E-Paper
Advertisement

ఏసర్ నుంచి 3 కొత్త ల్యాప్‌టాప్‌లు.. కానీ ఆ ఒక్క మోడల్ జోలికి వెళ్లకపోవడమే బెటర్!

ఏసర్ నుంచి 3 కొత్త ల్యాప్‌టాప్‌లు.. కానీ ఆ ఒక్క మోడల్ జోలికి వెళ్లకపోవడమే బెటర్!
Advertisement

Aspire Pro Laptop: ప్రస్తుతం ర్యామ్, స్టోరేజ్ ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఏసర్ సంస్థ భారత్‌లో Swift Pro, Aspire Pro, Aspire 3 పేరుతో మూడు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. వేర్వేరు బడ్జెట్ విభాగాల్లో వచ్చిన ఈ మోడళ్లలో ఏది కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

మెరుగైన పనితీరుతో Swift Pro:

ప్రీమియం కేటగిరీలో వచ్చిన Swift Pro రూ.79,999 ప్రారంభ ధరతో లభిస్తోంది. దీనిలో ఇంటెల్ కోర్ అల్ట్రా 5/7 హెచ్ సిరీస్ ప్రాసెసర్లు, 14 అంగుళాల అద్భుతమైన ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 32GB వరకు ర్యామ్, 1TB ఎస్‌ఎస్‌డీ ఇచ్చారు. డిజైన్, ఫీచర్ల పరంగా ఇది ఇచ్చే ధరకు పూర్తిగా న్యాయం చేస్తుంది.

Advertisement

Also Read: ఇక OTTల పని ఖేల్ ఖతం.. గూగుల్ టీవీలో ఉచితంగా 10,000 సినిమాలు, షోలు!

బడ్జెట్ యూజర్ల కోసం Aspire 3:

తక్కువ బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్ కోరుకునే వారి కోసం Aspire 3 అందుబాటులోకి వచ్చింది. రూ.39,999 ప్రారంభ ధరతో వచ్చే ఈ మోడల్‌లో 15.6 అంగుళాల స్క్రీన్, ఎఎమ్‌డీ రైజెన్ ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB ఎస్‌ఎస్‌డీ ఇచ్చారు. రోజువారీ అవసరాలకు, విద్యార్థులకు ఇది బెస్ట్ ఆప్షన్.

మధ్యస్థ ధరలో Aspire Pro:

Advertisement

రూ.69,999 ధరకు వచ్చిన Aspire Pro మోడల్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రొసెసర్, 16GB ర్యామ్, 512GB ఎస్‌ఎస్‌డీ ఇచ్చారు. అయితే ఈ ధరకు ఇందులో ఓఎల్ఈడీ డిస్‌ప్లే గానీ, కనీసం ఫింగర్‌ప్రింట్ స్కేనర్ గానీ ఇవ్వకపోవడం కాస్త నిరాశపరుస్తుంది.

మూడింటిలో ఏది బెస్ట్?

ప్రస్తుత మార్కెట్ ధరలను బట్టి చూస్తే Swift Pro, Aspire 3 మోడళ్లు పెట్టే ప్రతి రూపాయికి పూర్తి విలువను ఇస్తాయి. కానీ Aspire Pro విషయంలో మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. అంత బడ్జెట్ పెట్టి కీలక ఫీచర్లు లేని ల్యాప్‌టాప్ కొనడం కంటే మరో రూ.10 వేలు కలిపి నేరుగా Swift Pro కొనుగోలు చేయడమే తెలివైన పని.

Also Read: రోబోటిక్ గింబల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ లాంచ్.. ఇక ట్రైపాడ్ అక్కర్లేదు, ధరెంతంటే?

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×