Big Stories

Samantha: ఆ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: సమంత

Samantha: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో నటి సమంత ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్నారు.

- Advertisement -

తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకున్నారు.

- Advertisement -

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, ఫొటోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా చెన్నై సత్యభామ యూనివర్సిటీకి వెళ్లిన సమంత.. అక్కడ సందడి చేశారు.

‘మన ఊర్లో వారి ప్రేమ మనకు ఎప్పుడూ ప్రత్యేకం’ అనే క్యాప్షన్‌తో కొన్ని ఫొటోలు షేర్ చేశారు.

అందులో ఆమె చాలా అందంగా.. నవ్వుతూ కనిపించి అభిమానుల హృదయాలను దోచుకున్నారు.

ఇక దీంతోపాటు ఆమె రెడ్ కలర్ హాఫ్ శారీలో కనిపించి అందరినీ అట్రాక్ట్ చేసింది. ఒక్కో ఫొటోకు ఒక్కో రకమైన ఫోజులిచ్చి నెటిజన్లను కట్టిపడేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News