BigTV English

OTT Movie : ఇండియాలోకి అడుగు పెట్టబోతున్న కొరియన్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్… ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

OTT Movie : ఇండియాలోకి అడుగు పెట్టబోతున్న కొరియన్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్… ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

OTT Movie : పాపులర్ కొరియన్ యాక్టర్ డాన్ లీ (మా డాంగ్-సియోక్)కి ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్రేజీ జాంబీ మూవీ ‘ట్రైన్ టు బుసాన్’ తరువాత అతనికి ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఇక డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలో విలన్ గా డాన్ లీ నటించబోతున్నాడు అంటూ కొంతకాలం క్రితం వచ్చిన రూమర్ ఆయనకు ఇక్కడ మంచి స్టార్ డంను తెచ్చిపెట్టింది. ఆ వార్త నిజం కాకపోయినా ఈ నటుడి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు తెలుగు ప్రేక్షకులు స్పెషల్ గా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాన్ లీ నటించిన సీరియల్ కిల్లర్ మూవీ ఒకటి ఇండియాలో ఓటీటీల ద్వారా అడుగు పెట్టబోతోంది. ఈ మూవీ పేరేంటి? స్టోరీ? ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


రెండవ ఓటీటీలోకి…
డాన్ లీ (మా డాంగ్-సియోక్) మెయిన్ లీడ్ గా నటించిన సైకో థ్రిల్లర్ ‘మర్డరర్’ (Murderer). 2014లో విడుదలైన దక్షిణ కొరియాలో రిలీజ్ అయిన ఈ సినిమాకు లీ గి-వూక్ దర్శకత్వం వహించారు. రియల్ సీరియల్ కిల్లర్ కాంగ్ హో-సూన్ కేసు స్పూర్తితో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో స్టోరీ అంతా ఒక సీరియల్ కిల్లర్‌, అతని కొడుకు చుట్టూ తిరుగుతుంది. దశాబ్దం తరువాత ఎట్టకేలకు ఈ సినిమా మే 16న లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో విడుదలవుతోంది. కొరియన్, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…
జూ-హ్యూప్ (మా డాంగ్-సియోక్) ఒక సీరియల్ కిల్లర్. కానీ అతను తన గతాన్ని వదిలేసి, తన కొడుకు యాంగ్-హో (అహన్ డో-గ్యూ)తో కలిసి ఒక చిన్న గ్రామంలో సైలెంట్ గా జీవితాన్ని గడుపుతాడు. యాంగ్-హో 7వ తరగతి చదువుతాడు. తల్లి చనిపోయాక తండ్రితో కలిసి ఈ గ్రామానికి వస్తాడు. అలాగే ఒకానొక సందర్భంలో యాంగ్-హో తన తండ్రి హత్య చేస్తున్న దృశ్యాన్ని చూస్తాడు. తన తండ్రి సీరియల్ కిల్లర్ అని తెలిసిన తర్వాత, అతను తనను తాను ద్వేషించడం ప్రారంభిస్తాడు. తన రక్తం చెడ్డదని, మంచి రక్తం తాగితే తాను కూడా మంచివాడు అయిపోతాడాని భావిస్తాడు.


Read Also : భర్త కళ్ల ముందే సీరియల్ కిల్లర్ భార్యతో అలా.. ప్రభాస్ విలన్ డేంజరస్ షాకింగ్ మూవీ

కొత్త స్కూల్ లో యాంగ్-హో ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. స్కూల్లో పిల్లలు అతన్ని ఏడిపిస్తూ ఉంటారు. అయితే సియోల్ నుండి వచ్చిన కొత్త విద్యార్థిని జి-సూ (కిమ్ హ్యూన్-సూ)తో స్నేహం కుదురుతుంది ఆ పిల్లాడికి. జి-సూ ఒక రోజు జూ-హ్యూప్ గతంలో చేసిన హత్యను గుర్తు చేసుకుంటుంది. ఆమె అతని నిజ స్వరూపాన్ని (సీరియల్ కిల్లర్) తెలుసుకుంటుంది. ఈ రహస్యం బయటకు వస్తే తన జీవితం, కొడుకు భవిష్యత్తు నాశనమవుతాయని భయపడిన జూ-హ్యూప్, జి-సూను చంపాలని అనుకుంటాడు. అయితే ఈ నిర్ణయం అతని కొడుకు యాంగ్-హో జీవితంలో పెను సంఘర్షణకు దారితీస్తుంది. మరి చివరికి ఆ పిల్లను హీరో చంపేశాడా? ఆ పిల్లాడు స్నేహితురాలిని రక్షించుకోవడానికి ఏం చేశాడు? అన్నది స్టోరీ. సినిమాలో హత్యలు, మెంటల్ టార్చర్, పిల్లలకు సంబంధించిన హింసాత్మక థీమ్స్ ఉన్నాయి. కాబట్టి 16+ కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు చూడకపోవడమే బెటర్.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×