E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

దారిద్రాన్ని పాకెట్లో పెట్టుకుని తిరిగే హీరో… ట్విస్టులతో పిచ్చెక్కించే స్పోర్ట్స్ డ్రామా

దారిద్రాన్ని పాకెట్లో పెట్టుకుని తిరిగే హీరో… ట్విస్టులతో పిచ్చెక్కించే స్పోర్ట్స్ డ్రామా
Advertisement

Sports Drama : స్పోర్ట్స్ డ్రామాలు అంటే ఏదో గేమ్స్ గురించే ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ ఈ జానర్లో వచ్చిన కొన్ని సినిమాలలో దుమ్మురేపే యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్స్ డ్రామాగా మొదలై, ఇంటెన్స్ సస్పెన్స్, థ్రిల్ తో మూవీ ముగుస్తుంది. వీటితో పాటు కామెడీ కూడా కలగలిసిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఆ సినిమా పేరే ‘మార్టి సుప్రీమ్’ (Marty Supreme).

ఎక్కడ స్ట్రీమింగ్

2025 చివరలో విడుదలైన మూవీ ‘మార్టి సుప్రీమ్’, ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉన్న అమెరికన్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రమిది. పాపులర్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు మార్టి రైస్‌మాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో టిమోతీ షాలమే (Timothée Chalamet) ప్రధాన పాత్ర పోషించారు. తన ఆత్మవిశ్వాసం, అతి తెలివి వల్ల సమస్యలు కొని తెచ్చుకునే యువకుడు పింగ్-పాంగ్ ప్రయాణమే ఈ సినిమా కథ. ‘అన్‌కట్ జెమ్స్’ (Uncut Gems) చిత్ర దర్శకుడు జోష్ సఫ్డీ ఈ సినిమాను అత్యంత ఉత్కంఠభరితంగా, వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. ఈ చిత్రం ఆస్కార్ రేసులో నిలిచి, విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంది. గ్వైనెత్ పాల్ట్రో, ఒడెస్సా అజియాన్ కీలక పాత్రలు పోషించారు.

కథలోకి వెళ్తే…

Advertisement

1950ల కాలం నాటి న్యూయార్క్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మార్టి మౌజర్ తన అంకుల్ షూ షాప్‌ లో వర్క్ చేస్తుంటాడు. అయితే అతనికి టేబుల్ టెన్నిస్ (పింగ్-పాంగ్) ఆటలో ప్రపంచ ఛాంపియన్ కావాలనే కల ఉంటుంది. విపరీతమైన ప్రతిభ, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న మార్టి, తన ఆట ద్వారా సెలబ్రిటీ కావాలని ఆశపడతాడు. కానీ అతనికున్న అతి పెద్ద బలహీనత ఏమిటంటే… స్వార్థం, తప్పుడు నిర్ణయాల వల్ల తానే స్వయంగా సమస్యలను సృష్టించుకోవడం.

తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మార్టి రకరకాల మోసాలు, బెట్టింగులు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలోనే రిటైర్డ్ నటి కే స్టోన్‌ను లైన్ లో పెడతాడు. అలాగే గాయపడిన గ్యాంగ్‌స్టర్ తన కుక్కను హాస్పిటల్‌కు తీసుకెళ్లమని ఇచ్చిన డబ్బుతో బెట్టింగ్స్ ఆడటం వంటి పిచ్చి పనులు చేస్తాడు. మరోవైపు తన బెస్ట్ ఫ్రెండ్ రాచెల్‌ను గర్భవతిని చేస్తాడు. మార్టి ప్రవర్తన వల్ల అతని జీవితం కీర్తి, గందరగోళం, ప్రమాదకరమైన మలుపుల మధ్య నలిగిపోతుంది.

Advertisement

మార్టి ఎలాగైనా జపాన్ వెళ్లి అక్కడి ఛాంపియన్ ‘ఎండో’తో తలపడాలని అనుకుంటాడు. కానీ అందుకోసం అతను మిల్టన్ అనే వ్యక్తిని కలవాల్సి వస్తుంది. మిల్టన్, మార్టి అహాన్ని అణచడానికి ఒక పార్టీలో అందరి ముందు అతన్ని దారుణంగా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని భరించి జపాన్ వెళ్లిన మార్టికి, అక్కడ కూడా మిల్టన్ ఒక కండిషన్ పెడతాడు. ఎండోతో జరిగే మ్యాచ్‌ లో కావాలనే ఓడిపోవాలని చెప్తాడు. అటు అమెరికాలో రాచెల్ ప్రసవ వేదన అనుభవిస్తూ హాస్పిటల్‌ లో జాయిన్ అవుతుంది.

జపాన్‌లో అందరి ముందు ఎండోతో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మార్టిని ఒక పందిని ముద్దుపెట్టుకోమని నిర్వాహకులు కోరతారు. దాంతో మార్టి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి స్క్రిప్ట్‌ను పక్కన పెట్టి, మిల్టన్ ఆర్థిక సహాయాన్ని తిరస్కరిస్తాడు. మరి అలాంటి టైమ్ లో హీరో పరిస్థితి ఏమయ్యింది ? అసలైన మ్యాచ్ ను హీరో ఎలా ఆడాడు ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది స్టోరీ.

Read Also : దళపతి బర్త్ డే ట్రీట్… ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన విజయ్ టాప్ 5 మూవీస్ ఇవే

Related News

వీళ్ళు పిల్లలు కాదు బాబోయ్ పిశాచాలు… కమ్యూనిటీలోకి వెళ్ళే బేబీసిట్టర్లు మాయం

ఏకంగా ఐలాండ్ కే శాపం… దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా ఉండే ఒక్కో ఎపిసోడ్

బాబోయ్ ఇదేం స్టోరీ ? ఈ కాలేజీలో అడుగు పెడితే ఖతం… ఒంటరిగా చూడాల్సిన హర్రర్ మూవీ

తప్పిపోయిన ఆవు కోసం అమాయకపు చిన్నారి అడ్వెంచర్… కన్నీళ్ళు పెట్టించే కన్నడ కథ

యాక్షన్ నుంచి హర్రర్ వరకు… ట్రెండింగ్లో ఉన్న థ్రిల్లర్స్ ఇవే

ఇద్దరబ్బాయిలతో ఒకే అమ్మాయి… ఈ చైనీస్ సిరీస్ తో సాటిస్ఫ్యాక్షన్ గ్యారంటీ

ఇంటర్వ్యూను మధ్యలో ఆపేస్తే మర్డర్… మైండ్ బెండింగ్ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

×