రివ్యూ : ‘ఉప్పు కప్పురంబు’ మూవీ
నటీనటులు : కీర్తి సురేష్, సుహాస్, బాబూ మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి, సుభలేఖ సుధాకర్ తదితరులు
ఓటీటీ : Amazon Prime Video
దర్శకత్వం : ఐ.వి. శశి
నిర్మాత : రాధిక లవు
సంగీత దర్శకుడు : స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రాఫర్ : దివాకర్ మణి
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
Uppu Kappurambu Review in Telugu : కీర్తి సురేష్, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ మూవీ ‘ఉప్పు కప్పురంబు’. ‘నిన్నిలా నిన్నిలా’ ఫేమ్ అని ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
‘ఉప్పు కప్పురంబు’ మూవీ 1990లలో చిట్టి జయపురం అనే గ్రామంలో జరిగే కామెడీ డ్రామా. అపూర్వ (కీర్తి సురేష్) తన తండ్రి మరణం తర్వాత వంశపారంపర్యంగా గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తుంది. తను అమ్మాయి అనే కారణంతో ఆమె నాయకత్వాన్ని భీమయ్య (బాబూ మోహన్), మధుబాబు (శత్రు) వంటి కొంతమంది వ్యక్తులు వ్యతిరేకిస్తారు. ఈ క్రమంలోనే ఒక రోజు స్మశానం కాపలాదారు చిన్న (సుహాస్) ఒక వింత సమస్యను లేవనెత్తుతాడు. గ్రామ స్మశానంలో కేవలం నలుగురిని సమాధి చేయడానికి మాత్రమే స్థలం ఉందనేది ఆ సమస్య. మరి ఈ సమస్యకు అపూర్వ, చిన్నా కలిసి ఎలాంటి పరిష్కారాన్ని కనిపెట్టారు? ఈ క్రమంలో నెలకొన్న గందరగోళం ఏంటి? చిన్నా ఎమోషనల్ స్టోరీ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ
ప్రస్తుత సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో స్మశాన స్థలం కొరత అనేది కూడా ఒకటి. ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో ఫ్రెష్ ఫీల్‌ను అందించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అది నిజంగా ప్రశంసించదగ్గ విషయమే. కానీ దాన్ని ఎంగేజింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆయన తడబడ్డట్టు కన్పిస్తుంది. శ్మశానంలో స్థలం కొరత అనే పాయింట్ ను ఆవిష్కరించే క్రమంలో అసలు కథ పక్కదారి పట్టినట్టు అన్పిస్తుంది. సినిమా మొదటి 20-30 నిమిషాలు నెమ్మదిగా సాగుతాయి. కీర్తి సురేష్ నటించిన సన్నివేశాలు అతిగా అన్పించి, ఇబ్బందిని కలిగిస్తాయి. కామెడీ సన్నివేశాల్లో సహజత్వం కరువవ్వడంతో పెద్దగా పేలలేదు. అపూర్వ పాత్ర మొదట్లో అతిగా డ్రామాటిక్‌గా అనిపిస్తుంది.
అయితే ఫస్టాఫ్ ను సాగదీసినప్పటికీ, సెకండాఫ్ లో స్టోరీ ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టు అని చెప్పవచ్చు. ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు మూవీకి తగ్గట్టుగా ఉన్నాయి.
కీర్తి సురేష్ యాక్టింగ్ మొదట్లో అతిగా అన్పిస్తుంది. అయితే రానురాను ఆమె సెటిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. సుహాస్ సినిమాకు బ్యాక్‌బోన్. చిన్నా పాత్రలో అతని సహజమైన నటన, ఎమోషనల్ డెప్త్, స్క్రీన్ ప్రెజెన్స్ కీలక సన్నివేశాలను ఎలివేట్ చేస్తాయి. చిన్నా, అతని తల్లి మధ్య సన్నివేశాలు హార్ట్ టచింగ్ గా ఉంటాయి. బాబూ మోహన్, శత్రు వంటి సపోర్టింగ్ యాక్టర్స్ తమ కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకుంటారు. కానీ రవితేజ నన్నిమాల్, విష్ణు ఓఐ ఓవర్ యాక్టింగ్ కథ సహజత్వాన్ని దెబ్బతీస్తాయి. తాళ్లూరి రామేశ్వరి పాత్ర కీలకం. ఆమెకు ఇందులో మంచి పాత్ర పడింది.
ప్లస్ పాయింట్స్
కీర్తి సురేష్, సుహాస్ యాక్టింగ్
సెకండాఫ్
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
అతిగా అన్పించే కామెడీ
మొత్తంగా
కీర్తి సురేష్, సుహాస్ కోసం ఓసారి చూడొచ్చు.
Uppu Kappurambu Movie Rating : 1.25/5