OTT Movie: హర్రర్ మూవీస్ అంటే.. ఇండోనేషియా తర్వాతే. వాళ్లు తీసే హార్రర్ సినిమాలు చాలా సహజంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ దెయ్యాలను చూస్తే చాలు.. కాసేపు గుండె ఆగిపోద్ది. వారు ఎంచుకొనే కథలు కూడా ప్రేక్షకులు మూవీలోకి ఇన్వాల్వ్ చేసేలా ఉంటాయి. తాజాగా ఓటీటీలో దూసుకెళ్తున్న ఇండోనేషియన్ మూవీ ‘వినా: బిఫోర్ 7 డేస్ (Vina: Before 7 Days). ఈ మూవీ ఒరిజినల్ టైటిల్. వీనా: సెబెలుమ్ 7 హరి (Vina: Sebelum 7 Hari). 2024లో విడుదలైన ఈ మూవీ ఇండోనేషియాలో సంచలనం సృష్టించింది. ఆ దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది.
కథ ఏమిటంటే?
ది వీనా దేవీ అర్సితా (నైలా డి. పుర్నమా), ఎకీ (యూసుఫ్ మహర్దికా) అనే ప్రేమ జంట హత్యల వాస్తవ ఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కథ భయపెడుతూనే.. థ్రిల్ చేస్తూ.. భావోద్వేగ సన్నివేశాలతో ఏడిపిస్తుంది. ఈ కథ 2016లో సిరెబాన్‌లోని టాలున్ ఓవర్‌పాస్‌పై ప్రారంభమవుతుంది. అక్కడ వీనా దేవీ అర్సితా (నైలా డి. పుర్నమా) ఆమె ప్రియుడు ఎకీ యూసుఫ్ మహర్దికా)లు దారుణమైన స్థితిలో చనిపోయి కనిపిస్తారు.
మొదట్లో.. వారిద్దరు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని భావిస్తారు. అయితే.. వీనా శరీరంపై అసాధారణమైన గాయాలు, కత్తితో కోసిన గుర్తులు ఉంటాయి. పోస్ట్ మార్టంలో కూడా అవి యాక్సిడెంట్ వల్ల ఏర్పడిన గాయాలు కావని, ఎవరో కావాలనే దారుణంగా కొట్టి చంపారని డాక్టర్లు గుర్తిస్తారు. కానీ, రిపోర్టు మాత్రం వేరేగా ఇస్తారు. వీనా అమ్మమ్మ నేనెక్ వీనా (లిడియా కండౌ), తండ్రి వస్నాది (సెప్టియన్ ద్వి కహ్యో) ఆ రిపోర్డును నమ్మరు.
ఈ ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత వీనా స్నేహితురాలు లిండా (గిసెల్మా ఫిర్మన్స్యాహ్) వింతగా ప్రవర్తిస్తుంది. ఈ విషయం తెలిసి లిండా ఇంటికెళ్లిన వీనా కుటుంబం ఆమె ఇంటికి వెళ్తారు. ఆమె మాటలు విని.. లీండాను వీనా ఆవహించిందని తెలుసుకుంటారు. అప్పుడే వారికి అసలు విషయం తెలుస్తుంది. తమ మరణం యాక్సిడెంట్ వల్ల కాదని, 12 మంది మోటార్ సైకిల్ సభ్యులు తమపై దాడి చేసి, దారుణంగా హింసించి.. అత్యాచారం చేసి చంపేశారని లిండాలో ఉన్న వీనా ఆత్మ చెబుతుంది. ఈ దాడిలో ప్రధాన నిందితుడు ఎగీ (ఫహద్ హైద్రా) అని చెబుతుంది. అతడు ఎన్నాళ్ల నుంచి ఆమెపై కన్నేస్తాడు. చివరికి.. ఆమె తన బాయ్ ఫ్రెండ్ ఏకీతో కనిపించేసరికి ఈ దారుణానికి పాల్పడతాడు.
ఇక్కడే అసలైన సవాళ్లు..
ఆత్మ చెప్పిందని కేసు ఎలా నమోదు చేస్తామని పోలీసులు సంకోచిస్తారు. కానీ, ఒక పోలీసు అధికారి ఇంద్ర (ఎడ్వర్డ్) నేతృత్వంలో దర్యాప్తు మొదలవుతుంది. వీనా ఆత్మ చెప్పిన నిందితులను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఏగి తల్లిదండ్రులు తన కొడుకును రక్షించేందుకు ప్రయత్నిస్తారు. ఈ దారుణ హత్యల గురించి మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రజాందోళనలు మొదలవుతాయి. మరి చివరికి.. వీనాకు న్యాయం జరిగిందా? ఆ నిందితులను వీనా ఏ విధంగా చుక్కలు చూపిస్తుంది? తానే ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా చట్టానికి అప్పగిస్తుందా? చివరికి ఏమవుతుంది అనేది బుల్లితెరపైనే చూడాలి. ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ భాష, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఇంకా చూడనట్లయితే.. వెంటనే చూడండి.
ఏడు రోజులే ఎందుకు?
కొన్ని ఆసియా దేశాల ప్రజలకు ఆత్మలకు వివిధ నమ్మకాలు ఉంటాయి. ముఖ్యంగా జపాన్ దేశీయులు.. వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ ఏడు రోజులు భూమిపై ఉంటుందని నమ్ముతారు. దాని ఆధారంగానే ఈ మూవీని తెరకెక్కించారు. వాస్తవ ఘటనలకు కాస్త కల్పితాలను జోడించి ఈ మూవీని రూపొందించారు. హార్రర్, థ్రిల్లింగ్ విషయాల్లో ఈ మూవీ అస్సలు మిమ్మల్ని నిరుత్సాహ పరచదు. కానీ, చాలా హింస ఉంటుంది. పిల్లలతో మాత్రం చూడొద్దు.