E-Paper
Advertisement

ఇక OTTల పని ఖేల్ ఖతం.. గూగుల్ టీవీలో ఉచితంగా 10,000 సినిమాలు, షోలు!

ఇక OTTల పని ఖేల్ ఖతం.. గూగుల్ టీవీలో ఉచితంగా 10,000 సినిమాలు, షోలు!
Advertisement

Google TV Freeplay: ప్రస్తుతం చాలామంది నచ్చిన సినిమా లేదా ఏదైనా షో చూడాలంటే.. కచ్చితంగా ఓటీటీకు డబ్బులు చెల్లించాల్సిందే. ముఖ్యంగా కరోనా తర్వాత థియేటర్లకు వెళ్లడానికి ఇష్టపడని మూవీ లవర్స్ ఎక్కువ డబ్బులు ఓటీటీల కోసం ఖర్చుపెట్టడం కామన్‌గా మారిపోయింది. కానీ ఎలాంటి ఛార్జీలు లేకుండా, ఉచితంగానే నచ్చిన సినిమాలు, షోలు చూడగలిగితే ఆ మజానే వేరు కదా!

అలాంటి గుడ్ న్యూస్ ఒకటి గూగుల్ టీవీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తమ ‘గూగుల్ టీవీ ఫ్రీప్లే’ సర్వీస్‌ను అప్‌డేట్ చేసింది. టీవీ చూసే అనుభవాన్ని మరింత సులభంగా, వినోదాత్మకంగా మార్చేందుకు ఈ కొత్త మార్పులు తీసుకొచ్చింది.

పైసా ఖర్చు లేకుండానే..

Advertisement

గూగుల్ టీవీ ఫ్రీప్లే ఇప్పుడు ఏకంగా 10,000కి పైగా ఉచిత సినిమాలు, టీవీ షోలను తమ ఆన్‌-డిమాండ్ కేటలాగ్‌లో చేర్చింది. ఇప్పటివరకు లైవ్ ఛానెళ్లకు మాత్రమే పరిమితమైన ఈ సర్వీస్, ఇకపై మనకు కావాల్సిన కంటెంట్‌ను కావాల్సినప్పుడు చూసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దీనికోసం యూజర్లు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు.

Also Read: రోబోటిక్ గింబల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ లాంచ్.. ఇక ట్రైపాడ్ అక్కర్లేదు, ధరెంతంటే?

యాప్స్ ఇన్‌స్టాల్ అక్కర్లేదు..

Advertisement

సాధారణంగా ఏదైనా ఉచిత సినిమా చూడాలంటే వేరే వేరే థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ అప్‌డేట్‌తో ఆ గొడవ వదిలిపోయింది. గూగుల్ టీవీ వాడుతున్న వారు ప్రత్యేకంగా ఏ యాప్‌నూ ఇన్‌స్టాల్ చేసుకోకుండానే నేరుగా ఈ 10,000 ప్లస్ సినిమాలను ఎంజాయ్ చేయవచ్చు. ప్రసిద్ధ వినోద సంస్థలైన A24, లయన్స్ గేట్ వంటి భాగస్వాముల సహకారంతో ఈ భారీ లైబ్రరీని గూగుల్ రూ పొందించింది.

కొత్త సెక్షన్లు.. మరెంతో సమాచారం..

వాడుకోవడానికి వీలుగా గూగుల్ టీవీ రెండు ముఖ్యమైన విభాగాలను అందుబాటులోకి తెచ్చింది. ఉచితంగా లైవ్ టీవీ ఛానెళ్లు చూడాలనుకునే వారి కోసం ‘లైవ్ టీవీ’ ట్యాబ్, అలాగే నచ్చిన సినిమాలు, సిరీస్‌లు చూడటానికి ‘ఫ్రీ మూవీస్ అండ్ షోస్’ అనే కొత్త ట్యాబ్‌ను కేటాయించింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో 300కి పైగా ఉచిత లైవ్ ఛానెళ్లు కూడా అందుబాటులో ఉండటం విశేషం.

ఉచితంగా అన్‌లిమిటెడ్ వినోదం..

ఈ అప్‌డేట్ వల్ల వేర్వేరు యాప్‌ల ఇన్‌స్టాల్ చేసుకునే తలనొప్పి లేకుండా, ఒకేచోట లైవ్ ఛానెళ్లతో పాటు ఆన్-డిమాండ్ కంటెంట్ చూసే సదుపాయం కలుగుతుంది. ఇవన్నీ యాడ్స్ ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి.. యూజర్లు ఉచితంగానే ఈ సేవలను పొందవచ్చు. క్రమంగా అన్ని ప్రాంతాల యూజర్లకు ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఉచితంగా మంచి వినోదాన్ని కోరుకునే వారికి గూగుల్ టీవీ ఫ్రీప్లే ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

Also Read: కూల్ లుక్స్, టెన్సర్ G6 పవర్.. Pixel 11 Seriesలో ఇన్ని ప్రత్యేకతలా?

Tags

Related News

అబ్బా.. గూగుల్ ఏం ప్లాన్ చేసింది మావా.. Pixel Buds Pro 2లో దిమ్మతిరిగే ఫీచర్లు!

iPhone 18లో ఊహించని మార్పులు..చిన్నదైన డైనమిక్ ఐలాండ్, భారీగా ర్యామ్ పెరిగే ఛాన్స్!

ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షనా? బడ్జెట్‌లోనే.. పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్

ప్రతీ రోజూ 1.5GB డేటా ఇచ్చే.. రూ.330 లోపు జియో ప్లాన్స్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ ఫ్రీ!

6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్.. Vivo X300 FE కొత్త వేరియంట్ ధర, ఆఫర్ల పూర్తి వివరాలు!

BSNL బిగ్ ధమాకా ప్లాన్.. రూ. 319 కే 65 రోజుల వ్యాలిడిటీ.. ఇదేం ఆఫర్ బాబోయ్!

అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న..హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ!

షాకింగ్ ప్రైస్ డ్రాప్.. ఏకంగా రూ.45,000 తగ్గిన Galaxy S25 Edge, ఆఫర్ ఎలా పొందాలంటే?

Big Stories

Advertisement
×