Northamptonshire: యూకేలో చిన్న పొరపాటు వల్ల కంపెనీ మొత్తమే మూసివేతకు గురైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2023లో యూకేకి చెందిన 158 ఏళ్ల నాటి కేఎన్‌పీ లాజిస్టిక్స్ కంపెనీ హ్యాకర్ల దృష్టిలో పడింది. ఉద్యోగి వీక్ పాస్‌వర్డ్ కారణంగా కంపెనీ హ్యాకర్ల దాడికి గురైంది. దీంతో కంపెనీ దివాలా తీసి, 700 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. యునైటెడ్ కింగ్‌డమ్, నార్తాంప్టన్‌షైర్‌లోని కేఎన్‌పీ రవాణా సంస్థ, నైట్స్ ఆఫ్ ఓల్డ్ బ్రాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుని 500 లారీలను నిర్వహిస్తోంది. అకిరా అనే హ్యాకర్ ఓ ఉద్యోగి పాస్‌వర్డ్‌ను గుర్తించి.. డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి, కీలక వ్యవస్థలను లాక్ చేశాడు. ఈ హ్యాకర్ దాడి కారణంగా సంస్థ ఆపరేషన్స్ అన్ని స్తంభించాయి.
రూ.58 కోట్లు డిమాండ్ చేశారు.. అయినా..
హ్యాకర్లు డేటా అన్‌లాక్ చేయడానికి దాదాపు 58 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కానీ కేఎన్‌పీ రవాణా సంస్థ ఇంత మొత్తంలో డబ్బులు చెల్లించడానికి ఒప్పుకోలేదు. ఈ కంపెనీకి సైబర్ దాడులకు వ్యతిరేకంగా బీమా ఉన్నప్పటికీ.. అలాగే ఇండస్ట్రీ ఐటీ ప్రమాణాలను పాటించినప్పటికీ.. ఈ హ్యాకర్ దాడిని అడ్డుకోలేక పోయింది. డేటా ఎన్‌క్రిప్షన్ కారణంగా సంస్థ ఆర్థికంగా కుదేలై, చివరికి మూతపడింది. ఈ ఘటన సైబర్ భద్రతలో చిన్న లోపం కారణంగా.. కంపెనీ ఎంత భారీ నష్టానికి దారితీస్తుందో స్పష్టం చేసింది. కేఎన్‌పీ డైరెక్టర్ పాల్ అబాట్ ఈ దాడికి కారణమైన ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం ‘మీ పాస్‌వర్డ్ లోపం కారణంగా సంస్థ మూతపడిందని.. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు’ అని ప్రశ్నించారు.
స్ట్రాంగ్ పాస్‌వర్డులు తప్పనిసరి..
యూకేలో రాన్సమ్‌వేర్ దాడులు పెరుగుతున్నాయని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ) వార్నింగ్ ఇచ్చింది. గత రెండేళ్లలో ఇలాంటి దాడులు దాదాపు రెట్టింపు అయ్యాయని, 2025 సైబర్ దాడులు అత్యంత ఎక్కువగా సంవత్సరంగా నిలిచే అవకాశం ఉందని నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌సీఏ) తెలిపింది. ఎమ్‌అండ్‌ఎస్, కో-ఆప్, హ్యారోడ్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఇటీవల సైబర్ దాడుల బారిన పడ్డాయి. ఈ ఘటన సంస్థలు తమ సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు, రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్‌లు, ఉద్యోగులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం ఇలాంటి దాడులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: Viral Video: అసలు వీడు మనిషేనా.. యువతిని కాలుతో తన్నుతూ.. జుట్టు పట్టుకుని.. వీడియో వైరల్
ALSO READ: Monkey Video Viral: హోటల్‌లో టిఫిన్ చేసిన కోతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్