OTT Movie : కొన్ని సినిమాలు సరదా కోసం చూసినా, చాలా స్పెషల్ గా ఉంటాయి. అటువంటి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైనీస్ మూవీలో భోజన ప్రియుడు అయిన ఒక మిలియనీర్, ఒక మామూలు చెఫ్ గా పనిచేసే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఈ స్టోరీ చివరి వరకు సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ చైనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘ఇది నేను ఊహించినది కాదు’ (This is not what I expected). 2017లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి డెరెక్ హుయ్ దర్శకత్వం వహించారు. ఇందులో తకేషి కనేషిరో, జౌ డోంగ్యు నటించారు. ఇది లాన్ బాయి సే చివరిగా రాసిన ‘ఐ గెట్ యు’ అనే నవల నుండి తీసుకోబడింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో బాగా డబ్బు ఉన్న ఒక భోజన ప్రియుడు. ఇతడు పేరున్న కొన్ని హోటల్స్ ని కొంటూ ఉంటాడు. కొద్దిగా వంట ఇతనికి నచ్చినా ఆ హోటల్ ని వదలడు. మరోవైపు హీరోయిన్ ఒక హోటల్లో చెఫ్ గా పనిచేస్తుంది. అదే హోటల్లో ఉండే మేనేజర్ తో డేటింగ్ లో ఉంటుంది. అయితే అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో అతనికి దూరమవుతుంది. ఆతరువాత హీరోయిన్ చాలా బాధపడుతుంది. హీరో, హీరోయిన్ బయట ఎదురుపడినప్పుడల్లా కొన్ని సరదా సంఘటనలు జరుగుతుంటాయి. హీరోకి ఆమె బాగా పరిచయం అయిపోతుంది. ఒకరోజు హీరోయిన్ ఉండే హోటల్ ని కొనడానికి వస్తాడు హీరో. అక్కడ ఉన్న వంటవాళ్ళు అందరూ వంటలు చండాలంగా చేస్తారు. హీరోయిన్ మాత్రం వంటలను అద్భుతంగా చేస్తుంది. ఇక ఇంటికి కూడా వెళ్లకుండా అవే వంటలను తింటూ ఉంటాడు హీరో. అయితే వంటలను హీరోయిన్ చేస్తోందని, తెలుసుకొని ఆమెను అభినందిస్తాడు. హీరోయిన్ లీవ్ లో ఉన్నా సరే ఆమె ఇంటికి వెళ్లి వంటలను చేపించుకొని తింటూ ఉంటాడు.
ఇలా వీళ్ళిద్దరి మధ్య బంధం స్ట్రాంగ్ అవుతుంది. హీరోయిన్ మాత్రం అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. అయితే హీరో కూడా ఆమెని ప్రేమిస్తాడు కాని, ఆ విషయం చెప్పడానికి సంకోచిస్తుంటాడు. ఆ తర్వాత హీరో పర్సనల్ గా ఒక అమ్మాయిని చెఫ్ గా పెట్టుకుంటాడు. ఈ విషయం తెలుసుకొని హీరోయిన్ అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. చివరికి వీళ్ళిద్దరూ కలుస్తారా? హీరో తన ప్రేమను ఆమెకు చెప్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఇది నేను ఊహించినది కాదు’ (This is not what I expected) అనే ఈ మూవీని చూడండి.