E-Paper
Advertisement

ఇండియాలో జ‌రిగే ప్ర‌తీ నిర‌స‌న వెనుక స్క్రిప్ట్ ఉంటుంది..మోడీ, శ్రీరాముడిని తిట్టేందుకే కుట్ర‌లు

ఇండియాలో జ‌రిగే ప్ర‌తీ నిర‌స‌న వెనుక స్క్రిప్ట్ ఉంటుంది..మోడీ, శ్రీరాముడిని తిట్టేందుకే కుట్ర‌లు
Advertisement

Danish Kaneria On India:  పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) తీసుకునే నిర్ణయాలను నిత్యం విమర్శించే ఆయన… ఇండియాకు సపోర్ట్ గానే మాట్లాడుతుంటారు. ముఖ్యంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే, ఇచ్చి పడేస్తారు. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ పాలిటిక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ( Danish Kaneria). ఇండియాలో జరిగే ప్రతి నిరసన వెనుక ఒక స్క్రిప్ట్ ఉంటుందని బాంబు పేల్చారు. ఈ అంశం తనను కలవర పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచేలా భారతదేశంలో రాజకీయాలు కొనసాగుతున్నాయని సీరియస్ అయ్యారు. ఇది హిందూ ధర్మానికే చేటు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ఇండియాలో జ‌రిగే ప్ర‌తీ నిర‌స‌న వెనుక స్క్రిప్ట్ ఉంటుంది

ఇండియాలో మొన్నటి వరకు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్ ఎక్కారు. కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగిన నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ నిరసనలలో పాల్గొన్నాయి. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేయడం జరిగింది. అయితే ఈ నిరసనలు దాదాపు రెండు వారాలపాటు జరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం గురించే చర్చ జరిగింది.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

ఈ విషయంపైనే తాజాగా డానిష్ కనేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో జరిగే ప్రతి నిరసన కార్యక్రమం వెనుక స్క్రిప్ట్ ఉంటుందని బాంబు పేల్చారు. కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఓ శక్తి ఉందని.. కుట్ర లో భాగంగానే వాళ్లు నిరసనలకు దిగారని ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీని గ‌ద్దె దించేందుకు ఈ నిర‌స‌న‌లు చేశార‌ని ఆగ్ర‌హించారు. దీనిపై ఉన్న‌త స్థాయి అధికారుల‌తో విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేశారు డానిష్ కనేరియా.

మోడీ, శ్రీరాముడిని తిట్టేందుకే నిర‌స‌న‌లు

Advertisement

జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసనలలో సమస్యలపై నిర్ణయాత్మకమైన చర్చలు లేదా పరిష్కారాలపై ఎలాంటి ఫోకస్ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేయలేదని ఆరోపణలు చేశారు డానిష్ కనేరియా. కేవలం శ్రీరాముడు, ఇండియా, హిందుత్వం, ప్రధాని నరేంద్ర మోడీని దూషించడమే లక్ష్యంగా ఈ నిరసనలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ శక్తులు దేశంలో అశాంతిని రేకెత్తించి… శత్రు దేశాలకు సహకరిస్తున్నాయని కూడా బాంబు పేల్చారు. ప్రతిపక్షాల నిరసనలు ఓ సర్కస్ లాగా తయారయ్యాయని మండిపడ్డారు. దీనిపై మోడీ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

Related News

రూ.25 కోట్ల ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ ను చెడుగుడు ఆడేసుకున్న‌ బంగ్లా బౌల‌ర్

స్టీవ్ స్మిత్ అల్ట్రాఎడ్జ్ పై వివాదం..పెవిలియ‌న్ కు వెళ్లిన వాడిని మ‌ళ్లీ పిలిచిన అంపైర్లు

ఏషియ‌న్ గేమ్స్ లో దిక్కుమాలిన రూల్స్‌…టీమిండియాకు అన్యాయం, సేఫ్ జోన్ లో పాక్ ?

కంగారులు కాదు, వాళ్లు న‌ర‌రూప రాక్ష‌సులు…బంగ్లా బ్యాట‌ర్ల‌కు ఇక న‌ర‌క‌మే

బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

రాసి పెట్టుకోండి..ఐర్లాండ్ లాగానే టీమిండియాను ఆఫ్ఘ‌నిస్తాన్ చిత్తుగా ఓడిస్తుంది

Big Stories

Advertisement
×