Vande Bharat Express: భారతీయ రైల్వేలోకి వందేభారత్ ఎంట్రీ సరికొత్త చరిత్రను లిఖించింది. రైల్వే ప్రయాణంలో విప్లవాత్మక మార్పులకు కారణం అయ్యింది. 2019లో ప్రారంభమైనప్పటి నుంచి, ఈ సెమీ హై-స్పీడ్ రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 150 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సర్వీసులను అందిస్తున్నాయి.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ వేగం
చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) అభివృద్ధి చేసిన వందే భారత్ రైళ్లు ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ఇంటర్ సిటీ కనెక్టివిటీని గణనీయంగా పెంచాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు గరిష్టంగా 180 కి.మీ./గం వేగంతో నడిచేలా రూపొందించబడ్డాయి. అయితే వాటి గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 160 కి.మీకి పరిమితం చేశారు. రైలు వేగం ట్రాక్ జ్యామెట్రీ, రూట్ స్టాప్‌లు, సెక్షన్ లో మెయింటెనెన్స్ వర్క్స్ అంశాల మీద ఆధారపడి ఉంటాయి.
రూట్ అంతా ఒకే వేగంతో నడిచే వందేభారత్ రైళ్లు
సాధారణ రైళ్లతో పాటు వందేభారత్ రైళ్లు కూడా ఆయా రూట్లలో ఒక్కో చోట ఒక్కో వేగంతో వెళ్తాయి. కొన్ని వందేభారత్ రైళ్లు మాత్రం ఆయా రూట్లలో 130 కి.మీ. వేగంతో నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 150 వందేభారత్ రైళ్లు నడుస్తున్నా, వాటిలో 5 రైళ్లు మాత్రం రూట్ అంతా ఒకే వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ రైలు నంబర్ 20825/20826 బిలాస్ పూర్-నాగ్‌పూర్-బిలాస్ పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 22347/22348 హౌరా-పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 22962/22961 అహ్మదాబాద్-ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 22303/22304 హౌరా-గయా-హౌరా వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 20101/20102 నాగ్ పూర్-సికింద్రాబాద్-నాగ్ పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
Read Also: పండుగకు ట్రైన్ టికెట్ దొరకలేదా? ఈ టూల్ తో బెర్త్ ఈజీగా పట్టేయండి!
ఈ రైళ్లు కాకుండా కాకుండా, మరికొన్ని వందే భారత్ రైళ్లు కూడా 130 కి.మీ./గం వేగాన్ని అందుకుంటాయి. అయితే, ఆయా మార్గాల్లో నిర్ణీత ప్రదేశాల్లోనే గరిష్ట వేగంతో వెళ్తాయి. మొత్తం ప్రయాణంలో అదే వేగంతో వెళ్లవు. వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ న్యూఢిల్లీ- ప్రయాగ్ రాజ్ మధ్య గంటకు 130 కి.మీ. వేగంతో నడుస్తుండగా, ప్రయాగ్ రాజ్-వారణాసి మార్గం గంటకు 110 కి.మీ.లకు పరిమితం చేయబడింది. న్యూఢిల్లీ-కత్రా సర్వీస్ న్యూఢిల్లీ- లూథియానా మధ్య గంటకు 130 కి.మీ. వేగంతో నడుస్తుంది. రీసెంట్ గా పార్లమెంట్ లో మాట్లాడిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. గత 10 సంవత్సరాలలో వేగ సామర్థ్యాన్ని పెంచడానికి భారతీయ రైల్వేలో రైల్వే ట్రాక్ ల అప్ గ్రేడేషన్ శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తి అయ్యాక వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు గరిష్ట వేగంతో ప్రయాణాలు కొనసాగించనున్నాయి.
Read Also: పండుగ సీజన్ లో కన్ఫార్మ్ టికెట్ కావాలా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి!