OTT Movie : ఎక్సార్సిజం, ఓజా బోర్డ్ తో ఎక్కువగా దెయ్యాల స్టోరీలు వస్తున్నాయి. ఈ సినిమాలు ఏ భాషలో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ కొంచెం నచ్చితే చాలు, ఇక వదలకుండా వాచ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బ్రాండన్ అనే స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. ఇతను దెయ్యాలు ఉన్నాయా ? లేవా ? అని నిరూపించుకునే ప్రయత్నంలో, ఎక్సార్సిజం, ఓజా బోర్డ్ తో ప్రయోగాలు చేస్తాడు. ఆతరువాత ఊహించని పరిణామాలు ఎదురుపడతాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘The Possession Experiment’ 2016లో విడుదలైన అమెరికన్ హారర్ థ్రిల్లర్ చిత్రం. దీనికి స్కాట్ B. హాన్సెన్ దర్శకత్వం వహించారు. చేశారు. ఇందులో క్రిస్ మైనర్ (బ్రాండన్ జెన్సన్), జేక్ బ్రిన్ (క్లే), నిక్కీ జాస్పర్ (లేడా మోర్గాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 24 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం 2016 సెప్టెంబర్ 22న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో థియేట్రికల్ రిలీజ్ అయింది. 2016 డిసెంబర్ 6న Amazon Prime Video, Tubi లో విడుదలైంది.
ఈ కథ బ్రాండన్ అనే థియాలజీ స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. అతను హారర్ సినిమాలకు పెద్ద ఫ్యాన్. తన వరల్డ్ రిలిజియన్స్ క్లాస్ లో ఒక ప్రాజెక్ట్ కోసం ఎక్సార్సిజం అనే అంశాన్ని ఎంచుకుంటాడు. అతను ఒక దారుణమైన ఎక్సార్సిజం గురించి తెలుసుకుంటాడు. ఇది 1994లో హత్యలు, ఆత్మహత్యలకు దారితీసింది. ఇందులో ఫాదర్ మార్క్ కాంప్‌బెల్ కీలకంగా ఉన్నాడు. ఈ సంఘటన బ్రాండన్‌ను ఆకర్షిస్తుంది. అతను కూడా దెయ్యాలు నిజమని నిరూపించడానికి ఒక ప్రయోగం చేయాలని నిర్ణయించుకుంటాడు. అతను స్వచ్ఛందంగా ఒక దెయ్యాన్ని తనలోకి ఆహ్వానిస్తాడు మరియు దానిని లైవ్‌స్ట్రీమ్ చేస్తాడు.
అతనికి క్లే, మోర్గాన్ అనే స్టూడెంట్స్ తోడుగా ఉంటారు. వీళ్ళు ఒక క్రౌడ్‌ఫండింగ్ క్యాంపెయిన్ ప్రారంభిస్తారు, ఇది వైరల్ అవుతుంది. హత్యలు జరిగిన ఆ ఇంటిలో ఒక ఓజా బోర్డ్‌ను ఉపయోగిస్తారు. ప్రారంభంలో ఏమీ జరగదు. కానీ బ్రాండన్‌లో క్రమంగా భయంకరమైన మార్పులు కనిపిస్తాయి. అతని తల్లి ఎమిలీ ఆత్మహత్య చేసుకుంటుంది. బ్రాండన్ ప్రవర్తన మరింత విచిత్రంగా మారుతుంది. ఇది ఒక దెయ్యం అతన్ని ఆవహించినట్లు సూచిస్తుంది. బ్రాండన్ ప్రయోగం ఊహించని రీతిలో ఫెయిల్ అవుతుంది. అతని చర్యలు హింసాత్మకంగా, గందరగోళంగా మారతాయి. బ్రాండన్ ఈ పరిస్థితి నుంచి బయటపడతాడా ? అతనిలో నిజంగానే దెయ్యం ఉందా ? గతంలో అంత దారుణమైన ఎక్సార్సిజం ఎందుకు జరిగింది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : అర్ధ స్పృహలో ఉన్న అమ్మాయిని బలవంతంగా… మతిపోగోట్టే మలయాళ రివేంజ్ డ్రామా