E-Paper
Advertisement

టీన్ గ్యాంగ్‌లోకి కొత్త కుర్రాడు… అతని చుట్టూనే వరుస హత్యల మిస్టరీ

టీన్ గ్యాంగ్‌లోకి కొత్త కుర్రాడు… అతని చుట్టూనే వరుస హత్యల మిస్టరీ
Advertisement

Psychological Crime Thriller: 1980ల నాటి అమెరికా… విలాసవంతమైన జీవితం గడిపే టీనేజర్లు… ప్రతిష్టాత్మకమైన స్కూల్… వీరి మధ్యలోకి అనుకోకుండా అడుగుపెట్టిన ఓ కొత్త కుర్రాడు… అతను వచ్చిన తర్వాతే నగరంలో వరుస హత్యలు మొదలవుతాయి. అసలు ఆ హత్యలకు, ఆ కొత్త కుర్రాడికి ఏమైనా సంబంధం ఉందా ? ఇదంతా ఓ టీనేజర్ భ్రమేనా ? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలతో తెరకెక్కిన సరికొత్త సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ది షార్డ్స్’ (The Shards 2026). ప్రముఖ రచయిత బ్రెట్ ఈస్టన్ ఎల్లిస్ ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ర్యాన్ మర్ఫీ, బ్రెట్ ఈస్టన్ ఎల్లిస్ కలిసి దీనిని టెలివిజన్ కోసం రూపొందించారు. ‘అమెరికన్ హారర్ స్టోరీ’ వంటి సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ర్యాన్ మర్ఫీ ఈ ప్రాజెక్ట్‌తో మరోసారి డార్క్, సైకలాజికల్ కథను తెరపైకి తీసుకొచ్చారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది ? స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అన్న వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

 

కథలోకి వెళ్తే…

Advertisement

కథ 1981లోని లాస్ ఏంజిల్స్‌లో జరుగుతుంది. బక్లీ అనే ప్రతిష్టాత్మక ప్రిపరేటరీ స్కూల్‌లో చదువుకునే 17 ఏళ్ల బ్రెట్ చుట్టూ కథ తిరుగుతుంది. బ్రెట్ ఓ మామూలు టీనేజర్ కాదు. అతనికి రచయిత కావాలనే ఆసక్తి ఉంటుంది. అతని చుట్టూ సంపన్న కుటుంబాలకు చెందిన స్నేహితుల గ్యాంగ్ ఉంటుంది. పార్టీలు, విలాసవంతమైన జీవితం, ప్రేమ, అసూయ, వ్యక్తిగత సంబంధాలు ఇలా వారి ప్రపంచం అంతా బయటికి ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ ఆ మెరుపు వెనుక చాలా చీకటి దాగి ఉంటుంది.

ఇలాంటి సమయంలో వారి స్కూల్‌లోకి రాబర్ట్ మల్లోరీ అనే కొత్త విద్యార్థి వస్తాడు. చూడటానికి ఆకర్షణీయంగా, తెలివిగా, కాన్ఫిడెంట్‌గా కనిపించే రాబర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. కానీ బ్రెట్ మాత్రం అతని విషయంలో మొదటి నుంచే ఏదో తేడా ఉందని భావిస్తాడు. రాబర్ట్ గతం గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడం బ్రెట్ అనుమానాలను మరింత పెంచుతుంది.

Advertisement

అదే సమయంలో లాస్ ఏంజిల్స్ నగరంలో టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యల వెనుక ‘ది ట్రావ్లర్’ అనే సీరియల్ కిల్లర్ ఉన్నాడనే భయం నగరమంతా వ్యాపిస్తుంది. రాబర్ట్ స్కూల్‌లోకి వచ్చిన సమయం, ఈ హత్యలు ప్రారంభమైన సమయం ఒకటే కావడంతో బ్రెట్ అనుమానం మరింత బలపడుతుంది. అసలు రాబర్ట్‌నే ఆ సీరియల్ కిల్లరా ? లేక బ్రెట్ అతనిపై పెంచుకున్న అనుమానం కేవలం అతని ఊహేనా ? అనే ప్రశ్న కథలో ప్రధాన మిస్టరీగా మారుతుంది.

ఇక్కడి నుంచి కథ కేవలం సీరియల్ కిల్లర్‌ను వెతికే ఇన్వెస్టిగేషన్‌గా కాకుండా, బ్రెట్ మానసిక స్థితి చుట్టూ కూడా తిరుగుతుంది. రాబర్ట్‌ను గమనించే కొద్దీ అతనిపై బ్రెట్‌కు ఆకర్షణ, ఆసక్తి, భయం అన్నీ కలగలిసి ఒక విచిత్రమైన ఫీలింగ్ ఏర్పడుతుంది. అతని స్నేహితుల ప్రపంచంలో కూడా అనుమానాలు పెరుగుతాయి. ఈ వ్యక్తిగత సంఘర్షణల మధ్యే బయట నగరంలో సీరియల్ కిల్లర్ హత్యలు కొనసాగుతుంటాయి. మరి ఇంతకీ కిల్లర్ ఎవరు ? ఆ టీనేజర్ కు ఈ హత్యలకు సంబంధం ఏంటి ? అన్నది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో అందుబాటులో ఉందా ?

మొత్తానికి ఒక కొత్త విద్యార్థి రాకతో మొదలైన అనుమానం… నగరంలో జరుగుతున్న వరుస హత్యలతో కలిసిపోయినప్పుడు అసలు నిజం ఏంటి ? అనే మిస్టరీతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది షార్డ్స్’. ఇందులో 1980ల వాతావరణం హైలెట్. ఆ కాలం నాటి లాస్ ఏంజిల్స్‌ను సంపద, ఫ్యాషన్, పార్టీలతో పాటు ఒక చీకటి భయానక ప్రపంచంగా చూపించే ప్రయత్నం చేశారు. అసూయ, ఆకర్షణ, హింస, ఒంటరితనం వంటి అంశాలను సీరియల్ కిల్లర్ మిస్టరీతో కలిపారు. అందుకే ఇది సాధారణ టీన్ డ్రామా కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్, క్రైమ్ డ్రామా, 80s స్లాషర్ హారర్ అంశాల కలయికలాగా కనిపిస్తుంది. ఇగ్బీ రిగ్నీ, హోమర్ గేర్, కయా గెర్బర్, వెస్ బెంట్లీ, ఇవాన్ రాచెల్ వుడ్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. సీజన్ 1లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆగస్ట్ 5న మొదటి రెండు ఎపిసోడ్లు ఒకేసారి విడుదల కాగా, మిగిలిన ఎపిసోడ్లు వారానికి ఒకటి చొప్పున విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ 9న సీజన్ ఫైనల్ ప్రసారం కానుంది. FX, Huluలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

Read Also: కూతురు కోసం హంతకుడిని నిర్దోషిగా… ఓటీటీని దద్దరిల్లేలా చేసిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ తెలుగులో

Tags

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×