E-Paper
Advertisement

నైట్ డ్యూటీలో నర్సు… లగ్జరీ వృద్ధాశ్రమంలో రాత్రిపూట జరిగే షాకింగ్ వ్యవహారం

నైట్ డ్యూటీలో నర్సు… లగ్జరీ వృద్ధాశ్రమంలో రాత్రిపూట జరిగే షాకింగ్ వ్యవహారం
Advertisement

Psychological Thriller on OTT: వృద్ధాశ్రమం అంటే ఎలా ఉంటుంది ? వృద్ధులతో, వాళ్ళని చూసుకునే కేర్ టేకర్లతో ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి చోటులో ఉద్యోగం దొరికితే ఇంకా పీస్ ఫుల్ గా ఉంటుంది. కానీ ఎలెనా అనే నర్సుకు మాత్రం ఒక లగ్జరీ వృద్ధాశ్రమంలో నైట్ డ్యూటీ దొరకడం లైఫ్ లో మరచిపోలేని ఘటనగా మారుతుంది. రాత్రయితే అక్కడ జరిగే కొన్ని అనుమానాస్పద వ్యవహారాలు, పగటి సమయంలో కనిపించే ఆ ప్రశాంత వాతావరణం వెనుక అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే (Night Nurse 2026) మూవీని చూడాల్సిందే. మరి ఈ మూవీ ఓటీటీలో ఉందంటే ?

కథలోకి వెళ్తే…

విండ్‌సోర్ మేనర్ అనే విలాసవంతమైన ప్రైవేట్ వృద్ధాశ్రమంలో నైట్ నర్స్‌గా ఎలెనా చేరుతుంది. కొత్త ఉద్యోగం కావడంతో మొదట్లో అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే కొన్ని రోజులకే మేనేజ్‌మెంట్, కొందరు సీనియర్ డాక్టర్లు రాత్రివేళల్లో వ్యవహరించే తీరు ఆమెకు అనుమానం కలిగిస్తుంది. అక్కడ కేవలం వైద్యం మాత్రమే జరగడం లేదని ఎలెనాకు క్రమంగా అర్థమవుతుంది. కొందరు ధనవంతుల బలహీనతలను ఉపయోగించుకుంటూ అనైతిక వ్యవహారాలు, డ్రగ్స్‌కు సంబంధించిన రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానం ఆమెకు వస్తుంది.

Advertisement

మొదట తన అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఎలెనా… చివరకు ఆ వ్యవస్థ వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే… అక్కడి వాళ్లు కూడా ఆమె ప్రతి కదలికను గమనిస్తున్నారు. ఎలెనా నిజాలను తెలుసుకునే కొద్దీ ఆమె చుట్టూ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి. చివరకు ఆమెనే మానసికంగా అస్థిరమైన వ్యక్తిగా చిత్రీకరించేందుకు స్టాఫ్ ప్రయత్నిస్తారు. తాను చెప్పేది నిజమే అయినప్పటికీ, తన మాటలను నమ్మే వాళ్లు ఉండరు.

ఇక్కడి నుంచి సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎలెనా ఎవరిని నమ్మాలి ? ఎవరిని నమ్మకూడదు ? అనే పరిస్థితిలోకి వెళ్తుంది. తనను మానసిక రోగిగా చూపించేందుకు జరుగుతున్న కుట్రను ఆమె ఎలా ఎదుర్కొంది ? వృద్ధాశ్రమం వెనుక దాగి ఉన్న అసలు నెట్‌వర్క్ ఏంటి ? చివరికి అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడగలిగిందా ? అనేదే మిగిలిన కథ.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

ఈ సినిమాలో వృద్ధాశ్రమం బ్యాక్‌డ్రాప్, రాత్రి వేళల్లో కనిపించే నిశ్శబ్ద వాతావరణం, డార్క్ లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ ఫీల్‌ను పెంచుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే రెండు కీలక ట్విస్టులు కథను ఊహించని మలుపు తిప్పుతాయి. అయితే సినిమా మొదటి అరగంట కొంచెం నెమ్మదిగా సాగడం మైనస్ పాయింట్. కథ అసలు ట్రాక్‌లోకి వచ్చిన తర్వాతే వేగం పెరుగుతుంది. సైకలాజికల్ ఎరోటిక్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాను పెద్దలు మాత్రమే చూస్తే బెటర్. 1 గంట 42 నిమిషాల నిడివితో సాగే ‘నైట్ నర్స్’ను థ్రిల్లర్ మూవీ లవర్స్ డోంట్ మిస్. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్ కి అందుబాటులో ఉంది. ఇంగ్షీషులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: రాత్రిపూట అలాంటి శబ్దాలు… అదేంటని అడిగితే డిన్నర్ కి పిలిచి బంపర్ ఆఫర్

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×