Max Movie Review: కన్నడ హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. ఇక్కడ విలన్ గా, విలక్షణ నటుడిగా ఫేమస్ అయ్యాడు. ‘విక్రాంత్ రోణ’ సినిమాతో హీరోగా కూడా ఇక్కడ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ‘మ్యాక్స్’ అంటూ మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అతనికి మరో సక్సెస్ ను ఇచ్చేలా ఉందా? అనే విషయాన్ని ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ
గణేష్ అలియాస్ గని భాయ్ (సునీల్) ఓ పార్టీని హోస్ట్ చేస్తాడు. అందులో పాల్గొన్న ఇద్దరు కుర్రాళ్ళు ఫుల్లుగా డ్రగ్స్ తీసుకుని.. ఓ లేడీ కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ఇద్దరి తండ్రులు మంత్రులే. ఈ క్రమంలో సీఐ మ్యాక్స్ అలియాస్ అర్జున్ మహాక్షయ్ (సుదీప్) వాళ్ళని అరెస్ట్ చేస్తాడు.తర్వాత ఆ కుర్రాళ్ళ తండ్రులు రౌడీలను వెంటేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అయితే ఆ ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయి పడుంటారు. వాళ్ళు ఎలా చనిపోయారు? ఆ టైంలో ఆ మంత్రుల రౌడీ బ్యాచ్ పోలీసులను ఏం చేశారు. పోలీసులకి మ్యాక్స్ అండ్ టీమ్ ఎలా అండగా నిలబడింది. లేడీ సీఐ రూప (వరలక్ష్మి శరత్ కుమార్) పాత్ర ఏంటి? వంటి ప్రశ్నలకి సమాధానమే ‘మ్యాక్’ మిగతా భాగం.
విశ్లేషణ
ఒక రాత్రి పోలీస్ స్టేషన్ నేపథ్యంలో జరిగే కథ, పైగా ఓ పార్టీ, డ్రగ్స్ వంటి వ్యవహారాలు మనకి టక్కున ‘ఖైదీ'(కార్తీ) చిత్రాన్ని గుర్తుచేస్తాయి. దర్శకుడు విజయ్ కార్తికేయ అలాంటి లైన్ నే తీసుకుని ‘మ్యాక్స్’ చేశాడు. సుదీప్ ఇమేజ్ కి తగ్గట్టు.. ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీన్స్ రాసుకున్నాడు. కానీ ఇది ‘ఖైదీ’ రేంజ్లో గ్రిప్పింగ్ నెరేషన్ తో సహజంగా సాగే కథ కాదు. అందులో ఉన్న లోతైన ఎమోషన్స్ ఇందులో ఉండవు. కేవలం సుదీప్ స్వాగ్, క్యారెక్టరైజేషన్ తో కథ నడిపించాలని చూశాడు దర్శకుడు. లోకేష్ కనగరాజ్ రేంజ్లో హై ఇచ్చే సీన్స్ ఏమీ రాయలేదు. యాక్షన్ సీక్వెన్స్..లు బాగున్నాయి. శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. నైట్ టైం కథ ఎక్కువగా సాగడం వల్ల అతనికి గట్టిగా పని తగిలింది. ప్రతి ఫ్రేమ్ సహజంగా అనిపిస్తుంది. అజనీష్ లోకనాథ్ సంగీతంలో రూపొందిన పాటలకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొంచెం లౌడ్ గా అనిపించినా.. యాక్షన్ సీక్వెన్స్..లు వంటివి ఎక్కువగా ఉండటంతో అది సెట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల విషయానికి వస్తే.. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సుదీప్ కటౌట్ కి, ఇమేజ్ కి మ్యాచ్ అయ్యే కథ ఇది. ఇతను ఈ సినిమా ఎక్కువగా మాట్లాడింది కూడా లేదు. మొత్తం యాక్షన్ సీన్స్ తోనే కానిచ్చేశాడు. కన్నడ ఆడియన్స్ కి ముఖ్యంగా అక్కడి మాస్ ఆడియన్స్ కి అది నచ్చుతుంది. తెలుగులో సుదీప్ ను అలా చూడాలని ఎంతమంది అనుకుంటారు? అలాంటి వాళ్ళు కథలో లోపాలు వెతకడం మొదలుపెడతారు. ఇక సుదీప్ తర్వాత ఇందులో వరలక్ష్మీ పాత్ర బాగుంది.ఆమె నటన కూడా ఆకట్టుకుంటుంది. సునీల్ కి మరో మంచి పాత్ర దొరికింది. తన వరకు బాగానే చేశాడు. కిరీటీ దామరాజు, అచ్యుత్ కుమార్ వంటి నటీనటులు ఓకే అనిపిస్తారు.
Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 రివ్యూ
ప్లస్ పాయింట్స్
యాక్షన్ సీన్స్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
పాటలు
మొత్తంగా.. ‘మ్యాక్స్’ .. కార్తీ ‘ఖైదీ’ కి 1.25 వెర్షన్లాంటి సినిమా. కథ, కథనాల గురించి పట్టించుకోకుండా కేవలం యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. మిగిలిన వారికి ఇది రొటీన్ రొట్టకొట్టుడు సినిమానే అనిపిస్తుంది.
రేటింగ్ : 2/5