OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల స్టోరీలతో సినిమాలు వస్తున్నాయి. అయితే కొన్ని హాలీవుడ్ సినిమాలను చూస్తున్నప్పుడు, ఇండియన్ సినిమాలను గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమా, ఏంజెలికా అనే హౌస్‌వైఫ్ చుట్టూ తిరుగుతుంది. ఆమె వైవాహిక జీవితంలో వచ్చిన అసంతృప్తితో మరొక వ్యక్తిని ఇష్టపడుతుంది. ఆతరువాత స్టోరీ మరో రేంజ్ లోకి వెళ్తుంది. ఈ స్టోరీ ప్రేక్షకులను లవ్, ఫ్రీడమ్, సోషల్ నార్మ్స్ గురించి ఆలోచింపజేస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
స్టోరీలోకి వెళ్తే
ఏంజెలికా ఒక డెడికేటెడ్ హౌస్‌వైఫ్. సంప్రదాయ మ్యారేజ్‌లో ఉంటుంది. ఆమె జీవితం బయటికి పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. కానీ లోపల అసంతృప్తితో బాధపడుతుంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నప్పుడు, సైమన్ అనే బ్రైడ్ బ్రదర్‌ని కలుస్తుంది. సైమన్ ఫ్రీ-స్పిరిటెడ్ నేచర్, సెన్సువల్ అప్రోచ్ ఏంజెలికాని ఆకర్షిస్తుంది. వాళ్ల మధ్య కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఆమె సంప్రదాయ పద్దతిని సవాలు చేస్తుంది. ఏంజెలికా భర్త డైరిస్ ఆమె ఎమోషనల్ నీడ్స్‌ని పక్కన పెడతాడు. రాత్రిపూట కూడా పక్కకు తిరిగి పడుకుంటాడు. సైమన్‌తో ఆమె రొమాన్స్ ఒక కొత్త జర్నీలోకి తీసుకెళ్తుంది.
ఏంజెలికా, సైమన్ మధ్య రొమాన్స్ ఇంటెన్స్ అవుతుంది. కానీ ఆమె గిల్ట్, సోషల్ ప్రెజర్‌తో స్ట్రగుల్ అవుతుంది. సైమన్ ఆమెని తన ప్రిన్సిపుల్స్‌ని వదిలేయమని, ఆమె డిజైర్స్‌ని ఎంబ్రేస్ చేయమని చెబుతాడు. ఒక సీన్‌లో, ఏంజెలికా మిర్రర్ ముందు బట్టలు లేకుండా నిలబడి, తన ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తుంది. నార్మా అనే ఫ్రెండ్ తనకి సపోర్ట్ చేస్తుంది. క్లైమాక్స్‌లో ఏంజెలికా తన మ్యారేజ్, పాషన్ మధ్య డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆమె చాయిస్ ఆమె జీవితాన్ని రీడిఫైన్ చేస్తుంది. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? భర్తను వదిలేస్తుందా ? ప్రియుడితో ఉంటుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘Vulgar’ ఒక రొమాంటిక్ డ్రామా సినిమా. దేనికి సంతియాగో రివెరో దర్శకత్వం వహించారు. ఇందులో కత్రీనా క్రీలే (ఏంజెలికా), గాబ్రియల్ అగ్యూరో (సైమన్), గైలే బుట్విలైట్ (నార్మా) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 43 నిమిషాల ఈ సినిమాకి, IMDbలో 5.2/10 రేటింగ్ ఉంది. 2024 డిసెంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం Amazon Prime Video, Apple TVలో అందుబాటులో ఉంది.
Read Also : తాగుబోతు పోలీస్ బయటపెట్టే బండారం… అలాంటి కేసులో భార్యకు లింక్… సీను సీనుకో ట్విస్ట్