Gundeninda GudiGantalu Today episode june 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. తన ఫ్రెండ్ అశోక్ వల్ల మీనాకు బంఫర్ ను ఇస్తాడు బాలు.. ఎమ్మెల్యే చేస్తున్న సామూహిక వివాహాల కోసం 500 దండల ఆర్డర్ ని మీనాకు తీసుకొచ్చి ఇస్తాడు బాలు. ఈ విషయాన్ని బాలు డైరెక్ట్ గా చెప్పకుండా మధ్యలో సత్యంని పెట్టి అసలు విషయాన్నీ చెప్తాడు. అయితే మీనా ఒక్కొక్క దండ ధర 500 చెప్పడంతో బాలు షాక్ అవుతాడు..
ఏంటి దండ 500 అంత రేటు పెట్టి జనాలని దండుకుంటున్నారా అంటూ బాలు మీనా పై సీరియస్ అవుతాడు.. ఈ ఆర్డర్ రెండు రోజుల్లో కావాలని బాలు అడుగుతాడు. రెండు రోజుల్లో అయితే నేను బస్తి జనానికి కొంత అమౌంట్ ఇచ్చి దండలు తయారు చేయించాలని అంటాడు. బస్తీలోని మందిని పెట్టుకొని చేస్తాను నాకు ముందు అడ్వాన్స్ కావాలని డిమాండ్ చేస్తుంది. తనకి బాలు అడ్వాన్స్ ఇవ్వడంతో మీనా ఆ ఆర్డర్ ని తీసుకుంటుంది. రెండు రోజుల్లో ఆర్డర్ కావాలంటే నాకు సపోర్ట్ కావాలని మీనా అంటుంది. ఆటో సంగతి నేను చూసుకుంటాను. మనుషుల సంగతి చూసుకోవడం మంచిది అని మీనా అంటుంది.. మొత్తానికి బాలు వల్ల మీనాకు సంపాదన పెరగడంతో ఫుల్ ఖుషి అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. పెద్ద ఆర్డర్ రావడంతో మీనా గుడికి వెళ్తుంది. అక్కడ దైవ దర్శనం చేసుకుంటుంది. బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఏడుస్తూ కూర్చొని ఉన్న మౌనికను చూస్తుంది. మౌనిక నువ్వేంటి ఇక్కడ ఒక్కదానికి వచ్చావా ఏమైంది అని మీనా ఆరా తీస్తుంది. మీనాన్ని చూడగానే మౌనిక కన్నీళ్లు పెట్టుకుని కౌగిలించుకుంటుంది. ఏమైంది మౌనిక ఎందుకు బాధపడుతున్నావ్ ఆ సంజయ్ ఏమైనా అన్నాడా నీకు ఏమన్నా అయితే ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు ఏమైంది చెప్పు అని నేను అడుగుతుంది.. ఏం లేదు వదిన ఇంట్లో వాళ్ళని చూడకూడదని ఆయన కండిషన్ పెట్టాడు కదా ఒకసారి మిమ్మల్ని చూసే లోపల నాకు అన్ని నాతుకోలేకపోయాను అని కవర్ చేస్తుంది మౌనిక..
అన్నయ్య అంటేనే ఆయన కోపం తప్ప మిగతా ఏమీ లేదు వదినా. అందుకే నన్ను పుట్టింటికి కూడా పంపించట్లేదు అని మౌనిక అంటుంది. మీ అన్నయ్య గురించి నీకు బాగా తెలుసు కదా 24 ఏళ్లు కలిసి పెరిగావు. మీ అన్నయ్య కోపం వల్ల మా తమ్ముడు చెయ్యి విరగొట్టాడు. తన వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఆయనతో కూడా కూర్చొని మాట్లాడితే సమస్య సాల్వ్ అవుతుంది కదా అని మీనా అంటుంది. సరే ఇక నేను పెద్ద ఆర్డర్ వచ్చింది మనుషుల్ని తీసుకొని వెళ్ళాలి అని మీరే చెప్పేసి వెళ్తుంది.
మౌనిక కోసం ఊరంతా గాలిస్తూ ఉంటాడు సంజయ్.. ఇది చెప్పకుండా ఎక్కడికి వెళ్లింది చచ్చిపోయిందా లేక అవమానం తట్టుకోలేక ఎక్కడికైనా పారిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. బాలు ఎంజాయ్ కనిపించడంతో ఏమైంది ఎవరి కోసం వెతుకుతున్నాడని ఆరా తీస్తాడు. సంజు పై అనుమానంతో బాలు ఒక వ్యక్తిని అడిగితే అతను ఒక అమ్మాయిని వెతుకుతూ వచ్చాడని నిజం చెప్తాడు. మౌనికకు ఏమైంది అసలు ఈ దుర్మార్గుడు ఏం చేశాడు అంటూ భయంతో కంగారు పడుతూ మౌనిక వాళ్ళ ఇంటికి బాలు వస్తాడు. సువర్ణను అడుగుతాడు. ఈ దుర్మార్గులు ఏం చేశారో చెప్పండమ్మా మీకు మాత్రమే తెలుసు ఉంటుంది అని అంటాడు.. మీరు ఇలా చెప్తేనే నిజం చెప్పరు కానీ అని మెడ మీద కత్తి పెట్టి నిజం చెప్పమని సంజయ్ ని అడుగుతాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన మౌనిక అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంది. నువ్వు కనిపించలేదని వీడు ఫోటో పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు అమ్మ నన్ను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నయ్య గుడికి వెళ్ళను వదిన కూడా నాకు కనిపించింది అని మౌనిక చెప్తుంది. ఆ మాట వినగానే శాంతించిన బాలు సంజయ్ ను వదిలేస్తాడు. బాలు నుంచి తప్పించుకున్న సంజయ్ ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..