BigTV English

3BHK Movie Review : ‘3BHK’ మూవీ రివ్యూ : డైలీ సీరియల్ వంటకం

3BHK Movie Review : ‘3BHK’ మూవీ రివ్యూ : డైలీ సీరియల్ వంటకం

3BHK Movie Review : సిద్దార్థ్ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ హీరో. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా అతని థియేట్రికల్ మార్కెట్ డౌన్ అయ్యింది. అయితే ఓటీటీ మార్కెట్ బాగానే ఉంది. అతని లేటెస్ట్ మూవీ ‘3BHK’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇదెలా ఉందో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :


కథ :
వాసుదేవ్ (శరత్ కుమార్) శాంతి (దేవయాని) దంపతులు ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు ప్రభు (సిద్ధార్థ్), కూతురు ఆర్తి (మీథా రఘునాథ్). వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో తమ ఇల్లు చిన్నది అయిపోయింది.. అది కూడా కంఫర్ట్ గా లేదు అనే భావన వారిలో కలుగుతుంది. దీంతో సొంత ఫ్లాట్ కొనుక్కోవాలని ప్రయత్నాలు మొదలుపెడతారు. కానీ పిల్లల చదువుల గురించి ఆలోచింది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రభు సరిగ్గా తన చదువు మీద కాన్సెన్ట్రేట్ చేయలేకపోతాడు. తర్వాత అతను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తండ్రితో మాట్లాడే స్వాతంత్రాన్ని కోల్పోతాడు. మరోపక్క ఐశ్వర్య (చైత్ర జే ఆచార్) ప్రభు ప్రేమించుకుంటారు. వాళ్ళ ప్రేమ వ్యవహారం ఏ తీరానికి చేరింది? ఈ ప్రశ్నలకి సమాధానమే ‘3BHK’ మిగిలిన సినిమా అని చెప్పాలి.

విశ్లేషణ :
ఈరోజుల్లో సొంతిల్లు కోసం పరితపించని మధ్య తరగతి కుటుంబం అంటూ ఉండదేమో. ఒకప్పటిలా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే పరిస్థితులు లేవు. ఉన్నా తక్కువే. దీంతో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కొని అద్దె బదులు దానికి ఈ.ఎం.ఐ పే చేసుకుంటే చాలు అనుకునే మధ్య తరగతి కుటుంబాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. సరిగ్గా ఆ పాయింట్ మీదే ‘3BHK’ తీశారు. ఇది యూనివర్సల్ అప్పీల్ ఉన్న లైన్. అందుకే ఈ సినిమా ట్రైలర్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇక సినిమాలో ఈ పాయింట్ చుట్టూ అల్లిన కథలు కూడా అందరికీ రిలేట్ అయ్యేలానే ఉంటాయి. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే తల్లిదండ్రులు.. వారి ఆర్థిక సమస్యలు, కళ్ళ ముందు పిల్లలు ఎదుగుతుంటే తెలీకుండానే తల్లిదండ్రుల్లో పెరిగే ఒత్తిడి. ఈ క్రమంలో వారు వదులుకునే సౌలభ్యాలు వంటివి కూడా ఇందులో చూపించాడు దర్శకుడు శ్రీ గణేష్.


ఇందులో సిద్దార్థ్ ట్రాక్ చాలా సినిమాల్లో చూసినదే. కొడుకుని ఉన్నత స్థాయిలో చూడాలనుకునే మధ్య తరగతి తండ్రి, చదువు వంటిబట్టక తిరిగే కొడుకు.. ఇవి కూడా ‘గౌతమ్ నంద’ నుండి ‘నీదీ నాదీ ఒకే కథ’ వంటి సినిమాల్లో చూశాం. అలాంటి సీన్లే ఇందులో కూడా ఉంటాయి. సినిమా ప్లాట్ అందరికీ కనెక్ట్ అయ్యేదే. కానీ సినిమా నిండా మన కష్టాలనే చూపిస్తూ ఉంటే.. ‘ఇక్కడ కూడా ఇదే తంతా’ అనే ఫీలింగ్ టికెట్ కొనుక్కుని సినిమా చూసే ఏ ప్రేక్షకుడికైనా కలుగుతుంది. ‘3BHK’ చూస్తున్నప్పుడు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ప్రేక్షకుడు అన్ని సమస్యలు పక్కన పెట్టేసి సినిమాకి వెళ్ళేది ‘కాసేపు ఎంటర్టైన్ అయ్యి రీ ఫ్రెష్ అవ్వడానికి’. అలాంటిది మళ్ళీ మన సమస్యలే థియేటర్లో కనిపిస్తుంటే ప్రేక్షకుడు థియేటర్ నుండి లేచి వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు.

‘లక్కీ భాస్కర్’ అనే సినిమాలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలు చూపించారు. కానీ ఎంత మోతాదులో చూపించాలో అంత వరకే చూపించి.. ఎంటర్టైన్మెంట్ మోడ్ కి ఆడియన్స్ ని షిఫ్ట్ చేశారు. ఆ ప్రయత్నం శ్రీ గణేష్ చేయలేదు. తమిళ జనాలకి చివరి వరకు ట్రాజెడీ ఉన్నా అడ్జస్ట్ అయ్యి చూసేస్తారు. మన తెలుగు ప్రేక్షకులు అలా కాదు కదా. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమాని ఎక్కువగా చూడాలనే ఆశతో ప్రమోషన్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసినట్టు ఉన్నారు. టెక్నికల్ గా కూడా ఇందులో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ ఉండవు.

నటీనటుల విషయానికి వస్తే… సిద్దార్థ్ నటన ఇందులో కొత్తగా ఏమీ అనిపించదు. బహుశా అతను బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు ఎక్కువగా చేయడం వల్ల ఏమో. శరత్ కుమార్ మాత్రం తన పాత్రలో జీవించేశాడు. దేవయాని కూడా ఎక్కడా తగ్గలేదు. మిగతా నటీనటులు ఓకే.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
అందరికీ రిలేట్ అయ్యే పాయింట్

మైనస్ పాయింట్స్ :

స్లో నెరేషన్
సెకండాఫ్

మొత్తంగా ‘3BHK’ ని థియేటర్ కి వెళ్లి చూడాలంటే చాలా ఓపిక కావాలి. డైలీ సీరియల్స్ చూసే బ్యాచ్ అయితే దీన్ని ఓటీటీకి వచ్చాక చూసుకోవడం బెటర్.

3BHK Movie Rating : 2.25/5

Related News

Paradha Review: ‘పరదా’ రివ్యూ : గుడ్డినమ్మకం పనికిరా(లే)దు 

Tehran Movie Review : ‘టెహ్రాన్’ మూవీ రివ్యూ… యాక్షన్‌‌తో దుమ్మురేపే గ్లోబల్ స్పై థ్రిల్లర్

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

WAR 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. జస్ట్ వార్ – నో రోర్

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

War 2Twitter Review : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Big Stories

×