BigTV English

Shastipootthi Review : ‘షష్టిపూర్తి’ మూవీ రివ్యూ…

Shastipootthi Review : ‘షష్టిపూర్తి’ మూవీ రివ్యూ…

shastipootthi Review : ‘ఈటీవీ విన్’ కంటెంట్ చాలా బెటర్’షష్టిపూర్తి’ మూవీ రివ్యూ : ‘ఈటీవీ విన్’ కంటెంట్ చాలా బెటర్రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో ‘షష్టిపూర్తి’ అనే సినిమా వచ్చింది. ఇళయ రాజా ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఈ హైలెట్స్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..


కథ:

శ్రీరామ్(రూపేష్ చౌదరి) ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇతను నిజాయితీపరుడు. అన్ని రూల్స్ కరెక్ట్ గా పాటిస్తాడు.అయినప్పటికీ ఇతన్ని చుట్టు పక్కన ఉన్నవాళ్లు, పక్కింటివాళ్లే ద్వేషిస్తూ ఉంటారు. మరోపక్క తల్లిదండ్రులు దివాకర్ (రాజేంద్ర ప్రసాద్), భువనేశ్వరి (అర్చన) కి కూడా ఇతను దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జానకి (ఆకాంక్ష సింగ్) శ్రీరామ్‌ కి దగ్గరవుతుంది. తర్వాత అతన్ని ప్రేమిస్తుంది. శ్రీరామ్ కూడా జానకిని ఇష్టపడతాడు. అయితే నిజాయితీగా ఉండే శ్రీరామ్ ను జానకి.. లంచగొండిగా మారుస్తుంది. దాని ద్వారా అందరూ దగ్గరవుతారు అని మేనిప్యులేట్ చేస్తుంది. ఇలాంటి టైంలో తన తల్లిని శ్రీరామ్ ఓ కేసు విషయంలో మోసం చేస్తాడు. మరోపక్క దివాకర్, భువనేశ్వరి విడాకులు తీసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇలాంటి టైంలో శ్రీరామ్ ఏం చేశాడు? జానకి.. శ్రీరామ్ ని లంచగొండిగా మార్చడం వెనుక.. ఉద్దేశం ఏంటి? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చివరికి శ్రీరామ్ తన తల్లిదండ్రులకి షష్టిపూర్తి ఎలా చేశాడు? అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.


విశ్లేషణ :

‘షష్టిపూర్తి’ అనే టైటిల్ చూస్తే ఆడియన్ కి కొత్తగా ఏదో చూడబోతున్నాము అనే ఫీలింగ్ ఇసుమంత కూడా రాదు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూశాం. ‘కలిసుందాం రా’ సినిమాలో హీరో తాత, బామ్మలకి షష్టిపూర్తి చేస్తారు. అందులో కూడా హీరో లాయర్. తర్వాత వచ్చిన ‘శతమానం భవతి’ లో కూడా దాదాపు ఇంతే. పైగా రాజేంద్రసాద్, అర్చన..ల మధ్య విడాకుల టాపిక్ వచ్చిన వెంటనే మైండ్లోకి వచ్చే సినిమా అదే. దర్శకుడు పవన్ ప్రభ ఎంచుకున్న పాయింట్.. ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేసేది కాదు. మరోపక్క హీరో నిజాయితీగా ఉండటం.. తల్లిదండ్రులకి దూరంగా ఉండడం.. ప్రియురాలు చెప్పింది అని అవినీతిని ఆశ్రయించడం, తల్లికి ఇచ్చిన మాట తప్పడం.. ఇలాంటి ట్రాక్..లు కూడా కన్వెన్సింగ్ అనిపించవు. కథ ఎక్కడో మొదలై.. ఇంకెక్కడికో వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. పాత కథలైనా.. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే.. ప్రెజెంటేషన్ ఉంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే రోజులే ఇవి. దర్శకుడికి అలాంటి సదుపాయం కూడా ఉంది. ఖర్చుకి వెనుకాడని నిర్మాత ఉన్నారు. ఇళయరాజా, తోటతరణి వంటి లెజెండ్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. ఇన్ని సువర్ణ అవకాశాలు ఉన్నా.. అతను వాడుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ పరమ బోరింగ్ గా సాగుతుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా వచ్చే ఎమోషనల్ సీన్స్ తీసేస్తే.. టార్గెటెడ్ ఆడియన్స్ సైతం ఓపిగ్గా కూర్చోలేని విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఏదో ఈటీవీ విన్ కోసం తీసిన ఓటీటీ కంటెంట్లా అనిపిస్తుంది తప్ప.. ఎక్కడా కూడా ఓ ఆరోగ్యకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ కలుగదు.

నటీనటుల విషయానికి వస్తే.. రాజేంద్ర ప్రసాద్ తన వరకు బాగా నటించాడు. ఎక్కడా తగ్గలేదు. సీనియర్ నటి అర్చన నేచురల్ పెర్ఫార్మన్స్ కూడా అందరితో మంచి మార్కులు వేయించుకుంటుంది. రూపేష్ అతనే నిర్మాత కాబట్టి.. హీరోగా చేశాడు. కాబట్టి.. అతను ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా సినిమాలో నటించిన నటీనటులు, సినిమా చూస్తున్న ప్రేక్షకులు భరించాల్సి వచ్చింది. ఆకాంక్ష ఆల్మోస్ట్ ఫేడౌట్ అయిపోయింది. ఈమె తప్ప హీరో పక్కన నటించడానికి వేరే హీరోయిన్ ఒప్పుకోకపోయి ఉండొచ్చు. పారితోషికం కోసమే అన్నట్టు ఆమె నటించింది. లుక్స్ పరంగా కూడా ఏజ్డ్ ఫీలింగ్ కలిగించింది. మిగతా నటీనటులు ఎలా చేసినా అతిగానే అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

క్యాస్టింగ్

మ్యూజిక్

ఆర్ట్ వర్క్

మైనస్ పాయింట్స్ : 

స్క్రీన్ ప్లే

డైరెక్షన్

మొత్తంగా… ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘ఈటీవీ విన్’ లో వచ్చే కంటెంట్ కూడా ఇంత బోర్ కొట్టించదు. ఎంతో ఓపిక ఉంటే తప్ప రెండున్నర గంటల పాటు థియేటర్లలో కూర్చునే సాయం చేయకపోవడం బెటర్

రేటింగ్ : 1/5

Related News

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Kingdom Review: కింగ్డమ్ ఫస్ట్ రివ్యూ.. ఆశ్చర్యపరుస్తున్న ఉమైర్ సంధు ట్వీట్!

Mandala Murders series review : ‘మండల మర్డర్స్’ సిరీస్ రివ్యూ… కన్ఫ్యూజింగ్ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×