Mumbai viral video: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అయితే కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారుల్లో వరద నీరు ప్రవాహం చూస్తుంటే వాగు పొంగిపొర్లినట్టుగా కనిపిస్తోంది. ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయిపోతుంది. భారీ వర్షానికి నగర వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు అయితే వాగులను, చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే ముంబై నగరంలో వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో చిన్న టేబుల్ పై మద్యం బాటిల్, గ్లాసుల్లో మద్యం సేవిస్తూ ఆనందంగా సమయం గడుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
And Trump thinks he can scare us with sanctions 😂😂#Mumbai #MumbaiRains pic.twitter.com/VChjmv8Qmd
— Amitabh Chaudhary (@MithilaWaala) August 20, 2025
ముంబైలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో నీటిలో టేబుల్ వేసి మద్యం సేవిస్తూ ఆనందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అమితాబ్ చౌధరి అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో ఓ భవనం ముందు మోకాళ్ల లోతు నీటిలో ఇద్దరు వ్యక్తులు కూర్చొని, చిన్న టేబుల్‌పై మద్యం బాటిల్, గ్లాసులు ఉంచి ఆనందంగా సమయం గడుపుతున్న దృశ్యం కనిపిస్తుంది. వారు కుర్చీల్లో కూర్చొని వరద పరిస్థితిని సరదాగా ఆస్వాదిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
ALSO READ: Kurnool News: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటకుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశారు.‘ముంబై ఇన్ స్పిరిసేన్ లేదా ముంబైకర్ల స్పిరిట్స్’ అని సరదాగా కామెంట్ చేశాడు. మరొక వ్యక్తి ‘భారీ వరద నీటిలో వీరిద్దరు మందు తాగుతూ ఆనందంగా గడుపుతున్నారు.. ఇది కదా అసలైన కిక్ అంటే’ అని కామెంట్ చేసుకొచ్చాడు. ఇంకొకరు ‘నేను ఈ వీడియో చూసి నవ్వను, కనీసం వారికి కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి.. మాకు అవ్వి కూడా లేవు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ కామెంట్లు ముంబై వాసుల జీవన శైలి, వరదల వంటి సవాళ్లను ఎదుర్కొనే తీరును సరదాగా, ఆశ్చర్యకరంగా చూపిస్తున్నాయి.
ALSO READ: Crime News: ఎనిమిదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన టెన్త్ స్టూడెంట్.. చివరకు టీచర్లపై?
ముంబైలో భారీ వర్షాలు, వరదలు సర్వసాధారణం అయినప్పటికీ ఈ వీడియోలోని దృశ్యం ప్రజల ఆనందపరిచే స్వభావాన్ని, సవాళ్లను సరదాగా మలచుకునే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. వీడియో చూసినవారు ముంబై వాసుల జీవనశైలి గురించి మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ వీడియోను వీక్షిస్తున్నారు. వేల మంది లైకులు, కామెంట్లు చేస్తున్నారు.