Railway Interesting Facts: ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతున్న భారతీయ రైల్వేలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. అత్యంత వేగంగా వెళ్లే రైళ్లు, అత్యంత స్లోగా వెళ్లే రైళ్లు, అతి చిన్నరైల్వే స్టేషన్లు, అతి పెద్ద రైల్వే స్టేషన్లు, అత్యధిక ప్రయాణీకులు ఉండే స్టేషన్లు, అందమైన రైల్వే రూట్లు, డేంజరస్ రైల్వే మార్గాలు.. ఒకటేమిటీ ఎన్నో ఆసక్తికర సంగతులున్నాయి. ఇప్పుడు మనం ఓ ప్రత్యేక రైలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశంలోనే అతి చిన్న రైలు
ఉత్తర ప్రదేశ్ లోని ఐత్ కొంచ్ షటిల్ దేశంలోనే ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది దేశంలోనే అతి చిన్న రైలు. కేవలం మూడు కోచ్ లను కలిగి ఉంటుంది. కొంచ్ నగర్ నుంచి జలౌన్ సర్సౌకి స్టేషన్ వరకు ఈ రైలు సేవలు అందిస్తుంది. గంటలకు కేవలం 30 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కారు, బస్సు, బైక్ ను చెయ్యెత్తి లిప్ట్ అడిగినట్లు, ఈ రైలును కూడా లిఫ్ట్ అడగొచ్చు. రైల్వే స్టేషన్లలోనే కాదు, మార్గ మధ్యంలో ఎక్కడ చెయ్యొత్తినా రైలు ఆగుతుంది. బహుశ ప్రపంచంలో చెయ్యెత్తితే ఆపే ఏకకై రైలు ఐత్ కొంచ్ షటిల్ మాత్రమే.
బ్రిటీష్ కాలం నుంచి ప్రయాణం
ఐత్ కొంచ్ షటిల్ కు ఎంతో చరిత్ర ఉంది. ఈ రైలు బ్రిటీష్ కాలంలో ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలు అందిస్తూనే ఉంది. మొదట్లో ఈ రైలు కేవలం 13 కిలో మీటర్ల దూరం ప్రయాణించేది. కొంత కాలం తర్వాత ప్రయాణీకులు ఎక్కకపోవడం నష్టాలు వచ్చాయి. చేసేదేం లేక రైల్వే అధికారులు ఈ రైలు సేవలను ఆపేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న రైలు సర్వీసులను ఆపకూడదని స్థానికుల నుంచి డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఐత్ కొంచ్ షటిల్ ను మళ్లీ ప్రారంభించారు. అయితే, గతంలో 13 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ ప్రయాణం ఇప్పుడు 46 కిలో మీటర్లకు పెంచారు. సుమారు మూడు గంటల సమయంలో ఈ రైలు తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఎవరైనా రైలు మిస్ అయితే, చెయ్యొత్తగానే ఆపుతుంది.
Read Also: కాండీ TO ఎల్లా.. ప్రపంచంలోనే అత్యంత అందమైన రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా?
రోజూ రెండు సర్వీసులు, టికెట్ ధర రూ. 10
ఐత్ కొంచ్ షటిల్.. కొంచ్ నుంచి సర్సౌకి వరకు రోజుకు రెండుసార్లు సర్వీసులను అందిస్తున్నది. స్టేషన్ దగ్గర మాత్రమే కాకుండా.. ప్రయాణీకులు మధ్యలో ఎక్కడైనా చేయి ఎత్తి ట్రైన్ లో ఎక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, ఉపాధి కార్మికులు, చిరు పారులకు ఈ రైలు చాలా ఉపయోగపడుతున్నది. ఈ ట్రైన్ లో టికెట్ ధరలు కూడా చాలా తక్కువ. ప్రయాణ దూరాన్ని బట్టి రూ.10, రూ.15 టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
Read Also: రైల్వే ప్రయాణీకులకు సూపర్ న్యూస్, జనరల్ బోగీలు పెరుగుతున్నాయ్!