OTT Movie : వెబ్ సిరీస్ లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ లను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ఆన్లైన్ మోసాల గురించి తెలియజేస్తుంది. ఒక మంచి మెసేజ్ ఇచ్చే వెబ్ సిరీస్ గా దీనిని చెప్పవచ్చు. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జియో హాట్ స్టార్ (JIo hot star) లో
ఈ టీన్ డ్రామా సిరీస్ పేరు ‘వెబ్బేడ్’ (Webbed). ఇది MTV ఇండియా ద్వారా ప్రసారమైన ఒక ఇండియన్ టీన్ సిరీస్. దీనిని వికాస్ గుప్తా సృష్టించారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మించారు. ఈ సిరీస్ 2013-2014 లో ప్రసారమైంది. ఇంటర్నెట్‌లో సైబర్ క్రైమ్, దొంగతనం, పోర్నోగ్రఫీ, ఇతర ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన వాస్తవ కథల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ యువతలో సైబర్ అవగాహనను పెంచడానికి ఉద్దేశించింది. రెండు సీజన్లు, 37 ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఒక్కో స్టోరీ ఒక్కోలా డిజైన్ చేసారు. జియో హాట్ స్టార్ (JIo hot star) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
కునాల్ అనే టీనేజ్ కి వచ్చిన ఒక కుర్రాడు చదువుకోవడానికి కాలేజీకి వెళ్తాడు. అయితే ఇతడు బక్క పలుచగా, రొమాంటిక్ గా లేకపోవడంతో అందరూ ఇతన్ని ఎగతాళి చేస్తుంటారు. అందుకుగాను తనకు తానే చాలా బాధపడుతూ ఉంటాడు కునాల్. ఈ అల్లరి రాను రాను ఎక్కువ అవుతుంది. ఎలాగైనా తానొక గర్ల్ ఫ్రెండ్ ను పొందాలనుకుంటాడు. ఈ క్రమంలో చాలామందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు కూడా పెడతాడు. ఎవరూ రెస్పాన్స్ అవ్వకపోవడంతో, డేటింగ్ యాప్ లో చాలామందికి రిక్వెస్ట్ లు పెడతాడు. తానియ అనే ఒక ఆంటీ ఇతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంది. ఆ ఆంటీ అందం చూసి ఫిదా అయిపోతాడు. ఇక వీళ్లిద్దరూ కలిసి చట్టపట్టాలేసుకుని తిరుగుతారు. తాను ముంబైకి ఒక పని మీద వచ్చానని ఆమె కునాల్ కు చెప్తుంది. ఇక వీళ్ళు గోవా ట్రిప్ కి ప్లాన్ చేస్తారు.
కునాల్ తన ఫ్రెండ్ ను కూడా ఈ ట్రిప్ కి ఇన్వైట్ చేస్తాడు. అతను తన గర్ల్ ఫ్రెండ్ తో వస్తాడు. వీళ్ళు ట్రిప్ కు వెళ్దాం అనుకునే లోపు తానియా లగేజ్ ను వాళ్ళ కారులో పెట్టి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి పంపిస్తుంది. వాళ్ళు వెళ్లిన తర్వాత తనియా కూడా జాయిన్ అవుతుంది. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది. కునాల్ తోనే కాకుండా, అతనికి తెలియకుండా అతని ఫ్రెండ్ తో కూడా పడక గదిలో రెచ్చిపోతుంది. తిరిగి వెళ్లేటప్పుడు కూడా లగేజ్ ను కారులో పెట్టి మళ్ళీ వస్తానని చెప్పి పంపిస్తుంది. అయితే కారును మధ్యలో పోలీసులు చెక్ చేస్తే, ఆ బ్యాగ్ లో డ్రగ్స్ ఉంటాయి. పోలీసులు వీళ్ళను అరెస్ట్ చేస్తారు. ఇంతలో తాన్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని హోటల్ రూమ్ నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ప్రొఫైల్ కూడా డిలీట్ చేస్తుంది.చివరికి ఈ స్టూడెంట్స్ పరిస్తితి ఏమిటి ? అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోండి.
Read Also : ఈ సెలూన్ లోకి వెళ్తే తలకాయలు తెగిపోతాయి … ఈ సైకో పిల్ల వేశాలకు గుండెల్లో దడ పుట్టాల్సిందే