BigTV English

Brahmamudi Serial Today August 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను రిజెక్ట్ చేసిన కావ్య – ఆనందంలో పండగ చేసుకున్న యామిని   

Brahmamudi Serial Today August 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను రిజెక్ట్ చేసిన కావ్య – ఆనందంలో పండగ చేసుకున్న యామిని   

Brahmamudi serial today Episode: రాజ్‌ తనను పెళ్లి చేసుకోమని కావ్యను అడగ్గానే కావ్య తనకు ఇష్టం లేదని చెప్తుంది. అందరూ షాక్‌ అవుతారు. జీవితం మీద ప్రాక్టికల్‌ జోక్‌ వేసుకోవద్దని ధాన్యలక్ష్మీ చెబితే చిన్నత్తయ్యా నా మీద నేనెందుకు జోక్స్‌ వేసుకుంటాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని కరాకండిగా చెప్పేస్తుంది కావ్య. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. అపర్ణ ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది. ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా అంటుంది. ఇంద్రాదేవి కూడా కోపంగా అదే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది. దీంతో కావ్య ఇష్ట లేదంటే ఇష్టం లేదు. అన్నింటికీ కారణాలు చెప్పాలా..? ఆయన గారు ఇష్ట పడితే నేను ఇష్ట పడాలా..? ఆయన పెళ్లి చేసుకుంటానంటే నేను తలదించుకుని తాళి కట్టించుకోవాలా.? అంటుంది.


దీంతో ఇంద్రాదేవి అది కాదే.. అంటూ ఏదో చెప్పబోతుంటే రాజ్‌ నాన్నమ్మ ఒక్క నిమిషం ఇది నాకు కళావతి గారికి సబంధించిన విషయం ఇందులో మీరెవ్వరూ జోక్యం చేసుకోకండి అంటాడు. దీంతో అపర్ణ అది అలా మాట్లాడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావురా..? అంటుంది. అమ్మా ఫ్లీజ్‌ మీరు బలవంతం చేసి తనను ఒప్పించడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు ఎవ్వరూ మాట్లాడకండి. కళావతి గారు. ఇది మీ లైఫ్‌ దీని గురించి డిసీజన్‌ తీసుకునే హక్కు మీకు మాత్రమే ఉంది. మీరు ఒప్పుకోకుండా నేను ఈ ఇంటికే రాను అలాంటిది మీ జీవితంలోకి ఎందుకు వస్తాను.

కానీ నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు. నేను మీ వెంట పడుతున్నా మీరు ఏమీ అనకపోతే మీక్కూడా నా మీద ఇష్టం ఉందేమో అనుకున్నాను. ఆఫీసులో ఈ ఎండీ ప్లేస్‌లో నన్ను కూర్చోబెట్టేంత నమ్మకం ఉందంటే.. మీ మనసులో కూడా నాకు స్థానం దొరుకుతుంది అనుకున్నాను. మీ సంతోషాన్ని మీ బాధను నాతో పంచుకుంటే నేను మీ వాణ్ని కాబట్టే పంచుకుంటున్నారు అనుకున్నాను. ఇందులో నేను చేసిన తప్పేంటి..? అని అడగ్గానే.. కావ్య అవును చేశాను. నేను కేవలం ఫ్రెండ్ అనే అవన్నీ చేశాను. ఫ్రెండ్స్‌ ను ఎవ్వరూ సాయం అడగరా..? మీరు అందరి లాంటి వారు కాదని మెచ్యూర్‌గా ఆలోచిస్తారని అనుకున్నాను. కానీ మీరు కూడా అందరిలాగే ఆలోచించారు. అసలు నాకు బుద్ది లేదు. ఎవరో ఏంటో తెలియకుండా దగ్గరకు రానిచ్చాను. అదే నేను చేసిన తప్పు. అయినా నా ఇష్టం ఏంటో తెలుసుకోకుండా నా ఫ్యామిలీ అందరి ముందు నిలబెట్టి.. నా పరువు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు..? అని అడగ్గానే…


హక్కా ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నారండి మీరు. ఇది మీరు కాదు. నేను నమ్మను మీ మనసులో ఏదో ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. మీరేంటో నాకు బాగా  తెలుసు. ఎందుకిలా మాట్లాడుతున్నారో నిజం చెప్పండి అంటూ రాజ్‌ నిలదీస్తాడు. నేను ముందు నుంచి ఇలాగే ఉన్నాను. నన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మీ తప్పు. అసలు నాకు తెలియక అడుగుతాను. నేను మిమ్మల్ని నాతో తిరగమని చెప్పానా..? ఫోన్‌ చేశానా.? కలవమని అడిగానా..? పోనీ మిమ్మల్ని ప్రేమించినట్టు కనిపించానా..? మరి నేనేం చేశానని ఇవాళ వచ్చి మా వాళ్ల ముందు నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు. చూడండి వచ్చింది మీరు.. తిరిగింది మీరు.. సాయం చేస్తాను అని అడిగింది మీరు.  మీరే ఏదేదో ఊహించుకుని ఇప్పుడు దానికి బాధ్యురాలిని నేను అంటే ఎలా కుదురుతుంది. దానికి నేనెందుకు సమాధానం చెప్పాలి. ఏదో గతం గుర్తుకు లేదని అంటున్నారని జాలి పడి దగ్గరకు మిమ్మల్ని రానించినందుకు నాకు బాగా బుద్ది చెప్పారండి అంటుంది .

ఇంతలో అపర్ణ కోపంగా వచ్చి కావ్యను  కొట్టబోతుంటే.. రాజ్‌ ఆపేస్తాడు. కావ్య బాగుంది అత్తయ్య పరాయి వాళ్ల కోసం నన్ను కొడతావా… ఆయన్నే నెత్తిన పెట్టుకోండి అంటూ ఏడుస్తూ పైకి వెళ్లిపోతుంది. తర్వాత రుద్రాణి ఇంట్లో జరిగిన విషయం యామినికి ఫోన్‌ చేసి చెప్తుంది. యామిని హ్యాపీగా ఫీలవుతుంది. సంతోషంగా వాళ్ల అమ్మా నాన్నకు కావ్య , రాజ్‌ ను తిట్టిందని.. ప్రేమను రిజెక్ట్‌ చేసిందని చెప్పి అందరూ పండగ చేసుకుంటారు. మరోవైపు అప్పు, స్వరాజ్‌ను తీసుకెళ్లి రేవతికి అప్పజెప్తుంది. తర్వాత గార్డెన్‌లో కూర్చుని బాధపడుతున్న రాజ్‌ దగ్గరకు అపర్ణ, ఇంద్రాదేవి వెళ్లి ఓదారుస్తారు. వాళ్లిద్దరూ ఎంత చెప్పినా రాజ్‌ బాధపడుతూనే ఉంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Star Maa Parivaaram Promo: శ్రీముఖికి దిమ్మతిరిగే కౌంటర్.. పెళ్లి కావ్య షాకింగ్ రియాక్షన్..

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంటికి దొంగగా వచ్చిన ఆనందారావు.. ధీరజ్ కు దొరికిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవనిని గేంటేసిన పార్వతి.. భరత్, ప్రణతిలను విడగొట్టేందుకు పల్లవి ప్లాన్.. భానుమతికి వాతలు..

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య.. పూజను పూర్తి చేసిన రోహిణి.. బాలు సెటైర్లు.. మనోజ్ కు కడుపు మంట..

Nindu Noorella Saavasam Serial Today August 6th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాలాను అడ్డుకునేందుకు ఆరు ప్లాన్‌

Brahmamudi Serial Today August 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన కావ్య – ఎమోషనల్‌ అయిన ఇంద్రాదేవి  

Big Stories

×