Baapu Review : సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బాపు’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ప్రీమియర్స్ వేశారు మేకర్స్. మరి వారి నమ్మకం నిజమైందో? కాదో? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..
కథ :
మల్లయ్య(బ్రహ్మాజీ), భార్య సరోజ(ఆమని) తెలంగాణలోని ఒక గ్రామంలో వ్యవసాయం చేసుకుని బ్రతుకుతుంటారు. వాళ్లకి ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తుంటారు కానీ.. వాళ్లకి సరైన డబ్బు రాదు. పంటలు పండవు, పండిన పంటలకు డబ్బులు రావు. దీంతో ఊరంతా అప్పులు చేస్తుంటారు.దీంతో ఊళ్ళో వాళ్ళు.. ఇక అప్పులు ఇవ్వం అని మొహం పై చెప్పేస్తారు. కానీ పత్తికి మంచి డిమాండ్ ఉంది అని.. దాంతో అప్పులు తీర్చేస్తామని చెప్పడంతో.. వాళ్లకి నెల రోజులు టైం ఇస్తారు అప్పు ఇచ్చిన వాళ్ళు. లేదు అంటే వాళ్ళకి ఉన్న పొలం వేలం వేస్తామని కూడా చెబుతారు. మరి అలా అయినా మల్లయ్య పంట పండిందా? లేదా? మరోవైపు మల్లయ్య తండ్రి (సుధాకర్ రెడ్డి)ని చంపాలని.. మల్లయ్య కుటుంబం ఎందుకు ప్రయత్నిస్తుంది.? ఈ విషయం మల్లయ్య తండ్రికి తెలిసి ఏం చేశాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే ‘బాపు’ మిగతా సినిమా.
విశ్లేషణ : తెలంగాణ బ్యాక్ డ్రాప్లో అందులోనూ చావు బ్యాక్ డ్రాప్లో ‘బలగం’ సినిమా వచ్చింది. దాని స్పూర్తితో ఇంకా పలు సినిమాలు రూపొందాయి. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ‘బాపు’ వచ్చింది. ఇది కూడా ‘బలగం’ లా ఎమోషనల్ గా ఉంటుంది అనుకుంటే పొరపాటే. కథకి ఆ స్కోప్ ఉంది కానీ.. ఆ కోర్ ఎమోషన్ పూర్తిగా మిస్ అయ్యింది. డార్క్ హ్యూమర్ అనేది తెలుగు ప్రేక్షకులకి కొత్త జోనర్. కానీ మిగతా భాషల్లో అది సక్సెస్ ఫార్ములా. దర్శకుడు దయాకర్ రెడ్డి ‘బాపు’ కి ఒక జోనర్ ఫిక్స్ అవ్వాల్సింది. అయితే డార్క్ హ్యూమర్ లేదు అంటే ఎమోషనల్ డ్రామా. ఈ రెండూ మిక్స్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి అనుకోవడం.. వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ లో రైతుల కష్టాలు చూపించారు. కానీ మిగతా పాత్రల బ్యాక్ స్టోరీలు ల్యాగ్ గా అనిపిస్తాయి కానీ.. ఆసక్తిని కలిగించవు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కి పెద్దాయన్ని చంపేయాలని ఇంట్లో వాళ్ళు అంతా డిసైడ్ అవ్వడం.. అనేది సెకండాఫ్ పై క్యూరియాసిటీ పెంచుతుంది. కానీ సెకండాఫ్లో కామెడీ కరెక్ట్ వేలో పండలేదు. ఎమోషనల్ గా సాగాల్సిన క్లైమాక్స్ కూడా సిల్లీగా అనిపిస్తుంది. అసలు సినిమాకి ‘బాపు’ అనే టైటిల్ పెట్టి… హీరో తన తండ్రిని నాయనా అంటాడే కానీ.. తెలంగాణ స్టైల్లో ‘బాపు’ అని పిలవడు. సినిమాకి రైటింగ్ ఎంత వీకో ఈ ఒక్క పాయింట్ ను బట్టి చెప్పొచ్చు. అయితే రన్ టైం తక్కువగా ఉండటం.. సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ఆర్ ధృవన్ మ్యూజిక్ బాగున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే.. బ్రహ్మాజీ నటన కొత్తగా ఏమీ ఉండదు. కానీ ఇలాంటి పాత్ర అతను చేయడం కొత్త. అందువల్ల ఆడియన్స్ కొంతవరకు ఈ పాత్రతో ఎంగేజ్ అవ్వగలరు. ఆమని ఎందుకో బ్రహ్మాజీ కంటే ఎక్కువ వయసు ఉన్నట్టు కనిపించింది. ఈ పెయిర్ ఎందుకో సెట్ అయిన ఫీలింగ్ కలిగించదు. వీరి తర్వాత ఎక్కువ స్కోప్ ఉన్న రోల్ సుధాకర్ రెడ్డిది. కొన్ని చోట్ల నవ్వించాడు కానీ.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేంతలా లేదు ఆ పాత్ర. బహుశా అది దర్శకుడి లోపమే అయ్యి ఉండొచ్చు. ఇక ధన్య బాలకృష్ణ,అవసరాల శ్రీనివాస్, గంగవ్వ, మణి వంటి నటీనటులు ఉన్నారంటే ఉన్నారు అనుకోవాలి తప్ప.. అంతగా కనెక్ట్ కాని పాత్రలు వాళ్ళవి.
ప్లస్ పాయింట్స్ :
సినిమా రన్ టైం
ఇంటర్వెల్ ఎపిసోడ్
ఆర్.ఆర్.ధృవన్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ ను సరిగ్గా డీల్ చేయలేకపోవడం
స్క్రీన్ ప్లే..
మొత్తానికి.. ‘బాపు’ ఓటీటీలో చూస్తే కొంతవరకు బెటర్ ఫీల్ ఉంటుందేమో కానీ.. థియేటర్లలో ‘బలగం’ రేంజ్లో మెప్పించే సినిమా అయితే కాదు.
రేటింగ్ : 2/5