BigTV English

Ghaati Twitter Review: ‘ఘాటీ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Ghaati Twitter Review: ‘ఘాటీ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Ghaati Twitter Review: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుష్క  గిరిజన మహిళ పాత్రలో నటిస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన ఈ మూవీ అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని చాలామంది వెయిట్ చేస్తున్నారు.. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఇవాళ గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ మూవీలో అనుష్క కనిపిస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ మూవీకి రెస్పాన్స్ ఎలా ఉంది.. మూవీ రిజల్ట్ ఏంటి? నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంది. ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


స్వీటీ యాక్షన్ మోడ్ పర్వాలేదు. బీజిఎం ఇంకా బాగుండాలి. మాస్ డైలాగ్స్‌కి స్వీటీ వాయిస్ చాలా మధురంగా ​​ఉండటం మాత్రమే లోపం. అక్కడక్కడా కొన్ని సీన్లు తేలిపోయాయి.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

మొదటి సగం ప్రారంభం నుండి మధ్య మధ్యలో కొంత లాగ్ లాగ్ అనిపించింది, అయితే ఇంటర్వెల్‌కి ప్రీ ఇంటర్వెల్ వరకు అది పిచ్చిగా ఉంది. సీన్స్‌కి ప్రీ ఇంటర్వెల్ వెడ్డింగ్ సాంగ్ బాగా ఆకట్టుకుంది. ఇదే కొంచెం బెటర్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

సెకండ్ ఆఫ్ మొత్తం క్రేజీ ఫైట్స్ ఉన్నాయి.. ఇవి కాస్త ఆ సీన్ కు హైలెట్ అయ్యాయి. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. క్లైమాక్స్ లాగ్ అనిపిస్తుంది. మిగితా అంత బాగానే ఉంది. మూవీని చూడొచ్చు అంటూ ట్వీట్ చేశారు.

ట్రైలర్, గ్లింప్స్ ఏవి చూడకుండానే మూవీకి వచ్చాను.. ఫస్ట్ హాఫ్ బాగుంది.. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. స్వీటీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అని మరొకరు ట్వీట్ చేశారు.

సెకండాఫ్: క్రిమినల్ లెజెండ్

ఇది పూర్తిగా అనుష్కశెట్టి యొక్క ఆవేశం మరియు యాక్షన్ సన్నివేశాలు బాగా వర్కవుట్ చేయబడ్డాయి కానీ సంగీతం, bgm సినిమాలో అతి పెద్ద మైనస్.. కొన్ని సన్నివేశాలు ఆమె భావోద్వేగాలను అనుభూతి చెందేలా చేస్తాయి. అంటూ నెటిజన్ ట్వీట్ చేశారు.

ఘాటీ సినిమా బాగుంది. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంటుంది. ఆ తర్వాత సెకండాఫ్ అదిరిపోతుంది. ఓవరాల్‌గా ఈ సినిమా హిట్ ఫిలిం. స్వీటీ అనుష్క మాస్ పాత్రలో చూపించిన పెర్ఫార్మెన్స్ పిచ్చెక్కిస్తుంది. శీలావతి పాత్ర ఎప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకొనేలా ఉంటుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు..

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీ 2025 తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ షోలు నార్త్ అమెరికాతోపాటు ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రదర్శించబడ్డాయి. మొత్తానికి బీజీఎం సరిగ్గా లేదు. అదే సినిమాకు అతిపెద్ద మైనస్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సినిమా పర్వాలేదనే టాక్ వినిపిస్తుంది. మాస్ లుక్ లో అనుష్కను చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీని చూసేయ్యండి.. ఇక కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి..

Related News

Little Hearts Movie Review: లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ

Lokah – Chapter 1 : Chandra Review : ‘కొత్త లోక – చాప్టర్ 1: చంద్ర’ రివ్యూ… పవర్ ఫుల్ లేడీ సూపర్ హీరో

Tribanadhari Barbarik Review : ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ…. వీక్ స్క్రీన్ ప్లే -స్ట్రాంగ్ కంటెంట్

Ghaati Sensor Review : ఘాటీ సెన్సార్ రివ్యూ… టాక్ ఎలా ఉందంటే ?

Sundarakanda Movie Review : ‘సుందరకాండ’ రివ్యూ – స్లోగా సాగే టిపికల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా

Big Stories

×