OTT Movie : ఒక చిన్న గ్రామంలో మాధవన్, శంకున్ని అనే ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేని శత్రువులుగా మారతారు. 30 సంవత్సరాలుగా ఒక చిన్న భూమి కోసం న్యాయ పోరాటం సాగిస్తున్నారు. ఈ భూమి కేవలం ఒక ఆస్తి కాదు, వారి అహంకారానికి నిదర్శనం గా ఉంటుంది. ఈ శత్రుత్వం గ్రామంలో అందరికీ వినోదంగా మారుతుంది. అయితే దీని వెనుక దాగిన రహస్యాలు ఏమిటి? కోర్టు తీర్పు వారి జీవితాలను ఎలా మారుస్తుంది? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
తెక్కు వడక్కు కథ కేరళలోని ఒక గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ మాధవన్ (వినాయకన్) ఒక రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్. శంకున్ని (సురాజ్ వెంజరమూడు) అనే ఒక రైస్ మిల్ యజమానితో 30 సంవత్సరాలుగా ఒక భూమి వివాదం ఉంటుంది. ఈ వివాదం వారి బాల్యం నుండి ప్రారంభమై, ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా కొనసాగుతోంది. వీళ్ళ గొడవలు చివరికి గ్రామంలోని ప్రజలకు వినోదంగా మారింది. సినిమా ఈ ఇద్దరి పాత్రల మధ్య వైరాన్ని, వారి వ్యక్తిగత జీవితాలను, ఈ వివాదం వారి కుటుంబాలపై చూపిన ప్రభావాన్ని చూపిస్తుంది. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా వీరి కథను వివరిస్తారు. వీళ్ళ కొడుకులు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అదికూడా అంతగా ఫలించదు.
అయితే వీరిద్దరూ ఒకరినొకరు అధిగమించడానికి చేసే ప్రయత్నాలు. చిన్న చిన్న గొడవల కారణంగా పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఈ గందరగోళం ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తుంది. చివరికి ఈ వివాదం కేవలం భూమి గురించేనా, లేక దాని వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా ? 30 సంవత్సరాలుగా ఎందుకు పోరాడుతున్నారు ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ మలయాళం సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : దాని కోసం శవాన్ని పెళ్ళాడే అమ్మాయి … ఆ తరువాత జరిగే బీభత్సం చూడాలి మామా
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ మలయాళ కామెడీ మూవీ పేరు ‘తెక్కు వడక్కు’ (Thekku Vadakku). 2024 లో వచ్చిన ఈ సినిమాకి ప్రీమ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మనోరమా మాక్స్ (MnoramaMAX), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో వినాయకన్ (మాధవన్), సురాజ్ వెంజరమూడు (శంకున్ని), ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 3.9/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా స్టోరీ రెండు ఫ్యామిలీల మధ్య తిరుగుతుంది. కామెడీ ఎంటర్టైనర్ గా దీనిని తెరకెక్కించారు. చివరి వరకూ ఈ సినిమా సరదాగా సాగిపోతుంది. ఇది ఫ్యామిలీ తో కలసి చూడదగ్గ సినిమా.