BigTV English

Red Rainbow: ఇదెక్కడి వింత రా మామా.. రెన్ బోకు రెడ్ కలర్ ఏంట్రా?

Red Rainbow: ఇదెక్కడి వింత రా మామా.. రెన్ బోకు రెడ్ కలర్ ఏంట్రా?

Monochrome Rainbow: తాజాగా ఫిన్లాండ్ కు చెందిన ఓ జాలరి వింతైన ఇంద్ర ధనస్సును ఫోటో తీశాడు. ఈ రెయిన్ బోలోని టైన్బోలు ఏడు రంగులు కాకుండా ఒకే రంగును చూపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఇంద్రధనస్సు కేవలం ఎరుపు రంగులోనే కనిపిస్తుంది.  ఇంతకీ  ఈ ఎరుపు ఇంద్రధనస్సులు ఎలా ఏర్పడతాయి? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఎరుపు రంగు ఇంద్ర ధనస్సు గురించి..

ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటాయి. ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో, వైలెట్. వర్షం పడే సమయంలో సూర్యకిరణాలు తగిలినప్పుడు రెయిన్ బో ఏర్పడుతుంది. అయితే, ఇంద్రధనస్సులకు కూడా కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి.  ప్రతిసారీ, ఇంద్రధనస్సు కలిగి ఉండాల్సిన స్పష్టమైన రంగులను మీరు చూస్తారు. కానీ, మీరు మోనోక్రోమ్ ఇంద్రధనస్సు గురించి విన్నారా?  అది ఒక రంగును మాత్రమే చూపిస్తుంది. 1881లో సైన్స్ జర్నల్ నేచర్‌ లో వచ్చిన పరిశోధన పత్రంలో భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్ సిల్వానస్ పి. థాంప్సన్ నాలుగు సంవత్సరాల క్రితం తాను చూసిన ఈ అద్భుతమైన దృశ్యం గురించి వివరించాడు. ఈ ఇంద్రధనస్సు సూర్యాస్తమయ సమయంలో కనిపించిందని, మొత్తం ఏడు రంగుల్లో కాకుండా ఎరుపు, నారింజ రంగులను మాత్రమే కనిపిస్తాయని ఆయన వెల్లడించారు.


ఎరుపు రంగు ఇంద్రధనస్సులు ఎలా ఏర్పడతాయి?

ఎరుపు ఇంద్రధనస్సు ఏర్పాటు గురించి ఎటువంటి తేడా లేదు. ఇది సాధారణ పూర్తి స్పెక్ట్రమ్ ఇంద్రధనస్సు లా ఏర్పడుతుంది. ఇంద్రధనస్సులు భౌతికంగా ఉండవు. కానీ, సూర్యకాంతి 42-డిగ్రీల కోణంలో నీటి బిందువుల గుండా వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. దృశ్య కాంతి వర్ణపటంలో కాంతి విభిన్న తరంగదైర్ఘ్యాలు ఉంటాయి. ఇవి ఇంద్రధనస్సులో మనం చూసే విభిన్న రంగులను సృష్టిస్తాయి. సూర్యకాంతి నీటి బిందువు గుండా వెళ్ళినప్పుడు, ప్రతి తరంగదైర్ఘ్యం వేరే కోణంలో ప్రతిబింబిస్తుంది. ఫలితంగా ఇంద్రధనస్సు బ్యాండ్‌ ను సృష్టిస్తుంది. ఎరుపు ఇంద్రధనస్సులతో, ఎరుపు రంగు మాత్రమే కనిపిస్తుంది. అవి సూర్యోదయం,  సూర్యాస్తమయ సమయంలో, సూర్యుడు హోరిజోన్‌కు దగ్గరగా ఉన్నప్పుడు జరుగుతాయి. సూర్యకిరణాలు ఇక్కడి నుండి ఎక్కువ దూరం ప్రయాణించాలి, కాబట్టి, పొడవైన తరంగదైర్ఘ్యం మాత్రమే మనకు చేరుతుంది. మిగిలినవి ఆకాశంలో చెల్లాచెదురుగా ఉంటాయి. ఎరుపు రంగు పొడవైన తరంగదైర్ఘ్యం కాబట్టి, మనం ఎరుపు రంగును మాత్రమే చూస్తాము.

2020లో రెండుసార్లు కనిపించిన ఎరుపు ఇంద్రధనస్సులు   

ఈ ఎరుపు రంగు ఇంద్రధనస్సు 2020లో  ఫిన్లాండ్‌ లోని ఒక జాలరికి కనిపించింది. హెల్సింకికి ఉత్తరాన 160 కి.మీ దూరంలో ఉన్న పైజన్నే తవాస్టియాలోని సరస్సుపై దానిని చూశాడు. “వర్షం పడటం ప్రారంభమైంది. ఈ ఇంద్రధనస్సు కనిపించింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది పూర్తి ఎరుపు రంగులో మాత్రమే ఉంది” అని అవీ జున్నో అనే జాలరి వెల్లడించాడు.

Read Also:  పాలు మాంసాహారమా? అమెరికాలో అంతే.. ఎందుకంటే?

Related News

Mumbai viral video: భారీ వరదలు.. మోకాళ్ల లోతు నీరు.. అయినా మందు తాగుతూ చిల్ అవుతున్న అంకుల్స్

Video viral: ముంబై వరదల్లో హీరోగా మారిన స్పైడర్ మ్యాన్.. నీటిని మొత్తం తోడేశాడుగా.. వీడియో వైరల్

Dance video: చీరలో డ్యాన్స్ దుమ్ముదులిపేసింది భయ్యా.. హీరోయిన్ కూడా పనికిరాదు.. వీడియో వేరే లెవల్

Viral video: ఇవి వరద నీళ్లా.. స్విమ్మింగ్ పూలా..? ఎలా ఈత కొడుతున్నారో చూడండి, వీడియో వైరల్

Viral Video: అగ్నిపర్వతం బద్దలయ్యే క్షణాల ముందు.. ప్రియురాలికి లవ్ ప్రపోజ్, వీడియో వైరల్

Big Stories

×