Mushroom Benefits: మష్రూమ్స్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కేలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉండే పుట్టగొడుగులు గుండె జబ్బులు, క్యాన్సర్ , మతిమరుపు వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి రోజూ మీ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి పోషక విలువలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
పుట్టగొడుగులలో రెండు ప్రధాన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవే ఎర్గోథియోనిన్, గ్లూటాథియోన్. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ శరీరానికి హాని కలిగిస్తాయి. అంతే కాకుండా వివిధ వ్యాధులకు దారితీస్తాయి. ప్రధానంగా ఎనిమిది రకాల పుట్టగొడుగులకు మనకు లభిస్తున్నాయి.
బటన్ పుట్టగొడుగులు:
ఈ పుట్టగొడుగులు తెలుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటాయి. ఎక్కువ మంది తినేవాటిలో ఇవి ముందు వరుసలో ఉంటాయి. వీటిలో విటమిన్లు బి, డి, సెలీనియం, రాగి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
ఆయిస్టర్ పుట్టగొడుగులు:
ఈ పుట్టగొడుగులు మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇవి అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. విటమిన్లు సి, బి12, ఫోలిక్ ఆమ్లం వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడతాయి.
షిటాకే పుట్టగొడుగులు:
ఈ పుట్టగొడుగులను ప్రత్యేకంగా రోగనిరోధక శక్తిని, గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి తినాలి. బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వారు పుట్ట గొడుగులను ఎక్కువగా తినాలి.
రీషి , టర్కీ టెయిల్ పుట్టగొడుగులు:
ఈ పుట్టగొడుగులను ఆయుర్వేద , ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు.
పుట్టగొడుగుల ప్రయోజనాలు:
– మధుమేహం, గుండె రోగులకు ఒక వరం.
– పుట్టగొడుగులు ప్రోటీన్, ఫైబర్ , పొటాషియం, సోడియం వంటి పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి మధుమేహంతో పాటు గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారికి అనువైన ఆహారం. వీటిని ప్రతి రోజు మీరు తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
– వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇవి సహాయపడతాయి. త్వరగా బరువు తగ్గాలని అనుకునే వారు పుట్ట గొడుగులను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
– పుట్టగొడుగులలోని ప్రోటీన్ ఉడికించిన తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇది శాఖాహారులకు మంచి ఎంపికగా మారుతుంది.
విషపూరిత పుట్టగొడుగులు తినకుండా ఉండండి:
పుట్టగొడుగులు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, అన్ని పుట్టగొడుగులు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
– డెత్ క్యాప్ , డిస్ట్రాయింగ్ ఏంజిల్స్ వంటి కొన్ని జాతులు విషపూరితమైనవి.
– కొన్ని సైకెడెలిక్ పుట్టగొడుగులు తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయి.
Also Read: షుగర్ ఉన్న వారికి ఈ పండ్లు వరం, ఎక్కడ దొరికినా వదలొద్దు !
ప్రతిరోజూ 5 పుట్టగొడుగులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఐదు చిన్న పుట్టగొడుగులను తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి
– గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
– క్యాన్సర్ , మతిమరపును నివారిస్తుంది.
– రోగనిరోధక శక్తిని పెంచుతుంది.