ ( Marais Erasmus) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అస‌లు ఈ నో-బాల్ వివాదం ఏంటి ?

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టీ20 ప్రపంచకప్ 2022 సందర్భంగా గ్రూప్ స్టేజ్ లో ఓ మ్యాచ్ జరిగింది. ఇందులో నాలుగు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా అనే బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 159 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా ప్లేయర్లు విఫలం అయ్యారు. దీంతో విరాట్ కోహ్లీనే భారాన్ని మొత్తం మోసాడు. ఇక ఈ మ్యాచ్ లో 53 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, 82 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ ఎప్పుడు జరిగినా అదరగొట్టే విరాట్ కోహ్లీ… ఇందులోనూ దుమ్ము లేపాడు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

చివరి వరకు నిలబడి మ్యాచ్ గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్ చివరి దశ వచ్చే సమయానికి విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ నో-బాల్ వేసింది. నడుము సైజు కంటే ఎత్తులో బంతి రావడంతో బలంగా బాదిన‌ విరాట్ కోహ్లీ, సిక్సర్ సాధించాడు. వెంటనే అక్కడే ఉన్న లెగ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్ ( Marais Erasmus)ను ఉద్దేశించి, సిక్సర్ ఇవ్వు అంటూ కోహ్లీ సూచించాడు. దీంతో వెంటనే అంపైర్ కూడా సిక్సర్ గా ప్రకటించేశాడు. అయితే విరాట్ కోహ్లీ చెబితేనే అంపైర్ మరైస్ ఎరాస్మస్ విన్నాడని బాబర్ తో పాటు పాకిస్తాన్ క్రికెటర్లు గొడవకు దిగారు. ఇదే వివాదంపై తాజాగా స్వయంగా ఎరాస్మస్ క్లారిటీ ఇచ్చారు.

నో-బాల్ ఇచ్చాన‌ని త‌న‌పై దాడికి య‌త్నం !

Advertisement

విరాట్ కోహ్లీ నో-బాల్ వివాదంపై తాజాగా ఎరాస్మస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూల్స్ ప్రకారమే, తాను నో-బాల్ ఇచ్చానని వివరించారు. హైట్ నో-బాల్ మనకు బంతి పడగానే తెలిసిపోతుంది… కానీ తాము అప్పుడే నో-బాల్ గా ప్రకటించబోమని స్పష్టం చేశారు. ఆ బంతి పడిన తర్వాత సిక్సర్ వెళ్తే… సిక్సర్ ఇవ్వాల్సిందేనని తెలిపారు. ఒకవేళ అవుట్ అయితే…బ్యాటరే రివ్యూ తీసుకుంటాడని… అప్పుడే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తాము తీసుకోకూడదని చెప్పే ప్రయత్నం చేశారు. విరాట్ కోహ్లీ విషయంలో కూడా అలాగే చేశాను… కానీ పాకిస్తాన్ ప్లేయర్లు తప్పుగా అర్థం చేసుకొని… నన్ను టార్గెట్ చేశారన్నారు. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత బాబర్ ఆజం క్లారిటీ ఇచ్చానని వెల్లడించారు.

 

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

 

 

Related News

ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం పక్కా..ఇక అన్ని సిక్సర్లు, బౌండరీలే!

హార్ధిక్ పాండ్యా, బుమ్రా లేకపోతే..టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుంది

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు

సోష‌ల్ మీడియా వార్‌…పాపం, గిల్ చేసిన త‌ప్పుకు శ్రేయ‌స్ సేన బ‌లి

వాడికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ చేత‌కాదు…టీమిండియా ఓట‌మి కార‌ణం శివ‌మ్ దూబేనే

బౌండ‌రీ సైజు 80 మీటర్లు చేయండి..లేక‌పోతే 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే

సంజు శాంస‌న్ సెంచ‌రీ మిస్…వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

విరాట్ కోహ్లీకి బలుపెక్కువ…బుమ్రా లేదు, వుమ్రా లేదంటూ తక్కువ అంచనా వేశాడు

Big Stories

Advertisement
×