E-Paper
Advertisement

సిస్టమ్ మొత్తాన్ని గడగడలాడించిన కాటన్ ట్రేడర్… మైండ్ బెండింగ్ క్లైమాక్స్

సిస్టమ్ మొత్తాన్ని గడగడలాడించిన కాటన్ ట్రేడర్… మైండ్ బెండింగ్ క్లైమాక్స్
Advertisement

Matka King Web Series : అండర్ వరల్డ్ అంటే గ్యాంగ్స్టర్లు, గ్యాంబ్లింగ్ లు వంటివి సహజం. అయితే అవి ఎలా జరుగుతాయి ? అసలు గ్యాంగ్ స్టర్లు ఎలా పుట్టుకొస్తారు ? వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ? అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించే సినిమాలు, సిరీస్ లు చాలానే వచ్చాయి. కానీ అందులో రియల్ గ్యాంగ్స్టర్ గురించిన స్టోరీలు మాత్రం చాలా అరుదు, అలాంటి ఒక రియల్ స్టోరీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ముంబై అండర్‌ వరల్డ్‌లోని మట్కా గ్యాంబ్లింగ్ సామ్రాజ్యం గురించి ఇప్పటి వరకు ఎవరూ ఇంత ధైర్యంగా, ఇంత వివరంగా చూపించలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది “Matka King” సిరీస్ గురించి. 1960, 70ల నాటి ముంబై నగరంలో రియల్ లైఫ్ మట్కా కింగ్ “రతన్ ఖత్రి” జీవితం ఆధారంగా తెరకెక్కిన పీరియడ్ క్రైమ్ డ్రామా ఇది. ఇందులో బ్రిజ్ భట్టి (విజయ్ వర్మ) అనే సాధారణ వ్యక్తి తన బాస్ అవమానించడంతో, మట్కా జూదాన్ని సొంతంగా ప్రారంభించి, వ్యవస్థనే శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది చూపించారు. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video)లో ఇప్పుడు శతరేయమింగా అవుతోంది. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ స్టోరీపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

Advertisement

బొంబాయిలోని కాటన్ మిల్లు యజమాని లాల్‌జీ భాయ్ (గుల్షన్ గ్రోవర్). అప్పట్లో అతను మట్కా నిర్వాహకుడు. ఆయన దగ్గర బ్రిజ్ భట్టి మేనేజర్‌ గా పని చేస్తూ ఉంటాడు. జూదం అప్పుల కారణంగా బ్రిజ్ తమ్ముడు ఇబ్బందుల్లో పడతాడు. ఇలాంటి కష్ట సమయంలో లాల్‌జీ భాయ్ సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. పైగా నలుగురిలో అతన్ని అవమానిస్తాడు. దీంతో బ్రిజ్ అప్పటికే ఆయన దగ్గర చేస్తున్న ఉద్యోగం మానేస్తాడు. ఇక్కడే కథ టర్న్ తీసుకుంటుంది. బ్రిజ్ సొంతంగా ఒక ‘మట్కా’ సెంటర్‌ ను స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు.

అయితే నిజానికి జూదంలోనూ నిజాయితీగా ఉండాలని నమ్ముతాడు బ్రిజ్. అందుకే అతను త్వరగానే సామాన్య ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. ధనవంతులకే పరిమితమైన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొస్తాడు. ఇంకేముంది అతని వ్యాపారం ఊపందుకుంటుంది. మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న ఆ మట్కా సామ్రాజ్యం వల్ల బ్రిజ్ భట్టి క్రమంగా ‘మట్కా కింగ్’గా మారతాడు. అంతేనా ముంబైని శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఆ తరువాత అతను పోలీసుల కళ్ళలో పడడం, అతన్ని అణచివేయాలని చూడడంతో కథలో ఊహించని ట్విస్టులు వస్తాయి. మరి ఆ ట్విస్టులు ఏంటి ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

Advertisement

Read Also : జైలులోనే అతి కిరాతకంగా హత్య… సైకో కిల్లర్ కు చెక్ పెట్టే లేడీ కిలాడీ

Related News

అర్జునుడిని మించిన విలుకాడు.. అయినా జీవితమంతా అవమానాలే… ఓటీటీలోకి తెలుగులోనే కర్ణుడి కథ

ఇదెక్కడి ఉన్మాదంరా అయ్యా… పెళ్ళాన్ని చంపిందని షార్క్ పై పగబట్టే సైకో

ఒక హత్య… వంద అనుమానాలు… క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారంటీ

డబ్బుల కోసమే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ డ్రామా… నాగ దుర్గ తమిళ మూవీ తెలుగు స్ట్రీమింగ్ షురూ

ఒక ప్రయాణం… రెండు ప్రేమకథలు… ప్రతి కుటుంబం చూడాల్సిన రోడ్ ట్రిప్ డ్రామా

తల్లికి పెళ్లి చేయాలనుకునే పెళ్లీడుకొచ్చిన కొడుకు… విజయ్ ఆంటోని ఫ్యామిలీ డ్రామా తెలుగులో

కుస్తీ పోటీల్లో ఇరగదీసే భార్య… ఇంట్లోనే స్ట్రగులయ్యే భర్త… తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు తెలుగులోనే

చెక్క వంతెన దాటితే చావు మూడినట్టే… క్లైమాక్స్‌తో పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ మూవీ తెలుగులో

Big Stories

Advertisement
×